Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నత్త నడకన ఆర్థికరంగం వృద్ధి

గణనీయంగా తరుగుదల నమోదు చేసిన వృద్ధి ఆర్థిక సంపన్న దేశాల కంటే అభివృద్ధి చెందు తోన్న దేశాలలో ఎక్కువగా ఉంది. అలాగే ద్రవ్యోల్బణ పరిస్థితులు మరింత కాలం కొన సాగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల కొను గోలు శక్తిని పెంచడం ద్వారా మార్కెట్‌లో డిమాండ్‌ పెంచవచ్చు. అపార సంపన్నులు, కార్పొరేట్లు అసాధారణ లాభాలను కరోనా కాలంలోను పొందారు. ప్రజల ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. కార్పొరేట్‌లు పొందిన అసాధారణ లాభాలను తిరిగి పంపిణీ చేసినట్లయితే ప్రజల కొనుగోలు శక్తి బాగా పెరుగుతుంది. ఉత్పత్తి రంగం, ఆర్థిక రంగం వేగంగా పుంజుకొంటాయి. అయితే ప్రభుత్వం మరో మార్గాన్ని ఎంచుకొన్నది. చర్చలు, వివాదాలు, అనవసరమైన పోటీలు సమాజంలో ఏర్పడి మత ఉద్రిక్తతలు పెరిగాయి. బుల్డోజర్‌ న్యాయం కొనసాగుతోంది. ఫలితంగా పేదల, మధ్య తరగతి ప్రజల కడగండ్లు అధికమయ్యాయి. మెజారిటీ మత ప్రజలను ప్రోత్సహించి ఇతరులుగా పేర్కొంటున్న మైనారిటీలను అణచి వేస్తున్నారు. ఇది ఆర్థిక రంగం వేగంగా పుంజుకోవటానికి ఎంత మాత్రం దోహదం చేయదు.

సంజయ్‌ రాయ్‌
కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన బీభత్సంలో భారతదేశ ఆర్థిక రంగం కుదేలై పోయింది. ఈ పరిస్థితి ప్రపంచమంతటా తరతమ బేధాలతో ఏర్పడిరది. తాజాగా ఉక్రెయిన్‌రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం దాదాపు అన్ని దేశాల పైన ఉన్నది. ఉత్పత్తులు తగ్గి ధరలు, ద్రవ్యోల్బణం పెరిగాయి. దెబ్బతిన్న ఆర్థిక రంగం వేగంగా పుంజుకున్నదని మన కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ అనుకూల మీడియా ప్రచారం సాగిస్తున్నాయి. అయితే వాస్తవ గణాంకాలు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. మన దేశంలో పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఆర్థిక రంగం కుదేలై పోయింది. జిఎస్టీతో రాష్ట్రాల ఆదాయం పడిపోయి అవి అనేక అవస్థలు నేటికీ పడుతూనే ఉన్నాయి. ఈ దశలో ఆర్థిక రంగం వేగంగా పుంజుకోవటం లేదని, వృద్ధి చాలా నెమ్మదిగా ఉన్నదని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) 2022 మే 31న ప్రకటిం చింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో జిడిపి గణాంకాలను వెల్లడిర చింది. భారత ఆర్థిక రంగం సంతృప్తిగా వృద్ధి చెందడం లేదని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆర్థిక రంగం పుంజుకోవడానికి ప్రభుత్వం సరైన ప్రణాళికలను రచించకపోవటం మూలంగా నిరుద్యోగం మితిమీరి పెరుగుతూనే ఉన్నది. ప్రజల కొనుగోలు శక్తి తరిగిపోయింది. ఆర్థిక రంగం పుంజుకోవడానికి మరింత కాలం పడుతుందని, ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. రూపాయి విలువ పడిపోవటం, అత్యధికంగా విదేశీ పెట్టుబడులు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు తరలిపోవటం, అప్పులు పెరిగిపోవటం లాంటి అనేక ప్రతికూలతలలో ఆర్థికం మెరుగుపడటానికి ఎక్కువ కాలమే పడుతుంది. కరోనా కాలంలో అతి తక్కువ కేసులు ఉన్నప్పుడే లాక్‌డౌన్‌ విధించటం మూలంగా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఉత్పత్తులు తగ్గటం, లక్షల మంది నిరుద్యోగులు కావటం జరిగింది. 202122 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి 8.7 శాతం ఉందని అంచనాలు తెలియజేసు న్నాయి. ఈ అంకెలు పరిస్థితి మెరుగ్గా ఉందని అనిపిస్తున్నాయి. అయితే 202021 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం మాత్రమే వృద్ది నమోదయ్యింది. దీని ఆధారంగా రూపొందించిన గణాంకాలు అవి. 201920లో మన జిడిపి 145.16 లక్షల కోట్లు కాగా అది 202122లో 147.35 లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది. కరోనా మహమ్మారికి ముందున్న పరిస్థితి చాలా స్వల్పంగానే మెరుగయ్యిందని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 202122 రికార్డుల ప్రకారం వృద్ధి రేటు 6.7 శాతం మాత్రమే. ఆయా సీజన్‌లలో వృద్ధిని సర్దుబాటు చేసి అంచనా వేస్తే, వాస్తవ జిడిపి ఇంకా తక్కువగా ఉంది.
