Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కార్పొరేట్ల కోసమే బాడ్‌ బ్యాంక్‌

సి.పి. చంద్రశేఖర్‌

కొనుగోలు చేసిన మొండి బకాయిలను పైన పేర్కొన్న సంస్థలు వీలైనంత ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటాయి. రుణాలు ఇచ్చిన బ్యాంకులు తక్కువ మొత్తాలను మాత్రమే పొందగలుగుతాయి. ఈ రుణ బకాయిలను బ్యాంకులు అనుకున్న ధరకు మార్కెట్‌లో విక్రయించలేకపోతే ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆదుకోవల్సి ఉంటుంది. బ్యాంకులకు వచ్చిన నష్టం తిరిగి పూడ్చటం సాధ్యం కాదు. ఎటొచ్చి సామాన్య డిపాజిట్‌దారులు నష్ట పోతారు. ఆస్తులు బడా పెట్టుబడిదారులకు చేరతాయి. బ్యాంకులలో ఉన్న సంపదను కొద్దిమంది కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసమే ప్రభుత్వ విధానాలు దోహదం చేస్తున్నాయి.

బ్యాంకులలో ప్రత్యేకించి ప్రభుత్వరంగ బ్యాంకులలో మొండి బకాయిలు ఏమీ లేవని పుస్తకాలలో చూపించాలి. ఎలా చూపించాలని మోదీ ప్రభుత్వం ఆలోచించి రెండు ప్రతిపాదనలు చేసింది. ఒకటి బాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు. రెండ వది జాతీయ సంపద పునర్నిర్మాణ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఎఆర్సీఎల్‌). బాడ్‌ బ్యాంక్‌ కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చేందుకే ఏర్పాటు చేస్తున్నారు. సామాన్యుడి డిపాజిట్లను కార్పొరేట్ల పాల్జేస్తారు. బ్యాంకులలో ఉన్న మొండి బకాయిలను తక్కువ ధరకు ఈ సంస్థలు కొనుగోలు చేస్తాయి. భారత రుణ పరిష్కార కంపెనీ లిమిటెడ్‌ (ఐడీఆర్సీఎల్‌) మొండి బకాయిలను ఏదో విధంగా వీలైనంత ఎక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుంది. భారీగా పెరిగిన మొండి బకాయిల సమస్యను ఈ విధంగా ప్రభుత్వం పరిష్కరించాలని తలపెట్టింది. ప్రభుత్వ విధానాలే అపారంగా మొండి బకాయిలు పోగుపడటానికి దోహదం చేశాయి. మొండి బకాయిలను బాడ్‌ బ్యాంక్‌కి అప్పగించి మోదీ ప్రభుత్వం తన చేతులను కడిగేసుకోవాలని భావిస్తోంది. ముందుగా రూ.2 లక్షల కోట్ల విలువైన బకాయిలను విక్రయించి బ్యాంకులకు ఊరట కలిగిస్తారు.
భారతదేశంలో మొండి బకాయిల సమస్య తీవ్రంగా ఉంది. బడా వాణిజ్యవేత్తలకు అవసరమైన రుణాలను ఇప్పించేందుకు బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రభుత్వం ఉపయోగించుకున్నది. ప్రభుత్వానికి అనుకూలమైన కార్పొరేట్లకు రుణాల రూపంలో అందించిన ధనాన్ని రుణగ్రహీతలు తిరిగి చెల్లించకపోవటం మూలంగానే భారీగా మొండి బకాయిలు ఏర్పడ్డాయి. వాణిజ్యంలో నష్టాలు వచ్చాయని చెప్తూ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవటమే పెద్ద సమస్య. బ్యాంకుల ప్రమోటర్లు అత్యంత సంపద పోగు చేసుకుని బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని దిగజార్చి బయటకు వెళ్లిపోతున్నట్టు అనేక ఆధారాలున్నాయి. రుణాలు చెల్లించని కంపెనీ, దాని ప్రమోటర్లు రుణాల మొత్తాలను తిరిగి చెల్లించటం లేదు. అయితే కనీసం ఈ రుణాలకు ఇచ్చిన హామీలు లేదా కొల్లేటరల్‌ హామీ సంతకాలు చేసిన వారి నుండైనా వసూలు చేయాలి. రుణాలు తీసుకొన్న కొందరు కంపెనీ దివాళా ప్రకటించి అప్పులు చెల్లించటం లేదు. బాడ్‌ బ్యాంక్‌ ద్వారా రుణాలు వసూలు చేయటం ఈ ఆస్తుల (మొండి బకాయిలు) కొనుగోలుదారులపై ఆధారపడి ఉంటుంది.
మొండి బకాయిల సమస్యను ఈ విధంగా పరిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న బాడ్‌ బ్యాంక్‌ వ్యవస్థ ద్వారా బ్యాంకులు మొండి బకాయిలను విక్రయించటం ద్వారా భారీ మొత్తాలను నష్టపోతుంది. మొదటి విడతగా ఎన్‌ఎఆర్‌సీఎల్‌కు రూ.90వేల కోట్ల విలువైన మొండి బకాయిలను విక్రయించేందుకు నిర్ణయించారు. ఇలా విక్రయించటం ద్వారా కొద్ది రుణాలు తిరిగి వచ్చినా వాటితో బ్యాంకులు సంతృప్తి చెందాలని చూస్తున్నాయి. వ్యక్తులు బ్యాంకులకు చెల్లించవలసిన మొండి బకాయిలపై రుణ గ్రహీతలతో చర్చించి రుణ మొత్తాలను తగ్గించటం ద్వారా పరిష్కరించుకోవాలని కూడా తలపెట్టారు. రెండో విడత లక్ష కోట్ల రూపాయల విలువైన మొండి బకాయిలను విక్రయించాలని ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది.
వసూలు కావలసిన బకాయిల కంటే అతి తక్కువ విలువకు అమ్మివేస్తారు. ముందుగా ప్రభుత్వం బాడ్‌ బ్యాంక్‌కు రూ.30,600 కోట్లు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ ధనంతో బ్యాంకుల నుంచి మొండి బకాయిలను కొనుగోలు చేస్తారు.
ఈ విధంగా కొనుగోలు చేసిన మొండి బకాయిలను పైన పేర్కొన్న సంస్థలు వీలైనంత ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటాయి. రుణాలు ఇచ్చిన బ్యాంకులు తక్కువ మొత్తాలను మాత్రమే పొందగలుగుతాయి. ఈ రుణ బకాయిలను బ్యాంకులు అనుకున్న ధరకు మార్కెట్‌లో విక్రయించలేకపోతే ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆదుకోవల్సి ఉంటుంది. బ్యాంకులకు వచ్చిన నష్టం తిరిగి పూడ్చటం సాధ్యం కాదు. ఎటొచ్చి సామాన్య డిపాజిట్‌దారులు నష్ట పోతారు. ఆస్తులు బడా పెట్టుబడిదారులకు చేరతాయి. బ్యాంకులలో ఉన్న సంపదను కొద్దిమంది కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసమే ప్రభుత్వ విధానాలు దోహదం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img