Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

చట్టం అందరికీ ఒకటి కాదా!!

ఇప్పుడున్న వ్యవస్థలలో న్యాయవ్యవస్థ ఒకటి మాత్రమే బాగా పనిచేస్తుంది అని ప్రజలు భావిస్తున్నారు. అయితే నిన్న కోడి కత్తి కేసులో ముఖ్యమంత్రి తాను కోర్టుకివస్తే ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది అందువలన తన తరపున లాయర్‌ మాట్లాడతాడు అని చెప్పటం కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. ఎందుకంటేె గతంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి పర్యటనల వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అయిన సంఘటనలు ఉన్నాయి. నాలాంటివ్యక్తి ఎపుడైనా కోర్టుకి వెళ్ళాల్సివస్తే నాకు బస్సుకి డబ్బులు లేవు, నేను రాలేను అంటే కోర్టు ఊరుకుంటుందా? ఒకసారి విజయవాడలో ముఖ్యమంత్రి ఏదో కార్యక్రమం వలన గుంటూరు`విజయవాడ మధ్య ప్రయాణం మూడు గంటలు పట్టింది. అపుడు ఏమైంది ఈ ట్రాఫిక్‌ జామ్‌? షాపులు మూయించి బారికేడ్లు కట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించినపుడు ఏమైంది ? అపుడు గుర్తుకి రాలేదా ఈ ట్రాఫిక్‌ జాం! హైదరాబాద్‌ కోర్టుకి వెళ్లాలంటే 60 లక్షలు ప్రజాధనం ఖర్చు అవుతుందని నాంపల్లి కోర్టుకి ఎన్నిసార్లు ఎగనామం పెట్టలేదు ? ప్రజాధనంతో తనసొంత కేసులకు లాయర్లను ఉపయోగించి కోట్లు కోట్లు ఖర్చుపెట్టినపుడు ఈ 60 లక్షలు గుర్తుకి రాలేదా ! అయినా తనమీద ఎవరో కత్తితో దాడిచేసి, గాయపరిచిన కేసులో విజయవాడ కోర్టుకు వెళ్లి తనను కత్తితో ఎలా పొడిచింది చెప్పాలి గదా కోర్టుకి? మరి ఎందుకు వెళ్ళలేదు? ట్రాఫిక్‌ జామ్‌తో ప్రజలకు కలిగే ఇబ్బందులపై ముఖ్యమంత్రికి అవగాహన ఉంటే భవిష్యత్తులో ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ఒకప్రక్క ముఖ్యమంత్రి పోతుంటే, రెండో ప్రక్క ట్రాఫిక్‌కి మాములుగా అనుమతి ఇవ్వండి. ట్రాఫిక్‌ జామ్‌ అవ్వకుండా చూడండి. తాను కోర్టుకి వెళ్లాల్సివస్తే ట్రాఫిక్‌ జామ్‌, ఏదైనా ప్రారంభోత్సవాలకు మాత్రం జామ్‌లు ఉండాలా ! అందరికి ఒకే న్యాయం ఉండాలి.
నార్నె వెంకటసుబ్బయ్య

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img