Friday, April 19, 2024
Friday, April 19, 2024

నాటోలోకి ఉక్రెయిన్‌, అమెరికా విస్తరణ అసాధ్యం

బుడ్డిగ జమిందార్‌

అమెరికా మిత్రదేశాల నాటో కూటమి విస్త రణ ముగిసినట్లే అంటున్నారు జోరానార్‌ దౌలత్‌ సింగ్‌. ది ప్రింట్‌ ఆన్‌లైన్‌ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయం చెప్పారు. 19972020 మధ్య ఐదుసార్లు నార్త్‌ అట్లాం టిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)ను విస్తరించిన తర్వాత ఉక్రెయిన్‌, జార్జియాలతో అమెరికాకు సవాలుగా రష్యా నిలిచింది. ఉక్రెయిన్‌, జార్జి యాలు కలలో కూడా నాటో సభ్యత్వం తీసుకో లేవని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్‌కోచ్‌ గట్టిగా నొక్కి చెప్పారు. ఉక్రెయిన్‌, జార్జియాలు నాటో సభ్యత్వం తీసుకొంటే అమెరికా సేనలు కాలి నడకతో రష్యా కేంద్రాన్ని చేరుకోగలరని, దీన్ని మేము చూస్తూ వూరుకోబోమని అన్నారు. 1990 ప్రాంతంలో తూర్పు సోషలిస్టు దేశాల్లో రాజ కీయ మార్పులు, ఉభయ జర్మనీలు ఏకమవుతున్న సమయాన నాటో కూటమి నామమాత్రపు మిలిటరీ వ్యవస్థగా ఉంటూ, ఒక రాజకీయ కూటమికే పరిమిత మవ్వాలనీ, నాటోను ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు యూరపునకు విస్తరించ కూడదని అప్పటి సోవియట్‌ యూనియన్‌ అధ్యక్షుడు గోర్బచేవ్‌, అమెరికా అధ్యక్షుడు బుష్‌ల మధ్య జెంటిల్‌మెన్‌ ఒప్పందం కుదిరింది. 1990 జన వరిలో నాటోలో బలమైన యూరపు దేశమైన జర్మనీ విదేశాంగ మంత్రి హన్స్‌ డీట్రిష్‌ గెంషర్‌ ‘తూర్పు యూరపులో జరిగే మార్పులు, జర్మనీ ఏకీకరణ ప్రక్రియ సోవియట్‌ భద్రతా ప్రయోజనాలకు దారి తీయకూడదు. అందువలన నాటో తూర్పు వైపు తన భూభాగాన్ని విస్తరించటాన్ని, అంటే సోవియట్‌ సరి హద్దులకు దగ్గరగా తరలించడాన్ని త్రోసిపుచ్చాలి అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు, బ్రిటిష్‌ విదేశాంగ కార్యదర్శి డగ్లస్‌ హార్ట్‌తో సంభాషిస్తూ గెన్‌ ఇలా అన్నారు ‘‘ఉదాహరణకు పోలండ్‌ ప్రభుత్వం ఒకరోజు వార్సా ఒప్పందాన్ని విడిచిపెట్టినట్లయితే, వారు మరుసటి రోజు నాటోలో చేరతారని రష్యన్లకు కొంత భరోసా ఉండాలి’’ అంటూ ది ప్రింట్‌ రాసింది. 1990లో జర్మనీ ఏకీకరణ జరిగింది. 1991లో సోవియట్‌ యూనియన్‌ చీలిపోయింది. నాటో తన మాటలను నిలుపుకోలేదు. నమ్మక ద్రోహం చేసింది. సెంట్రల్‌, తూర్పు యూరపులో14 దేశాలను కొత్తగా నాటోలోకి తీసుకొంది. 2000 సంవత్సరం ప్రారంభం నుండి రష్యా క్రమేపీ ఆర్థికంగా నిలదొక్కుకోవటం పుతిన్‌ అధ్యక్షునిగా పగ్గాలు చేబట్టాక ప్రారంభమైంది. 