Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పంజాబ్‌లో ఆప్‌ది పైచేయవుతుందా?

సుశీల్‌ కుట్టి

హాస్య నటుడైన మన్‌ ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మాల్వా ప్రాంతంలో సింగ్రూర్‌ ఏరియాలో ధురి ఉంది. ఈ ప్రాంతంలో ఎవరు గెలిస్తే వారే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారమూ ఉంది. ఈ ప్రాంతంలో ఆప్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుంది. కాంగ్రెస్‌ కంటే ఆప్‌కి ఎక్కువ అనుకూలత ఉన్నట్టు భావిస్తున్నారు. ఆప్‌కి జట్టా తరగతి ఓట్లు ఎక్కువగా లభించవచ్చునని భావిస్తున్నారు. దళితుల ఓట్లు ఛన్నీకి అనుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు పంజాబ్‌ను ఛన్నీ ముప్పు నుండి కాపాడతామని ప్రచారంలో వాగ్దానం చేస్తున్నారు. మోదీ సైతం అదే విషయం మాట్లాడుతున్నారు. ఏమైనా ఫలితాలు మోదీని ఆశ్చర్యపరచవచ్చు.


పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ప్రధాని నరేంద్రమోదీని ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ ఛన్నీ, ఆప్‌ అభ్యర్థి భగవంత్‌ మన్‌లలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొనిఉంది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఎంపిక చేసిన ఛన్నీపైన రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు తొలి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఛన్నీ ఎంపిక తరవాత కూడా సిద్ధు వైఖరి పెద్దగామారలేదు. ధ్వనికాలుష్యం పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ పెద్దగా ఎవరూ ఖాతరు చేసినట్లు కనిపించదు. రణగొణ ధ్వనికేమీ కొదవలేదు. ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగ నున్నాయి. చర్చతో ఛన్నీకి సంబంధాల పైన గుసగుసలాడు కుంటున్నారే కానీ ఎవరూ బహిరంగంగా మాట్లాడ్డం లేదు. అయితే సిద్ధు మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా ఛన్నీని తక్కువ చేసి మాట్లాడేందుకే ప్రయత్ని స్తున్నారు.
నరేంద్రమోదీ పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి వేలంటైన్స్‌డే (ప్రేమికుల రోజు) ని ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా ఛన్నీకి చర్చితో గల సంబం ధాలను ప్రస్తావించి ఆయనను ఇబ్బందులకు గురి చేయాలని చూశారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీకి పంజాబ్‌లో గెలుపు అవకాశాలు ఉన్నా యని ఏ రాజకీయ విశ్లేషకుడు చెప్పడం లేదు. బీజేపీ పేరును పెద్దగా ప్రస్తా వించకుండా ఎన్డీఏకు ఓట్లు వేసి గెలిపించాలని మాత్రమే మోదీ విజ్ఞప్తి చేశా రంటే ఆ పార్టీ పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది. గతంలో మోదీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా ఎస్పీజీ వాహన శ్రేణి ఫిరోజ్‌పూర్‌ వంతెనపైన అర్ధంతరంగా నిలిచిపోయింది. ఆనాడు జరిగిన సంఘటనను అవకాశంగా తీసుకుని మోదీ తనకు అనుకూలంగా భారీ ప్రచారానికి తెర తీశారు. తాను ప్రాణాలతో సురక్షితంగా బయటపడటానికి అనుమతించిన ఛన్నీకి కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేసి నానాయాగీ సృష్టించారు. చివరకు సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన తరవాతనే మోదీ ప్రచారం దాదాపు ఆగిపోయింది. భిన్న సంఘటనలను తనకు అనుకూలంగా ప్రచారంలో పెట్టడంలో మోదీని మించిన వారెవరూ లేరు.
