Friday, April 19, 2024
Friday, April 19, 2024

పంచాయితీల స్వయంపాలన కలే

డాక్టర్‌ జ్ఞాన్‌పాఠక్‌

కేంద్ర ప్రభుత్వం సొంతపథకాల ద్వారా నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న తహతహ ఇటీవల కాలంలో బాగాపెరిగింది. స్థానిక సంస్థలు చేయవలసిన విధులను కేంద్రమే నిర్వహిస్తూ పంచాయతీలకు స్వయంపాలన దక్కకుండా చేస్తున్నది. పైగా రాజ్యాంగంలో స్థానిక ప్రభుత్వం అనేది రాష్ట్రాల జాబితాలో ఉన్నదని సాకుచెబుతున్నది. పంచాయతీరాజ్‌ సంస్థలు సక్రమంగా పనిచేసేందుకు స్థానికంగా చేయవలసిన చట్టాలను చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద అట్టిపెట్టుకున్నది. పంచాయతీరాజ్‌ శాఖ గ్రామాలలో అభివృద్ధికి, పంచాయతీల సమర్థమైన నిర్వహణకు తగిన విధానపరమైన కార్యకలాపాలను, ఆర్థిక అండదండలను, అభివృద్ది కార్యక్రమాలు జరుగు తున్నాయా లేదా అని పరిశీలించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది.

