Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టమాటా రైతు పరిస్థితి దయనీయం

సరఫరా గొలుసు అనేది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వస్తువులను రవాణా చేయడం, దాని సంక్లిష్టతలు సాధారణ రవాణాకు మించినవి. సరఫరా గొలుసు వ్యవస్థ ఉత్పత్తి, పంపిణీ, డెలివరీతో వివిధ దశల్లో ఉంటుంది. ఇవన్నీ ఉత్పత్తులు అవి చేరవలసిన గమ్యస్థానాలకు సమర్థ వంతంగా చేరుకోవడానికి దోహదం చేస్తాయి. రైతు ఆత్మహత్యలసమస్య నిజానికి ఒక విషాదకరమైన సంక్లిష్టమైన సమస్య. ఇది సరఫరా గొలుసు సవాళ్లకు మాత్రమే పరిమితం కాకుండా, బహుళ కారణాలచే ప్రభావితమవుతుంది. అస్థిరమైన మార్కెట్‌ ధరలు, అధిక ఇన్‌పుట్‌ ఖర్చులు, రుణం, బీమాకు సరిపడా ప్రాప్యత, నీటికొరత, పంట వైఫల్యాలు, పరిమిత మార్కెట్‌ అవకాశాలతో రైతులు అనేకసవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్లు ఇతర సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత అంశాలతో కలిపి రైతు ఆత్మహత్యల పరిస్థితికి దోహదపడతాయి. సరఫరా గొలుసు రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుండగా, రైతు ఆత్మహత్యలు విస్తృత వ్యవస్థాగత సమస్యలు వ్యక్తిగత పరిస్థితుల కలయికనుండి ఉత్పన్నమవుతున్నాయి, వీటిని గుర్తించడం చాలా ముఖ్యం.

మిర్చి, పత్తి ధరలు పెరుగుతుండగా టమాట పండిరచిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరుగాలం కష్టపడి పండిరచిన టమాటకు ధర రాక దిగాలుపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్రంలో చాలా మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఈసారి టమాట పంట ఎక్కువ దిగుబడి ఉంది. అయితే ప్రస్తుతం టమాట రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. మార్కెట్టుకు తీసుకువచ్చిన టమాటా ధర కిలో రెండు రూపాయలకు పడిపోవడంతో అక్కడక్కడ రైతులు రోడ్డుపై పారబోసి, పశువులకు మేతగావేసి నిరసన వ్యక్తంచేశారు. నిన్న వందల టన్నులు టమోటా మార్కెట్టు దగ్గర కుప్పలుగా పోశారు. రవాణా ఖర్చు విపరీతంగా పెరగడంతో సుదూర ప్రాంతాలల్లో మార్కెట్‌కు సరుకు తరలించలేకపోతున్నారు. మూడు సంవత్సరాల నుండి ధరల స్థిరీకరణ అనేది లేదు. రెండు సంవత్సరాలుగా వ్యవసాయ పనులు రెట్టింపు అయ్యాయి. గతంలో టమోటానార వంద మొక్కలకు 60 రూపాయలు కాగా ప్రస్తుతం వంద రూపాయలు. దుక్కి, గట్లు చేయడానికి ఎకరాకు 1200 వ్యయం అయ్యేది ఇప్పుడు 3000 రూపాయలు. రవాణా, టోల్‌ చార్జీలు, కూలీల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఏ పంట ఎక్కడెక్కడ పండిస్తున్నారో తెలిపేనాథుడే లేడు. వ్యవసాయ అధికారులు గణాంకాలు పూర్తిగా మరచిపోయారు. వ్యవసాయం జూదంగా మారింది. టమాట పెద్ద మొత్తంలో మార్కెట్‌కు రావడంతో డిమాండ్‌ పడిపోయింది. గ్రామాల్లో చాలా మంది రైతులు టమాటపంటను సాగుచేస్తున్నారు. నిత్యం టమాట, మిర్చి వేకువ జామున బొలెరో, ఆటోల్లో మార్కెట్టుకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు.
టమాట పెద్ద మొత్తంలో మార్కెట్‌కు రావడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. దీంతో టమాట ధర ఒకేసారి కిలో రెండురూపాయలకు పడిపోయింది. 35 కిలోల క్యారెట్‌ 80 నుంచి 100 రూపాయలు మాత్రమే పలికింది. సగానికి పైగా ధర తగ్గించేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు పెట్టిన పెట్టుబడులు, రవాణా చార్జీలు కూడా రాని పరిస్థితి రావడంతో కన్నెర్ర చేశారు. వ్యాపారులకు అమ్మే బదులు రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి టమాట సాగుచేస్తే మార్కెట్లో వ్యాపారులు మాయాజాలం ప్రదర్శించడం సరికాదని వాపోతున్నారు.
