Friday, April 19, 2024
Friday, April 19, 2024

దుర్భర పరిస్థితుల్లో వలస కార్మికులు

డాక్టర్‌ జ్ఞాన్‌ పాఠక్‌

వలస కార్మికుల దైనందిన జీవితాలు దుర్బరంగా తయారయ్యాయి. గడువుకుమించి పనిచేయడం, వేతనాల చెల్లింపుల్లో అలసత్వం, రుణభారం వారి దైనందిన జీవితాలపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం చూపుతోంది. కొన్నిసార్లు చట్టబద్ద గడువుకు మించి బలవంతంగా పనిచేయిస్తారు. ఈ నేపధ్యంలో తాజాగా అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నిపుణుల కమిటీ వలస కార్మికుల వేతన రక్షణపై మార్గదర్శకాలను విడుదల చేసింది.
తగినంత వేతనం చెల్లించడం, సమయానికి చెల్లించడం వల్ల గౌరవనీయమైన పని, సామాజిక న్యాయానికి దారితీస్తుంది. వేతనాలను పాక్షికంగా, ఆలస్యంగా చెల్లించడం, అసలు చెల్లించకపోవడం, కనీస వేతనం ఒప్పందం అమలు ప్రకారం అంగీకరించిన రేటు కంటే తక్కువగా చెల్లించడం, ఓవర్‌టైమ్‌ వేతనాలను అసలు చెల్లించకపోవడం వలస కార్మికుల ప్రధాన సమస్యలుగా పేర్కొంది. సామాజిక న్యాయంకోసం కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాలని హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు అంతర్జాతీయ మైగ్రేషన్‌ రివ్యూ ఫోరమ్‌ 2022 ప్రోగ్రెస్‌ డిక్లరేషన్‌లో వలసకార్మికుల సమస్యలను గుర్తించింది. తిరిగి వచ్చిన వలసదారులకు వేతనాలు, సంబంధిత ప్రయోజనాలు, అర్హతల పునరుద్ధరణకు అంతర్జాతీయ సహకారానికి ఐఎల్‌ఓ పిలుపు నిచ్చింది. వేతన రక్షణ చట్టాలు, విధానాల అమలకు ప్రభుత్వాలు, కార్మికులు, సంస్థలు కృషి చేసినప్పటికీ, చెల్లింపుల్లో అలసత్వం, అసలు వేతనాలను చెల్లించకపోవడంతో ప్రపంచంలోని అనేక మంది కార్మికులకు, ముఖ్యంగా వలస కార్మికులకు పెనుసవాలుగా మారింది. భాష, కార్మికుల హక్కులపై అవగాహన లేకపోవడం, ప్రాథమిక విద్యలేకపోవడం, చట్టపరమైన ఇబ్బందులతో వేతనాలవసూళ్లలో వలసకార్మికులు తీవ్రఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. వేతనాలు ఉద్యోగస్థులు ఎంపిక, పని గంటల సంఖ్య, ఉపాధి కోసం వలస వెళ్లాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. కార్మికులకు వారి కనీస అవసరాలైన వసతి, ఆహారం, దుస్తులు, ఇతర అవసరాలకు చెల్లించడమే కాకుండా, వారి కుటుంబాల నిర్వహణకు, నిత్యావవసరాలకు వేతనాలు అవసరం.
2021 గణాంకాలాధారంగా, 169 మిలియన్ల కార్మికుల్లో 70 శాతం మంది వలసకార్మికులు కాగా 70మిలియన్ల మంది మహిళా వలస కార్మికులు ఉన్నారు. ముఖ్యంగా వలస వచ్చిన కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లించడం ప్రధాన సమస్య. వర్ణవివక్ష, జాత్యహంకారం, రిక్రూట్‌ చేసుకునే విధానంలో అవకతవకలు, వేతన సంబంధిత సమస్యలను వలసకార్మికులు ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారికి ముందు కూడా వలస కార్మికులు తమ హక్కులకోసం ఆందోళన చేస్తూనే ఉన్నారు. వలసవచ్చిన కార్మికులు తాము నివాసమున్న ప్రదేశాల్లో వివాదాలు చెలరేగినప్పుడు, తమ హక్కులు పొందకుండానే తమ స్వదేశానికి వెళ్లిపోవాల్సి వస్తున్న పరిస్థితి. కోవిడ్‌-19 మహమ్మారి కాలంలో వలస కార్మికుల వెతలు వర్ణనాతీతం. వేతనాలు, వసతిలేక కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లెక్కలేనన్ని కుటుంబాలు, సంఘాలు ఉపాధి, వసతి, రవాణా, ఆహారం, వైద్యవసతి లేక వలస కార్మికుల బంధువులపౖౖె ఆధార పడ్డారు. ఇది వలసకార్మికుల సమస్యను మరింత జటిలంచేసింది. ముఖ్యంగా కార్మికులవేతనాలను సకాలంలో చెల్లించకపోవడం ప్రధాన సమస్యగాఉంది. రుణ సమస్యలతోపాటు వేతనాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడం, కార్మికులను కార్యాలయంలోనే ఉండమని ఒత్తిడి చేయడం, యజమానిని మార్చే అవకాశం కార్మికుడికి లేకపోవడంవంటి వాటిని ఐఎల్‌ఓ గుర్తించింది. 27.6 మిలియన్ల మంది కార్మికులతో బలవంతంగా పనిచేయించుకుని వారి వేతనాలను నిలిపివేయడం ప్రధాన ముప్పుగా పేర్కొంది. మూడిరట ఒక వంతు కంటే ఎక్కువ మంది 36.3 శాతం మంది వేతనాలను నిలిపివేయడం, బకాయి ఉన్న రుణాలను చెల్లించడం లేదనే బెదిరింపులతో వారిని నిర్బంధించడం ప్రధాన సమస్యగా పరిగణించింది. యజమాని-ప్రాయోజిత వీసాలపై ఉన్న కార్మికులు, ఒక కార్మికుడిని ఒకే యజమానికి కట్టబెట్టడంతో వేతన సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఇష్టపడరు. పర్యవసానంగా గమ్యస్థానంగా ఉన్న దేశంలో వారి ఉపాధి, నివాసం కోల్పోయే అవకాశం ఉంది.
వలసదారులు కార్మికచట్టాల పరిధిలోకిరాని రంగాల్లో పనిచేయడంతో వారిపై పర్యవేక్షణ కొరవడుతోంది. వ్యవసాయం, ఇంటిపని, నిర్మాణ రంగాల్లో ఎక్కువగా వలస కార్మికులు దోపిడీకి గురవుతుంటారు. 2022 ప్రపంచ అంచనాల ప్రకారం, వయోజన వలస కార్మికులు వలసేతర కార్మికుల కంటే మూడు రెట్లు ఎక్కువగా దోపిడీకి గురవుతున్నారు. ఐఎల్‌ఓ నిబంధనల ప్రకారం, సంస్థలు నష్టాల్లో ఉన్న సమయంలోనూ వలస కార్మికులకు వేతన రక్షణ కల్పించాలి. కార్మికుల వేతన సంబంధిత దోపిడీ, దుర్వినియోగానికి వ్యతిరేకంగా వలస కార్మికులకు ఆర్థికంగా చేయూతనిచ్చే హామీ దిశగా ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img