భారతదేశంలో గ్రామ పంచాయితీల స్వయం పాలన కలగానే మిగిలిపోయింది. స్థానిక సంస్థల స్వయంపాలన కోసం చట్టం చేసినప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది. 1992లో 72వ రాజ్యాంగ సవరణ చట్టం స్థానిక సంస్థల స్వయంపాలనకోసమే చేశారు. వీటికి స్వయంపాలన దక్కకపోడానికి ప్రధానకారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనన్నది నిర్వివాదాంశం. చట్ట ప్రకారం పంచాయితీ సంస్థలకు అధికారాలు ఇవ్వవలసినప్పటికీ ఇవ్వలేదు. అలాగే తగినన్ని నిధులు కేటాయించడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ క్రీడలో మునిగిపోయాయి. కేంద్రం లేదా రాష్ట్రం స్వంత పథకాలను అమలుచేయడం ద్వారా బడ్జెట్‌లలో పంచాయితీలకు నిధులు కేటాయించినప్పటికీ వాటిని పంచాయితీలకు అందించడంలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు లభించకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని తమ బాధ్యత ఏమీ లేనట్లుగా నాటకమాడుతున్నది. కేంద్రం, రాష్ట్రం సొంత పథకాలను అమలు జరుపుతూ పంచాయితీలకు అందించవలసిన నిధులను ఇవ్వడంలేదు. గత 30సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతోంది. పంచాయితీరాజ్‌ శాఖపైన పార్లమెంటరీస్థాయీ సంఘం తాజాగా తన నివేదికను ప్రకటించింది.
పంచాయితీలకు నిధులు ఇవ్వాలని సిఫారసు చేసినప్పటికీ, ప్రభుత్వంలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. పంచాయితీ రాజ్‌ వ్యవస్థ సమర్థంగా పనిచేయడానికి అధికారాలు, తగినన్ని నిధులు ఇవ్వడం అవసరమేనని కేంద్ర పంచాయితీరాజ్‌ మంత్రిత్వశాఖ ఒకవైపు అంగీకరిస్తూనే మరోవైపు తనబాధ్యత లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. పంచాయితీలు సమర్థంగా పనిచేయడానికి నిధులే కాక తగినంతమంది సిబ్బంది కూడా ఉండటంలేదు. ముఖ్యమైన ఈ సమస్యలను పరిష్కరించకుండా స్వయం పాలన అమలు జరగడం కలే అవుతుంది. అధికారాలను వికేంద్రీకరించవలసిన కేంద్రం మౌనంగా ఉండి పోతోంది. పంచాయతీరాజ్‌ సంస్థల్లో ప్రజాప్రాతినిధ్య స్థానిక స్వయంపాలనా ప్రభుత్వం, వికేంద్రీకరణ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖకు ఎలాంటి ఆటంకాలు లేవని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి కేంద్రం చెబుతోంది. మాటలవరకే పరిమితమైంది. దేశవ్యాప్తంగా గ్రామప్రాంతాల్లో పంచాయితీరాజ్‌ సంస్థల పనివిధానం అత్యంత నాసిరకంగా ఉంటోంది. పంచాయతీలకు అధికారాలు, నిధులు అందించాలన్న చిత్తశుద్ధి కేంద్రానికి, రాష్ట్రాలకు లేదని జరిగిన కాలం నిర్ధారిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం సొంతపథకాల ద్వారా నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న తహతహ ఇటీవల కాలంలో బాగాపెరిగింది. స్థానిక సంస్థలు చేయవలసిన విధులను కేంద్రమే నిర్వహిస్తూ పంచాయతీలకు స్వయంపాలన దక్కకుండా చేస్తున్నది. పైగా రాజ్యాంగంలో స్థానిక ప్రభుత్వం అనేది రాష్ట్రాల జాబితాలో ఉన్నదని సాకుచెబుతున్నది. పంచాయతీరాజ్‌ సంస్థలు సక్రమంగా పనిచేసేందుకు స్థానికంగా చేయవలసిన చట్టాలను చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద అట్టిపెట్టుకున్నది. పంచాయతీరాజ్‌ శాఖ గ్రామాలలో అభివృద్ధికి, పంచాయతీల సమర్థమైన నిర్వహణకు తగిన విధానపరమైన కార్యకలాపాలను, ఆర్థిక అండదండలను, అభివృద్ది కార్యక్రమాలు జరుగు తున్నాయా లేదా అని పరిశీలించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. వివిధ కార్యకలాపాలలో జోక్యం చేసుకుని సూచనలు చేసే అంశాన్ని పంచాయితీరాజ్‌ శాఖ అంగీకరిస్తున్నప్పటికీ, పంచాయతీల మౌలిక భావనను అంగీకరించడానికి సిద్ధంగాలేదు. భారత రాజ్యాంగం ఆకాంక్షించినట్లుగా రాష్ట్రాలు, కేంద్రం తమ విధులను నిర్వహించడంలేదు. ఇప్పటికీ అవసరమైన అధికారాలను, తగినన్ని నిధులను తమకు అందచేస్తారని పంచాయితీరాజ్‌ సంస్థలు ఎదురుచూస్తూనే ఉన్నాయి.
పంచాయితీలకు తగినన్ని నిధులు, నిర్వహణ సిబ్బంది, నిర్వహణ విధి విధానాల విషయంలో రాష్ట్రాలకు మంచి, చెడు విచక్షణ అవకాశాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 జి ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, పంచాయితీలు ప్రణాళికలు వేసుకుని ఆర్థికఅభివృద్ధి, సామాజిక న్యాయం సాధించేందుకు ఆయా పథకాల నిర్వహణ అమలు బాధ్యత ఇచ్చే విషయంలో అన్ని రాష్ట్రాలు ఒకేరకంగా లేవు. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో ఈ అంశాలను పొందుపరచారు. పంచాయితీలు 230నాటికి సాధించవలసిన 17లక్ష్యాలను సాధించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల చేతులు కట్టివేస్తున్నాయి. దీనివల్ల రాజ్యాంగ సవరణకే అర్థం లేకుండా పోయింది. దేశంలో 2,55,500 గ్రామ పంచాయతీలు, 6,697 సమితి పంచాయితీలు, 665 జిల్లా పంచాయితీలు ఉన్నాయి.
ఈ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధులు 30 లక్షల 455 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 13లక్షల 788 మంది ఉన్నారు. అయితే రాష్ట్రాల, కేంద్రప్రభుత్వ అధికారుల నిరంకుశ వ్యవహారశైలి అనేక కార్యకలాపాలకు అడ్డుపడుతోంది. దేశంలో పంచాయితీరాజ్‌ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడానికే ప్రభుత్వం పదేళ్ల సమయం తీసుకుంది. 2004 మే 24వ తేదీన పంచాయితీరాజ్‌ మంత్రత్వశాఖను ఏర్పాటుచేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానమే పంచాయితీలలో రాజకీయ క్రీడ నడపడానికి దోహదంచేస్తున్నది. పంచాయితీలకు ఇచ్చిన రాజ్యాంగహక్కులను పరిరక్షించడంలో కేంద్ర పంచాయితీరాజ్‌ మంత్రిత్వశాఖ పూర్తిగా విఫలమైంది. బడ్జెట్‌లో తగినన్ని నిధులు ఒకవేళ కేటాయించినప్పటికీ వాటిని విడుదల చేయడంలోనే నిర్లక్ష్యం వహిస్తోంది. బడ్జెట్‌ సవరణల సమయంలో కేటాయించిన నిధులను కూడా ప్రభుత్వంతగ్గిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనా విధానం మారకుండా గ్రామస్థాయి పాలన సాధ్యంకాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img