రైతు నిర్ణయించాల్సిన ధరను వ్యాపారులు నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేస్తాం అని బూటకపు మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వాలు రైతుల సంక్షేమం గురించి పట్టించుకోకుండా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం టమోటాతో పాటు మామిడి పండ్లకు కూడా డిమాండ్‌ తగ్గిపోయింది. పండ్ల తోటల్లో మామిడి పంట అత్యంత ప్రముఖమైనది. అందుకే దీనిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. ప్రపంచం మొత్తంలో సగంవరకు మామిడి ఉత్పత్తి మన భారతదేశంలో జరుగుతోంది. మామిడిపండులో అధిక పోషకాలు, విటమిన్‌-ఎ, సి, అలాగే మంచి రుచి ఉండడంతో ప్రజలు ఈ పండును ఇష్టపడతారు. రైతులు ముఖ్యమైన ఉద్యాన వాణిజ్య వంటగా సాగుచేస్తున్నారు. మామిడిని ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్‌, విశాఖపట్నం, చితూరు, కడప, అదిలాబాదు, నల్గొండ జిల్లాల్లో సాగుచేస్తున్నారు. మామిడిని పంటకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, చెట్టు అభివృద్ధి చెంది అధికకాలం ఫలాలనిస్తాయి. ఈ సంవత్సరం కాపు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ మార్కెట్లో ధర లేకపోవడంతో అకాల వర్షాలతో పంట దెబ్బతీసింది. కోయకుండా చెట్టుపైనఉన్న కాయలకు ఈగ బెడద ఎక్కువైంది. నిండా కాపుఉన్న చెట్టు కాయలకు ఐదు వందల నుంచి ఏడువందల వరకు వ్యాపారస్తులు పెడుతున్నారు. మూడు వందల చెట్లకు లక్షా డెబ్భై వేలు, రెండు లక్షలు మించడం లేదు. సంవత్సర కాలం కంటికి రెప్పలా చూసుకున్న కాపలాదారుడు జీతానికి సరిపోయేటట్లు ఉంది. రైతుకు పెట్టుబడిరాక చెట్లు తీసివేసే ప్రమాదంఉంది. గతదశాబ్ద కాలంగా కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్స్‌, ధాన్యం నిలువ చేసుకోవడానికి వేర్‌హౌస్‌లు లేక రైతులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అసమర్థ రవాణావ్యవస్థ కారణంగా పెద్దమొత్తంలో కూరగాయలు పొలాల్లో కుళ్ళిపోతున్నాయి.
సరఫరా గొలుసు అనేది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వస్తువులను రవాణా చేయడం, దాని సంక్లిష్టతలు సాధారణ రవాణాకు మించినవి. సరఫరా గొలుసు వ్యవస్థ ఉత్పత్తి, పంపిణీ, డెలివరీతో వివిధ దశల్లో ఉంటుంది. ఇవన్నీ ఉత్పత్తులు అవి చేరవలసిన గమ్యస్థానాలకు సమర్థవంతంగా చేరుకోవడానికి దోహదం చేస్తాయి. రైతు ఆత్మహత్యల సమస్య నిజానికి ఒక విషాదకరమైన సంక్లిష్టమైన సమస్య. ఇది సరఫరా గొలుసు సవాళ్లకు మాత్రమే పరిమితం కాకుండా, బహుళ కారణాలచే ప్రభావితమవుతుంది. అస్థిరమైన మార్కెట్‌ ధరలు, అధిక ఇన్‌పుట్‌ ఖర్చులు, రుణం, బీమాకు సరిపడా ప్రాప్యత, నీటి కొరత, పంట వైఫల్యాలు, పరిమిత మార్కెట్‌ అవకాశాలతో రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
ఈ సవాళ్లు ఇతర సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత అంశాలతో కలిపి రైతు ఆత్మహత్యల పరిస్థితికి దోహదపడతాయి. సరఫరా గొలుసు రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుండగా, రైతు ఆత్మహత్యలు విస్తృత వ్యవస్థాగత సమస్యలు వ్యక్తిగత పరిస్థితుల కలయికనుండి ఉత్పన్నమవుతున్నాయి, వీటిని గుర్తించడం చాలాముఖ్యం. రైతు ఆత్మహత్యల సమస్యను పరిష్కరించడానికి వ్యవసాయ సంస్కరణలు, సామాజిక మద్దతు వ్యవస్థలు, మానసిక ఆరోగ్య అవగాహన, ఆర్థిక సహాయం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులతో సమగ్రమైన బహుళ విధానాలు అవసరం. మెరుగైన మౌలిక సదుపాయాలు, మార్కెట్‌లకు ప్రాప్యత, సరసమైన ధరల విధానాలు, సమర్థవంతమైన లాజిస్టిక్స్‌ వంటి వ్యవసాయ సరఫరా గొలుసును మెరుగు పరచడానికి చేసే ప్రయత్నాలు, రైతులు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను తగ్గించడంలో ఖచ్చితంగా సహాయ పడతాయి. రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వాలు తక్షణమే కోల్డ్‌ స్టోరేజి యూనిట్లు, మార్కెట్‌ సౌకర్యం, వేర్‌హౌస్‌ నిర్మాణం చేపట్టాలి. రైతులు ధాన్యం నిలువ చేసుకోవ డానికి గోదాములు, గిడ్డంగులు ఏర్పాటు చేయాలి.
డా.యం. సురేష్‌ బాబు
ప్రజాసైన్స్‌ వేదిక అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img