Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పతనమవుతున్న రూపాయి

మోదుమూడి మురళీకృష్ణ

2014కు ముందు బీజేపీ అధికారంలోకి రాక ముందు డాలర్‌తో రూపాయి విలువ 68కి పడిపోతే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రూపాయి ఐసీయూలో పడిపోయిందనీ, తాము అధికారం లోకి వస్తే దేశీయ కరెన్సీని ప్రపంచ మార్కెట్‌లో నిలదొక్కు కునేలా చేస్తామని అనేక గొప్పలు చెప్పారు. అయితే, అధికారంలోకి వచ్చాక అందుకు అనుగుణంగా తీసుకున్న చర్యలు మృగ్యం.


అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజు రోజుకు అగాథంలోకి పడిపోతున్నది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌తో పోల్చితే 79 దాటేసి రూ.80కి చేరువలో పతనమవుతున్నది. మందగమన భయాలు, అధికంగా ఉన్న చమురు ధరలు, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు, భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) వద్ద మారకం నిల్వలు తగ్గిపోవడం తదితర అంశాలు రూపాయిని కుదేలు చేస్తున్నాయి. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీరుస్తున్నందున దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి రావడం, ముడి పదార్థాలు, వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం రూపాయి విలువ క్షీణతకు కారణాలుగా చెప్పవచ్చు. రూపాయి మారకం విలువ తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యాపార సంస్థలతో పాటు అన్ని వర్గాల ప్రజలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫెడ్‌ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతుందన్న అంచనాలతో డాలర్‌ మరింతగా బలపడుతుందని, బంగారంపై దిగుమతి సుంకం పెంచినందున రూపాయికి కొంతమేర మద్దతు లభించ వచ్చనీ, విదేశీ పోర్ట్‌ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్‌ మార్కెట్లో ఎడతెరపి లేకుండా విక్రయాలు జరపడం కూడా రూపాయి విలువను దెబ్బ తీస్తున్నదని విశ్లేషకుల అభిప్రాయం.
2014కు ముందు బీజేపీ అధికారంలోకి రాక ముందు డాలర్‌తో రూపాయి విలువ 68కి పడిపోతే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రూపాయి ఐసీయూలో పడిపోయిం దనీ, తాము అధికారంలోకి వస్తే దేశీయ కరెన్సీని ప్రపంచ మార్కెట్‌లో నిలదొక్కుకునేలా చేస్తామని అనేక గొప్పలు చెప్పారు. అయితే, అధికారంలోకి వచ్చాక అందుకు అనుగుణంగా తీసుకున్న చర్యలు మృగ్యం. ప్రస్తుతం అంతకంటే దారుణమైన స్థితిలోకి రూపాయి విలువ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసు కుంటున్న కట్టడి చర్యలు శూన్యం. దేశీయ గణంకాలు బలహీనంగా చోటు చేసుకోవడానికి తోడు అంతర్జా తీయంగా డాలర్‌ విలువ పెరగడం రూపాయిని ఒత్తిడికి గురి చేస్తోంది. రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్‌ విలువ గణనీయంగా పెరగడంతో మన దేశ విద్యార్థు లకు విదేశీ చదువు కూడా తీవ్ర భారంగా మారింది. ఉన్నత విద్య కోసం మన దేశం నుంచి అత్యధికులు అమెరికాకే వెళతారు. డాలర్‌ విలువ విపరీతంగా పెరగడంతో కాలేజీ ఖర్చుల కోసం రూపాయలలో చాలా ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూపాయితో పోలిస్తే డాలర్‌ విలువ 75 రూపాయలు. మార్చి నుంచి రూపాయి విలువ క్షీణిం చడం ప్రారంభమైంది. మంగళవారం డాలర్‌తో రూపాయి విలువ 79.83కు చేరింది. దానితో కొంచెం కళ్లు తెరిచి ఆర్బీఐ చర్యలు తీసుకోవడం ప్రారంభిం చింది. దానితో డాలర్‌ విలువ బుధవారం కొద్దిగా తగ్గి రూ. 78.94గా నమోదైంది. ప్రస్తుత ఏడాది జూన్‌లో భారత ఎగుమతుల కంటే దిగుమతులు అధికంగా ఉండడం, రికార్డ్‌ స్థాయిలో వాణిజ్య లోటు 25.63 బిలియన్‌ డాలర్లకు చేరడంతో రూపాయిపై భారం మరింత ఎక్కువగా పెరిగింది. రూపాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో దిగుమతి ఆధారిత అనేక ఉత్ప త్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. చమురు ధరలు మరింత మండనున్నాయి. ఇప్పటికే చుక్కలనంటుతున్న ధరలతో నానా అగచాట్లు పడుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలు మరిన్ని అగచాట్లు పడతారు. వారి జీవనం అస్తవ్యస్తమవుతుంది. విదేశీ రుణాలు తలకు మించిన భారం కానున్నాయి. ఈ పరిస్థితులను అవకా శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మరింత పన్నుల భారాన్ని మోపేందుకు ఏ మాత్రం వెనుకాడదు. ఇప్పటికే భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం మరింత పెర గటంతోపాటు వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం పడ నుంది.
రానున్న రోజులలో రూపాయి విలువ మరింత క్షీణి స్తుందని విశ్లేషకుల అంచనా. ఈ ఆర్థిక సంవ త్సరం మూడో త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో రూపాయి విలువ రూ.82 స్థాయికి పడిపోతుందని అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు నోమురా అంచనా వేసింది. ఇప్పటికే రూపాయి విలువ క్షీణించడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఫెడ్‌ వడ్డీరేట్లను భారీగా పెంచు తుందన్న భయాలతో విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ)లు వర్థమాన మార్కెట్ల నుంచి నిధుల తరలింపును వేగవంతం చేస్తారని నోమురా వివరించింది. దీంతో భారత్‌ కరెంట్‌ ఖాతా లోటు (దేశంలోకి వచ్చే విదేశీ మారకం-పోయే మారకం మధ్య వ్యత్యాసం) ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3.3 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. గత ఏడాది ఈ లోటు 1.2 శాతంగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img