Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

చరిత్రకు సంఫ్‌ు పరివార్‌ మతం రంగు

డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి

వాస్తవాలను, చరిత్రను వక్రీకరించటం, కొందరు చరిత్ర ప్రసిద్ధులను తమ వారిగా ప్రచారం చేసుకోవడం, సంఘటనలను తమవిగా చిత్రించి, ఇతరులపై బురద జల్లే టెక్నిక్‌లు సంఫ్‌ు పరివార్‌ ‘టూల్‌ కిట్‌’లో చాలా ఉన్నాయి. న్యూనతా భావంతోనే భారతదేశ చరిత్రను, రిపబ్లిక్‌ ఏర్పాటుచరిత్రను తిరగరాయడానికి పూను కున్నారు. సామ్రాజ్యవాదులను దేశంనుండి వెళ్లగొట్టేందుకు దేశప్రజలంతా ఒక్కటైపోరాడుతున్న దశలో ఆర్‌.ఎస్‌.ఎస్‌, మత ఛాందసులు బ్రిటీషు వారికి సహకరిస్తూ వారికి పూర్తిగా లొంగిపోయారు. ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ సీనియర్‌ నాయకుడు 1921లో జరిగిన మోప్లా తిరుగుబాటు ‘భారతదేశంలో తాలిబనీ భావజాలం వ్యక్తమైన మొదటి ఘటన’ అంటూ పూర్తిగా వక్రీకరించి ఆనాటి రైతు పోరాట వీరులను అవమానపరిచారు. మోప్లా రైతు పోరాట చరిత్ర ను వక్రీకరించి అది జిహాదీ అని కువ్యాఖ్యచేశారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న రైతులపోరాటంలో పాల్గొంటున్న వారిని ఖాలీస్థానీలని అవమానపరిచారు. ‘‘గత చరిత్ర, మూలాలు, సంస్కృతి పరిజ్ఞానం లేని ప్రజలు భూమిలోకి చొచ్చుకుపోయిన వేర్లులేని చెట్టు’’ అని జమైకా సామాజిక కార్యకర్త, రాజకీయ వేత్త మార్కస్‌గ్రెవి అన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం వివిధ రూపాలలో జరిగింది. ఈ రూపాలు ఒక వృక్షం అనుకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌కు అలాంటి పోరాట రూపం లేదు. అందువల్లనే చరిత్ర అనేవృక్షాన్ని పెకలించివేసి తప్పుడుసమాచారాన్ని చరిత్రగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక విభజనకు, ద్వేషం వెళ్లగక్కుతూ విచ్ఛిన్నకర ప్రచారం సాగిస్తున్నారు. మోప్లా పోరాటాన్ని ముస్లింల తిరుగుబాటు అని అవమానపరుస్తున్నారు. ఈ ధోరణి ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరించే విభజన భావజాలాన్ని సంతృప్తి పరచవచ్చు. దాదాపు శతాబ్ది కాలంగా దేశ ప్రజలలో ఒక తరగతి వారిని ‘ఇతరులుగా’ చూస్తూ మతం కోణాన్ని ప్రదర్శిస్తున్నారు. హిందూముస్లిం లేదా సిక్కు అని చూస్తూ తమ భావజాలం పరిధిలోకి రాని వారిని తిరస్కరిస్తున్నారు. స్వాతంత్య్ర ఉద్యమచరిత్రను ఎప్పుడూ మత కోణంలోనే చూస్తూ సమ్మిళిత పోరాట లక్షణాన్ని తిరస్కరించారు. ఇదే సమయంలో బ్రిటీష్‌ పాలకులను, స్థానికంగా వారితో కుమ్మక్కైన ప్రాంతీయ పాలకులను దించి వేసేందుకు జరిగిన వర్గ పోరా టాలను కించపరిచారు. స్వాతంత్య్ర పోరాటంలో మతం, కులం, ప్రాంతీయత భావాలు లేకుండా అన్ని తరగతుల ప్రజలు పాల్గొన్నారు. అన్ని విశ్వాసాలు కలిగిన ప్రజలు పోరాటంలో ఉన్నారు. ఛోటా నాగపూర్‌ ప్రాంతంలో బ్రిటీష్‌ పాలకులు, స్థానిక మద్దతుదారులపైన గిరిజనులు పోరాటం జరిపారని అది స్వర్ణ యుగ మని, అలాగే ధర్మరాజు పాలన అని తరుచుగా చెబుతుంటారు. అన్ని కులాలు కలిసిన సామాజిక బందిపోట్ల గ్రూపును ఏర్పాటు చేసిన బ్రాహ్మణుడు వాసుదేవ్‌ బల్వంత్‌రావు హిందూరాజ్యం స్థాపించాలని తలపెట్టాడు. ప్రజల సమీ కరణకు మతాన్ని ఉపయోగించుకున్నాడు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ, అలాగే ముస్లింలీగ్‌ ఏర్పడి ఒంటెద్దు పోకడలను అనుసరించాయి.
ప్రస్తుత కేరళ రాష్ట్రంలోని మలబారు ప్రాంతంలో ఒకానొకనాడు వర్తక వర్గంగా ఉన్న మోప్లాలు నేడు భూమిలేని రైతులుగా, రైతు కూలీలుగా ఉన్నారు. టిప్పుసుల్తాన్‌ నుండి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటీష్‌ పాలకులు భూమి రెవిన్యూ వ్యవస్థను మార్పు చేసి ఉప్పు, వెదురు లాంటి వస్తువులపై గుత్తాధిపత్యం సాధించారు. రైతులు పన్నులు చెల్లించటానికి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను కూడా అమ్ముకోవలసి వచ్చేది. 18621880 మధ్య కాలంలో భూమిపై పన్నును 250శాతం పెంచారు. దక్షిణ మలబారు తాలూకాలో రైతులను భూములనుండి తొలగించేందుకు 450 డిక్రీలను జారీ చేశారు. ఈ హింసను భరించలేక 19191936 మధ్య కాలంలో కనీసం 29సార్లు పాలకులపై తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు దారులలో హిందూ రైతులు కూడా ఉన్నారు. ఆ ప్రాంతంలో ముస్లిం జనాభా అధికం. జమీందార్లలో అత్యధికులు ఉన్నత కులాల హిందువులే.