ఆర్థికం, బీమా, రియల్‌ ఎస్టేట్‌, వాణిజ్య సేవల విభాగం పుంజుకోవటం మెరుగ్గా ఉన్నది. వాస్తవంగా స్టాక్‌ మార్కెట్‌ వృద్ధి ఆర్థిక రంగం వృద్ధి కంటే ముందుగానే పుంజుకొన్నది. ముఖ్యంగా ఆందోళన కలిగిస్తున్న రంగాలలో చిల్లర వాణిజ్యం, నిర్మాణం, ఉత్పత్తి రంగం ఉన్నాయి. ఈ రంగాలలోనే వ్యవసాయేతర ఉద్యోగావకాశాలు ఎక్కువ, ప్రధానమైనవి. ఈ రంగాలలో వృద్ధి ప్రోత్సాహకరంగా లేదు. ప్రైవేటు ఆర్థిక రంగం వ్యయం జిడిపిలో దాదాపు 57 శాతం మాత్రమే ఉన్నది. ఉద్యోగాలు తమ ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారు లక్షలాది మంది ఉండటం వల్ల ఆదాయం తగ్గిపోయి ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోయింది. అనిశ్చితులు, డిమాండ్‌పై సందేహాలు తదితర కారణాల వల్ల ప్రైవేటు రంగం తన పెట్టుబడి వ్యయాన్ని బాగా తగ్గించుకొన్నది. 202122లో మొదటి మూడు నెలల కాలంలో అంతక్రితం సంవత్సరం నమోదైన 6 శాతం వృద్ధి నుండి పుంజుకొని 14.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. లాక్‌డౌన్‌, వస్తువులు, సేవలు సరఫరాలో అంతరాయాలు మూలంగా ఆగిన డిమాండు మూలంగా వృద్ధి రేటు 14.4 శాతంగా నమోదయ్యింది. అయితే ఆ తరవాత జరిగిన త్రైమాసికాలలో వినిమయ వ్యయం పడిపోయింది. రెండవ త్రైమాసికంలో 10.5 శాతం ఉండగా, మూడవ త్రైమాసికంలో 7.4 శాతానికి పడిపోయి చివరిగా నాలుగవ త్రైమాసికంలో 1.8 శాతానికి పూర్తిగా దిగజారింది. కరోనా మహమ్మారి తర్వాత గడిచిన కాలంలోను ప్రైవేటు రంగం ఆర్థిక వ్యయం చాలా నెమ్మదిగా, తక్కువగా ఉండటం మూలంగా వృద్ధి రేటు ఎక్కువగా నమోదు కాలేదు. ప్రైవేటు రంగం ఆర్థిక వ్యయం తలసరి వార్షిక వ్యయం 61.6 వేల రూపాయలు 201920లో ఉన్నది. 2011`12లో గల ధరల ఆధారంగా ఈ వ్యయాన్ని అంచనా వేశారు. కరోనా మహమ్మారి, యుద్ధం ప్రభావం ఎక్కువ కాలం ఉన్నందున ఆర్థికం పుంజుకోవటం మంద్ర స్థాయిలోనే ఉన్నది. ది వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌ లుక్‌ 2022 ఏప్రిల్‌ సంచిక ప్రకారం ప్రపంచ వృద్ధి రేటు 0.8 శాతం పాయింట్లుగా అంచనా వేసింది. గణనీయంగా తరుగుదల నమోదు చేసిన వృద్ధి ఆర్థిక సంపన్న దేశాల కంటే అభివృద్ధి చెందుతోన్న దేశాలలో ఎక్కువగా ఉంది. అలాగే ద్రవ్యోల్బణ పరిస్థితులు మరింత కాలం కొనసాగను న్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా మార్కెట్‌లో డిమాండ్‌ పెంచవచ్చు. అపార సంపన్నులు, కార్పొరేట్లు అసాధారణ లాభాలను కరోనా కాలంలోను పొందారు. ప్రజల ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. కార్పొరేట్‌లు పొందిన అసాధారణ లాభాలను తిరిగి పంపిణీ చేసినట్లయితే ప్రజల కొనుగోలు శక్తి బాగా పెరుగుతుంది. ఉత్పత్తి రంగం, ఆర్థిక రంగం వేగంగా పుంజుకొంటాయి.
అయితే ప్రభుత్వం మరో మార్గాన్ని ఎంచుకొన్నది. చర్చలు, వివాదాలు, అనవసరమైన పోటీలు సమాజంలో ఏర్పడి మత ఉద్రిక్తతలు పెరిగాయి. బుల్డోజర్‌ న్యాయం కొనసాగుతోంది. ఫలితంగా పేదల, మధ్య తరగతి ప్రజల కడగండ్లు అధికమయ్యాయి. మెజారిటీ మత ప్రజలను ప్రోత్సహించి ఇతరులుగా పేర్కొంటున్న మైనారిటీలను అణచి వేస్తున్నారు. ఇది ఆర్థిక రంగం వేగంగా పుంజుకోవటానికి ఎంత మాత్రం దోహదం చేయదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img