Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జి`20 అధ్యక్షత దేశానికి ఉపయోగమా?

డి. రాజా,
సీపీఐ ప్రధాన కార్యదర్శి

జి20 దేశాల గ్రూపు అధ్యక్ష పదవి మనకు దక్కిందంటూ ఏదో సాధించినట్లు ఉవ్వెత్తున ప్రచారం చేస్తున్నారు. సరిహద్దు సమస్యలు, ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను అధిగమించేందుకు తగిన చర్యలు చేపట్టడంకోసం 1999లో జి20 దేశాల గ్రూపు ఏర్పడిరది. నయా ఉదారవాదం ప్రపంచమంతటా ప్రభావం చూపుతున్న సమయంలోనే ఇది ఏర్పడిరది. అయితే ఆర్థిక ధోరణులను అనుసరించడంలో విఫలమైంది. 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని నిలువరించలేక పోయింది. అనంతరం జి8/జి7 గ్రూపుల ప్రభావం సంక్షోభ సమయంలో విధానాలపై ప్రధానంగా పడిరది. అలీన ఉద్యమం(నామ్‌) లేదా జి77 దేశాల గ్రూపులో ప్రస్తుతం 134 అభివృద్ధి చెందిన దేశాలు సభ్యులుగా ఉన్నాయి. జి20 దేశాల గ్రూపు అధ్యక్షపదవి భారత్‌కు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రజలకు కలిగిన చిక్కులు, ప్రయోజనాలను పరిశీలిద్దాం.
ముఖ్యంగా బీజేపీ దాని అనుకూల మీడియా ప్రతి సంవత్సరం జరిగే ఈ తంతును గొప్పవిజయంగా, అంతర్జాతీయంగా భారతదేశ ప్రభావం పెరుగుతున్నదనేందుకు తార్కాణమని బాకా ఊదారు. భ్రమల ప్రచారం, మోదీ వ్యక్తిగత ఆకర్షణను పెంచేందుకు సాగిన ప్రచారంతో ప్రజలు విసిగిపోయారు. దౌత్యవేత్తలంతా మనవైపే చూస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. రొటేషన్‌ పద్ధతిలో భారతదేశానికి అధ్యక్ష పదవిని ఇచ్చారు. భారతదేశానికి ఇచ్చిన గొప్ప బహుమతి ఏమీకాదు. గత సంవత్సరమే భారతదేశానికి అధ్యక్ష పదవి ఇవ్వలసిందని జీ20 గ్రూపు వెల్లడిరచింది. 2023లో 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో పార్లమెంటు ఎన్నికలు జరుగనుండటం, జి20 గ్రూపు అద్యక్ష పదవిపైన విస్త్రత ప్రచారం చేసుకుని రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నించారు. జి20 సమావేశాలకు విదేశీ ప్రముఖులు హాజరైన సందర్భంలో వారందరికి ప్రధానమంత్రి స్వాగతం పలుకుతున్నట్లు, భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌లకు, ప్రచారానికి విపరీతంగా ఖర్చు చేశారు. ఇదంతా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిందే...అధ్యక్షపదవి తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి బ్లాగ్‌పోస్టులో తన అజెండాను వివరించారు. ప్రచారానికి, వాస్తవానికి ఎంతో తేడాఉందని బ్లాగ్‌ పోస్టు స్పష్టం చేస్తుంది. ‘‘భాషలు, మతాలు, సంప్రదాయాలు, నమ్మకాలు అత్యంతవైవిధ్యంగా ఉన్నాయని ఈ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే మేలుగా ఉందని ఆయన చెప్పుకున్నారు.
ఈ వైవిధ్యం చాలా కాలంగా దేశపటిష్టతకు చిహ్నంగా ఉండిరది. అయితే మోదీ హయాంలో ఇది తీవ్రమైన వత్తిడులకు గురైంది. ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీలు ఏకత్వం గురించి అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. మనవైవిధ్యాన్ని నాశనంచేసి విభేదాలను సృష్టిస్తున్నారు. అది హిందీనిరుద్దడం, లేదా మతమైనారిటీలపై వివక్ష, గోమాంసం తింటున్నారని దాడులు, హత్యలు గావించడం, చివరకివీరు వేసుకునే దుస్తులపైన కూడా ఆంక్షలు విధించడం చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం అంతా ఒకే విధంగా ఉండాలనేది దేశసమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేయడం మోదీ నిరంతరం సాగించే ప్రక్రియ. పైగా భారతదేశం ప్రజాస్వామ్యానికి మూలాధారమని దాని డీఎన్‌ఏలోనే ప్రజాస్వామ్యముందని ప్రధాని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. అయితే మెజారిటీ నినాదం భారతదేశ ప్రజాస్వామ్య లక్షణంపైనే దాడిచేస్తుంది. పార్లమెంటును ఎందుకూ పనికిరాకుండా తయారుచేస్తుంది. న్యాయవ్యవస్థను ఆక్రమించు కునేందుకు ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షనాయకులపై దర్యాప్తు