1920ల ప్రారంభంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చింది. అలాగే హిందుముస్లింల ఐక్యత కోసం పిలుపునిచ్చింది. బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలతో సహా అందరూ పోరాటం చేశారు. ఉద్యమం మలబార్‌ ప్రాంతానికి విస్తరించి నప్పుడు అది హింసాయుత పోరాటంగా మారి రైతులు బ్రిటీష్‌ అధికారులపైన, స్థానిక భూస్వాములపైన దాడులు చేశారు. సామ్రాజ్యవాదుల అణచివేతకు ప్రతి నిధులుగా మారిన భూస్వాములు, స్థానిక వడ్డీ వ్యాపారులపైనే రైతుల పోరాటం జరిగింది. కొంతమంది ముస్లిం నాయకులు మత కోణంలో ఉద్యమాన్ని మలుపు తిప్పాలని భావించారు కానీ ఉద్యమం సామ్రాజ్యవాద, భూస్వామ్య వ్యతిరేక లక్షణాన్నే కలిగి ఉంది. మోప్లా దాడులను గాంధీ నిరసించినప్పటికీ వారి ధైర్య సాహసాలను ప్రశంసించారు. పోరాటం చేస్తున్న రైతులపై బ్రిటీష్‌ సైన్యం దమనకాండ సాగించింది. ఆహారం, నీళ్లు లేకుండా గాలి చొరబడని రైల్వే వ్యాగన్‌లో బళ్లారికి తిరుగుబాటుదారులను తరలిస్తుండగా ఊపిరాడక 64మంది చనిపోయారు. ఈ విషాద సంఘటనపై దేశ వ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబికి స్వాతంత్య్ర ఉద్యమం బలోపేతమైంది.. అనేక మందిని అండమాన్‌లోనే సెల్యులార్‌ జైలులో పెట్టి హింసించారు. 1924లో బ్రిటన్‌ పార్లమెంటులో భారతదేశంలో అండర్‌ సెక్రటరీగా ఉన్న రాబర్ట్‌ రిచర్డ్స్‌ ఒక ప్రశ్నకు జవాబుగా అండమాన్‌ జైళ్లలో 1235 మంది మోప్లాలు, 72 మంది సెల్యులార్‌ జైలులో ఉన్నారని, వీరిలో12 మంది యువకులు 40 మంది వ్యవసాయదారులు ఉన్నారని చెప్పారు. జైళ్ల నుండి విడు దలైన తర్వాత అనేకమంది అండమాన్‌ దీవులలో వ్యవసాయదారులుగా, మత్స్య కారులుగా స్థిరపడ్డారు. నేను ఆ దీవులలో పర్యటించినప్పుడు స్వాతంత్య్ర సమర యోధుడు సీపీఐ నాయకుడు ఎన్‌ఇ బలరామ్‌ను కలుసుకున్నాను. బ్రిటీష్‌ హింస నుండి బయటపడిన అనేక కుటుంబాలను కూడా కలుసుకున్నాను. రైతుల తిరుగుబాటును ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీలు తాము అనుసరించే పెట్టుబడి దారుల, భూస్వాముల అనుకూల విధానం కోణంలోనే చూసాయి. రైతుల పోరాటంలో పాల్గొనలేకపోయాయి. రైతుల, వ్యవసాయదారుల ప్రయోజనాలను విస్మరించి సంపన్నులకు అనుకూలంగా పనిచేసాయి. దళితులలోనే అత్యధికంగా భూమి లేనివారు ఉన్నారు. రైతు సంఘాల ఏర్పాటు ద్వారా స్వాతంత్య్ర ఉద్యమకాలం లోను, స్వాతంత్య్రం సిద్ధించిన తరవాత కమ్యూనిస్టులు రైతు ఉద్యమాలకు అగ్ర భాగాన నిలిచి పోరాడారు. జమీందారీ వ్యవస్థను రద్దు చేయటానికి అవసరమైన చట్టాలను తీసుకురావటంలో రైతు సంఘాలు కీలకంగా వ్యవహరించాయి.
తిరోగమన వాదులైన ఉన్నత కులాల భూస్వాములు, పెట్టుబడిదారులపై ఆధారపడిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఎల్లవేళలా శ్రామిక ప్రజలకు అండగా నిలవకుండా సంపన్నులకు అనుకూలంగా పనిచేసింది. ఇది దాని వర్గ స్వభావం. మూడు వ్యవసాయ దుష్ట చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న మహత్తర పోరా టంపై ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు హింసకు పూనుకున్నాయి. తొలి నుంచి ఆర్‌ఎస్‌ ఎస్‌, బ్రిటీష్‌ పాలకులకు అనుకూలంగా వ్యవహరించింది. దాని సంకుచిత దృక్పథం కారణంగా ఈ దేశ ప్రజలందరి పట్ల సానుకూలంగా ఉండకుండా మతం ఆధారంగా సామాజిక విభజనకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నది. అరు ుతే సామాన్య ప్రజలు మతం, కులం ఆధారంగా అణచివేతకు వ్యతిరేకంగానే ఉన్నారు. చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రస్తుతం, భవిష్యత్‌లోనూ పోరాటం చేస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img