2008లో జార్జియాను నాటోలోకి లాగటానికి ప్రయత్నిస్తే రష్యా మొదటి సారిగా జోక్యం చేసుకుని నాటోలోకి పోనీయకుండా నిలబెట్టగల్గింది. నేడు జార్జియాలో రష్యా శాంతి సేనలున్నాయి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ నాటో విస్తరించే అవకాశమే లేదు. ఉక్రెయిన్‌లో మాత్రం రష్యా అనుకూల ప్రభుత్వ స్థానంలో అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని విప్లవం పేరుతో అమెరికా, జర్మనీలు తీసుకొచ్చాయి. కానీ మెజారిటీ రష్యన్లు ఉండే తూర్పు ఉక్రెయిన్‌లో మాస్కో వెంటనే జోక్యం చేసుకొని తన అనుకూల స్థానిక ప్రభుత్వాలను డోన్‌ బాస్క్‌ ప్రాంతాల్లో ఉంచుకోగల్గింది. రిఫరెండమ్‌లో క్రిమియా ద్వీపకల్ప ప్రజలు క్రిమియా దేశాన్ని రష్యాలో కలిపారు. 2014 నుండి ఉక్రెయిన్‌ను నాటోలోకి లాక్కోడానికి అమెరికా మిత్ర దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తు న్నాయి. అంతే మోతాదులో రష్యా వ్యతిరేకిస్తూ వస్తున్నది. కానీ ప్రస్తుత ఉక్రె యిన్‌ ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగా ఉంది. అసలు సోవియట్‌ యూని యన్‌లో ఉక్రెయిన్‌ రిపబ్లిక్‌గా ఏర్పడినప్పుడు పశ్చిమాన పోలెండు భూభాగం కొంత కలవగా తూర్పున రష్యా భాగం కల్సింది. క్రిమియాను ఉక్రెయిన్‌కు రష్యా బహుమతిగా అప్పట్లో ఇచ్చింది. కనుకనే ఒకవేళ ఉక్రెయిన్‌నాటో యుద్ధానికి గాని దిగితే ఒకప్పటి కీవ్‌ పరిసర ప్రాంతాలకే ఉక్రెయిన్‌ పరిమితమవ్వాల్సి వస్తుందని పుతిన్‌ హెచ్చరించాడు. సోవియట్‌ యూనియన్‌ విడిపోవటం ఒక చారిత్రాత్మక ఈ శతాబ్దపు పెద్ద ముప్పుగా మిగిలిందని పుతిన్‌ అధికారంలోకి వచ్చిన మొదట్లో అన్నాడు.
2014 నుండి మాస్కోపై ఆర్థిక, రాజకీయ ఆంక్షలను అమెరికా, యు.కె, జర్మనీ తదితర దేశాలు విధించినప్పటికీ రష్యా నిలదొక్కుకోగల్గింది. ఆంక్షలతో రష్యాతో పాటుగా యూరపు దేశాలు నష్టపోయిన మాట కూడా వాస్తవమే. ఈనాడు యూరపునకు కావల్సిన 30 నుండి 40 శాతం గ్యాసు ఇంధనాన్ని పైపుల ద్వారా రష్యా అందిస్తోంది. ఈ మధ్యనే నార్డ్‌స్ట్రీమ్‌2 లైనును కూడా పూర్తి చేసింది. యూరపు వాణిజ్య, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో రష్యాను ఒక భాగంగా అర్థం చేసుకోవాలి. రష్యాను మధ్య యూరపు నుండి వేరు చేయాలనుకోవటం, ఆసియాకు పరిమితం చేయాలనుకోవటం చరిత్ర హీనమే అవుతుంది. పీటర్‌బర్గ్‌ను జర్మన్‌ నిర్మించారనే సంగతి మరువకూడదు. 3 కోట్ల సోవియట్‌ ప్రజల, రెడార్మీ సేనల త్యాగాలు యూరపు సుస్థిరతకు దోహదపడి, ప్రపంచాన్ని ఫాసిజంబారి నుండి కాపాడిన సంగతి మర్చిపోయి, అమెరికా ఆధిపత్యం కోసం ఉక్రెయిన్‌లో అమెరికా సేనలను ఉంచి, రష్యా చుట్టూ నాటో సేనలతో రష్యాపై యుద్ధం చేయాలనుకోవటం అవివేకమే అవుతుంది. తిథులు, నక్షత్రాలు చూసి జాతకాలు చెప్పినట్లుగా అమెరికా, యు.