ఎన్నికల ప్రచారానికి మోదీని అనుమతించబోమని ఏడాదికిపైగా మహత్తర ఉద్యమాన్ని నడిపిన రైతులు ప్రకటించిన తరవాతనే ఆయన తన పర్యటనను నిర్ణయించుకుని పంజాబ్‌ను సందర్శించారు. ఆయన పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలో ఛన్నీ తప్పేమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. తాజా పర్యటన సందర్భంగా కూడా రాష్ట్రంలో తన పర్యటనకు తగిన భద్రతా సౌకర్యాలు లేవని మాట్లాడారు. ప్రధానంగా ఎన్డీఏకు రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టాలని కోరడానికి పరిమితమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌ ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయ్యారు. ఆయనతో పాటు ఒకనాడు ప్రధాన పక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్‌ నాయకుడు మంజిందర్‌ సింగ్‌ సిర్సా మోదీ సిక్కులకు అండగా ఉన్నారని ప్రచారం సాగిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారానికి వచ్చి 2022 మార్చి 10న నవ పంజాబ్‌కు శ్రీకారం చుడుతుందని ఎప్పటివలనే మోదీ తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. పంజాబ్‌లో మత్తు పదార్థాల వినియోగం సమస్యను రాత్రికి రాత్రే పరిష్కరిస్తానని మోదీ అన్నారు. ఆయన కేంద్రంలో అధికారానికి వచ్చిన తరవాత ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్న విషయాన్ని ఆయన మరిచిపోయారు.
ఎన్నికల రంగంలో ఛన్నీ ఉన్నారని కూడా ఆయన ప్రస్తావించకుండా రానున్న ఐదేళ్లలో డబుల్‌ ఇంజన్‌ సర్కారును అందిస్తామని ఊదరగొట్టారు. ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి మన్‌ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవనున్నారన్న అంచనాలు వెలువడ్డాయి. ఆప్‌ నాయకుడు, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌, ఎన్డీఏ లతో పోల్చుకుంటే ఆప్‌కు అనుకూలంగా ఓటర్లు మారిపోయారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్పు కావాలని రాష్ట్ర ప్రజలు గట్టిగా కోరు తున్నారు. ఆప్‌కి ఓటర్లలో గణనీయమైన మద్దతు కనిపిస్తోంది. ప్రజల మనో భావాలను ఛన్నీ లేదా కాంగ్రెస్‌ తిరస్కరించలేని పరిస్థితి. ఛన్నీ ముఖ్యమంత్రిగా కొద్దికాలమే ఉన్నప్పటికీ ప్రజలు ఆయన పాలన పట్ల సానుకూలంగానే ఉన్నారు. సిద్ధు సృష్టిస్తున్న అడ్డంకులను, ఆటంకాలను పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవటం కూడా ప్రజలకు నచ్చింది. ఆయనకు గట్టిగా అండగా నిలిచే కార్యకర్తలు, అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆప్‌ అభ్యర్థి మన్‌ గెలుపు అంత తేలికేమీ కాదు. ఒకవేళ ఆప్‌ గెలుపొందినట్లయితే ఆ పార్టీ మొదటి ముఖ్యమంత్రి మన్‌ అవుతారు. ఆప్‌కి ప్రజాదరణ పెరుగుతుంది.
హాస్య నటుడైన మన్‌ ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తు న్నారు. మాల్వా ప్రాంతంలో సింగ్రూర్‌ ఏరియాలో ధురి ఉంది. ఈ ప్రాంతంలో ఎవరు గెలిస్తే వారే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారమూ ఉంది. ఈ ప్రాంతంలో ఆప్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుంది. కాంగ్రెస్‌ కంటే ఆప్‌కి ఎక్కువ అనుకూలత ఉన్నట్టు భావిస్తున్నారు. ఆప్‌కి జట్టా తరగతి ఓట్లు ఎక్కు వగా లభించవచ్చునని భావిస్తున్నారు. దళితుల ఓట్లు ఛన్నీకి అనుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు పంజాబ్‌ను ఛన్నీ ముప్పు నుండి కాపాడతామని ప్రచారంలో వాగ్దానం చేస్తున్నారు. మోదీ సైతం అదే విషయం మాట్లాడుతున్నారు. ఏమైనా ఫలితాలు మోదీని ఆశ్చర్యపరచ వచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img