ఏజన్సీలను ప్రయోగించి వారిని దోషులుగా నిలిపేందుకు కోలుకున్నది. మీడియాను తనకు అనుకూలంగా మలచుకుంది. అసమ్మతిని నేరంగా పరిగణిస్తూ పౌరహక్కులను హరిస్తోంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారిపై క్రూరమైన చట్టాలను ప్రయోగిస్తున్నది. సెక్యులర్‌, ప్రజాస్వామ్య వ్యవస్థ, స్వాతంత్య్ర పోరాటం తీవ్ర ప్రమాదానికి లోనవుతున్నాయి. అదానీ లాంటివారి కుంభకోణాలను ఆర్థికపెట్టుబడి పాత్రను పార్లమెంటులో ప్రస్తావించడానికి లేకుండా చేస్తున్నారు. జిగ్రూపు శిఖరాగ్ర సమావేశంలో ‘ఒక ధరిత్రి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అని ప్రధాని మంత్రోపదేశం చేశారు. మోదీ పరిపాలనకు ఇదొక మచ్చుతునక. మత మైనారిటీలను దృష్టిలో ఉంచుకుని వివాదాస్పదమైన పౌరచట్ట (సవరణ) చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టాన్ని తిరస్కరిస్తూ దిల్లీలో జరిగిన నిరసనోద్యమం సందర్భంగా సాగించిన దాడులను అంతర్జాతీయంగా ఖండిరచారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త గోల్వాల్కర్‌ స్వాతంత్య్రానికి ముందుగానే మైనారిటీలు దేశంలో ఉండదలచుకుంటే ద్వితీయశ్రేణి పౌరులుగానే ఉండాలని, వారికి ఎటువంటి హక్కులు ఉండకూడదని తన రచనల్లో పేర్కొన్నారు. ఒక ధరిత్రి, ఒక భవిష్యత్తు అనే అంశమే ఊహించడం కష్టం. అలీన విధానాన్ని అనుసరించినప్పుడే భారతదేశ ప్రాముఖ్యత పెరిగింది. గత కొద్దిసంవత్సరాలుగా అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య దేశాలతో సాన్నిహిత్యం ఏర్పరచుకోవడం వల్ల మనకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. దక్షిణాసియా దేశాలలో సంప్రదాయంగా మనకుగల మంచిపేరు క్రమంగా క్షీణించిందన్న అంశం గుర్తించాలి. జి20 దేశాల అధ్యక్షస్థానం పొందినవెంటనే ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ప్రభుత్వం వైపునుంచి, దక్షిణ దేశాల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్థల సంస్కరణలను వివరించారు. అయితే జి20 గ్రూపు అధ్యక్షపదవి వల్ల మనకు లభించేదేమిటో చెప్పలేదు. బహుళ అభివృద్ధి బ్యాంకులకు సంబంధించి జి20 నిపుణుల బృందం ద్వారా కొన్ని సూచనలు వస్తున్నాయి. ఆ బృందం నివేదికలో వచ్చే అవకాశమున్న సమస్యలు, సిఫారసుచేసే చర్యలు చాలా భిన్నంగా ఉన్నాయి. నివేదికలో ప్రైవేటు పెట్టుబడి పెంచేందుకు నూతన యంత్రాంగాలు, నిర్దిష్టమైన పెట్టుబడి, వ్యయప్రాధాన్యతలు ఉన్నాయి. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులు విదేశాలపైన చాలా జాగరూకతతో ఉన్నారు. అవసరమైన దేశాలకు సంఫీుభావం, మద్దతు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అణచివేతకు గురైన సంస్థల ఐక్యత, అలీన ఉద్యమం తదితర అంశాలు అత్యంత ప్రముఖంగా ముందుకువచ్చాయి. విముక్తిపొందిన వలసదేశాల అభిప్రాయాలు, ఆఫ్రోఆసియా దేశాల ఐక్యత, శాంతి ప్రముఖస్థానం వహించాయి. వీటిని విస్మరించి పశ్చిమ దేశాలకు ముఖ్యంగా అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమికి దగ్గరగా చేరారు. అనేక ముఖ్యమైన సమస్యలపై అర్థవంతమైన స్థానాలను పొందడంలో నూతన విధానం విఫలమైంది. కొద్దిసంవత్సరాలుగా భారతదేశ విదేశాంగ విధానం ప్రాధాన్యతలు సంకుచితంగా మారాయి. సహకారం, సంఫీుభావం, శాంతి, పురోగతి విధానాన్ని అనుసరించడానికి బదులుగా మన దౌత్యవేత్తలు నాయకుడి ప్రతిష్టను పెంచేందుకు ప్రచారం సాగించడంలో నిమగ్నమయ్యారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబించడానికి సిద్ధంగా లేరు. ప్రధానికి ఇష్టమైన పదం ‘వసుదైక కుటుంబం’ సామాజిక సామరస్యానికి ఇది ప్రతీక. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని చెప్పడానికి ఇది నిదర్శనం. జి20 గ్రూపు అధ్యక్షపదవి మన దేశ ఔదార్యాన్ని ప్రదర్శిస్తుందని ప్రజలందరినీ సమంగా ఒక కుటుంబం లాగాచూడాలి. దక్షిణదేశాలను ఒక కుటుంబాన్ని ప్రతిబింబించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img