కె.లు మాత్రం అదిగో పులిఇదిగో పులి అంటూ రష్యా ఉక్రెయిన్‌పై దాడి ఈ రోజు లేకుంటే రేపు అని ఎప్పటికప్పుడు తన కార్పొరేట్‌ మీడియా ద్వారా ప్రపం చాన్ని మోసగిస్తూ దుష్ప్రచారం చేస్తున్నది. ఇదే అదునుగా రష్యా బూచిని ప్రపంచానికి చూపిస్తూ అమెరికా సేనలు, యుద్ధ సామాగ్రి, క్షిపణుల్ని పోలెండు, రొమేనియా వంటి దేశాలకు నిరంతరం తరలిస్తున్నారు. మా భూభాగంలో మా సేనలున్నాయని, ఇది మా ఆంతరంగిక వ్యవహారమని, ఉక్రెయిన్‌తో యుద్ధం మా ధ్యేయం కాదని రష్యా ఎప్పటికప్పుడు చెబుతున్నా ఏరోజుకారోజు యుద్ధం జరిగిపోతుందని చివరికి పశ్చిమ దేశాల రాయబార కార్యాలయ సిబ్బంది, పౌరుల్ని వెనుకకు రమ్మని పిలుపునిచ్చారు. విచిత్ర మేమంటే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం రష్యా తమపై దాడి చేయ టానికి ఎట్టి ఆధారాలు లేవని, మీరు అనవసరంగా ‘భయాందోళనలు’ సృష్టించి మా దేశ ఆర్థిక వ్యవస్థను ఇంకా నాశనం చేయొద్దని బైడెన్‌కు గట్టిగా చెప్పాడు. లండన్‌లో ఉక్రెయిన్‌ రాయబారి వాడ్యిమ్‌ ప్రిస్ట్రెకో ఒకడుగు ముందుకేసి ‘ఉక్రెయిన్‌ నాటోలో చేరే విషయంపై గట్టిగా పట్టుపట్టబోమని’ అన్నాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో రానున్న 48 గంటలలో సమావేశ మవుతానని అధ్యక్షుడు జెలెన్క్సీ ప్రకటించాడు. యుద్ధ నివారణకు జర్మన్‌ అధ్యక్షుడు షోల్జ్‌ మాస్కోకు వచ్చాడు. ఇప్పటికే ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మాక్రోన్‌ ఉక్రెయిన్‌ ` రష్యా అధ్యక్షులతో సంప్రదింపులు జరిపాడు. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు కోవిడ్‌ టెస్ట్‌ తిరస్కరించినందుకు మాటల సమయంలో ఐదు మీటర్ల దూరంగా ఉంచి, టేబుల్‌కు చెరొకవైపు నుండి సంప్రదింపులు జరిపారు. పరో క్షంగా మా నిబంధనలను వ్యతిరేకిస్తే మా నిబంధనలు మేము అమలు చేస్తామని, బహుశా ఉక్రెయిన్‌ విషయంలో కూడా ఇలానే ఉంటామని హెచ్చ రించినట్లుగా ఉంది. ఏమైనప్పటికీ ఉక్రెయిన్‌ నాటోలోకి ప్రవేశించకుండా పెద్ద యుద్ధాన్ని ఉక్రెయిన్‌ ఆపుతుందని, రష్యా విదేశాంగ మంత్రి చెప్పినట్లుగా అవసరమైతే ఇంకా సమయం తీసుకొని దౌత్యపరంగా విజయం సాధించాలని పుతిన్‌కు చెప్పిన రీతిన చర్చల ద్వారా పుతిన్‌ చొరవతో పరిష్కారం చూపి యుద్ధాన్ని నివారించి శాంతి సాధనకై రష్యా ఎప్పటిలా తన కీలక పాత్ర నిర్వహిస్తుందని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img