Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పాలకుల విధానాల వల్లే రైతు దీనస్థితి

బొల్లిముంత సాంబశివరావు

దేశ వ్యాపితంగా 10.18 కోట్ల కమతాలు ఉంటే, అందులో 2.50 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్న కారు రైతులు 76.6 శాతం ఉన్నారు. వీరికి వచ్చే ఆదాయమే అతి స్వల్పం. వీరికి పంటల నుండి నెలకు 6,388 రూపాయలు వస్తున్నట్లు సర్వే పేర్కొంది. వాస్తవంలో ఈ ఆదాయం కూడా రైతుకు రావటం లేదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, డీజిల్‌ ధరలు పెరుగుతూ ఉండటం వలన 1952లో రూ.152 లు ఉన్న ఎకరా వరి సేద్యపు ఖర్చు నేడు 26 వేలకు పైగా పెరిగింది.

బ్రిటిష్‌ వలస పాలకులు, వారి నుండి అధికారాన్ని పొందిన దేశీయ పాలకులు వ్యవసాయ రంగంలో ఒకే విధానాన్ని అనుసరించారు. వ్యవసాయ రంగంలో దేశీయ విధానాలు అమలు జరగలేదు. ఫలితంగా రైతాంగం ఆదాయం పెరగకపోగా ఆహార ధాన్యాలకు అమెరికాపై ఆధారపడి దిగుమతి చేసుకోవలసి వచ్చింది. ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి పేరుతో 1966లో ప్రపంచ బ్యాంకు సూచనతో సస్య విప్లవం అంటూ విదేశాల నుండి ముఖ్యంగా అమెరికా నుండి హైబ్రీడ్‌ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దిగుమతి అయ్యాయి. ఫలితంగా సాంప్రదాయ విత్తనాలు, ఎరువులు వాడకం తగ్గి పోయింది. బహుళ జాతి కంపెనీల విత్తనాల, ఎరువుల, పురుగు మందుల వ్యాపారానికి భారతదేశం మంచి మార్కెట్‌గా మారింది. దీనివలన రైతుల మిగులు ఆదాయం పెరగకపోగా సేద్యపు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పంటలకు గిట్టుబాటు ధరలు, మార్కెట్‌ సౌకర్యం లభించక, ప్రకృతి వైప రీత్యాలకు పంటలు నష్టపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోవటం ప్రారంభ మైంది. ప్రపంచ వాణిజ్య ఒప్పందంపై సంతకం, వ్యవసాయ ఒడంబడికను ఆమోదించటం వలన రైతాంగ సంక్షోభం తీవ్రమై బలవన్మరణాలు ప్రారంభ మైనాయి. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిరది. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాపితంగా రైతాంగం ఆదాయం, స్థితిగతుల గురించి 2018 జూన్‌ నుంచి 2019 జూన్‌ మధ్యకాలంలో జాతీయ నమూనా సర్వే జరిగింది. రైతుల దారుణ పరిస్థితులను ఆ సర్వే కొంతమేరకు వెల్లడిరచింది. నేడు సేద్యం ద్వారా రైతుకు వస్తున్న ఆదాయం, సేద్యపు ఖర్చులు, పొలం వివరాలను సర్వే పేర్కొంది. సాగు చేస్తున్న కమతాన్ని బట్టి రైతాంగాన్ని వర్గీకరణ చేసి, ఏ కమతానికి ఎంత ఆదాయం నెలకు వస్తుందో సర్వే వివరించింది. దాని ప్రకారం నెలకు ఎకరం లోపు భూమి ఉన్న రైతుకు వచ్చే ఆదాయం 6,388 రూపాయలు, రెండున్నర ఎకరాల లోపు రైతులకు రూ. 6,951లు, 1 నుండి 2 హెక్టార్ల లోపు రైతుకు రూ. 9,189 లు, 2 నుంచి 4 హెక్టార్ల లోపు రైతులకు రూ. 12,997 లు, 4 నుంచి 10 హెక్టార్ల లోపు రైతులకు రూ. 22,453 లు, 10 హెక్టార్లు పైగా ఉన్న వారికి 50,412 రూపాయల ఆదాయం నెలకు వస్తున్నట్లు నమూనా సర్వే వెల్లడిరచింది. దీన్ని గమనిస్తే చిన్న, సన్నకారు రైతులకు, పెద్ద భూ కామందు లకు వచ్చే ఆదాయంలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. అందుకు కారణం కమతాల్లో వ్యత్యాసమే. కష్టపడి పంట పండిరచే చిన్న, సన్నకారు రైతు లకు తక్కువ భూమి, కష్టపడని భూ కామందులకు చాలా ఎక్కువ భూమి ఉంది.
దేశ వ్యాపితంగా 10.18 కోట్ల కమతాలు ఉంటే, అందులో 2.50 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్న కారు రైతులు 76.6 శాతం ఉన్నారు. వీరికి వచ్చే ఆదాయమే అతి స్వల్పం. వీరికి పంటల నుండి నెలకు 6,388 రూపాయలు వస్తున్నట్లు సర్వే పేర్కొంది. వాస్తవంలో ఈ ఆదాయం కూడా రైతుకు రావటం లేదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, డీజిల్‌ ధరలు పెరుగుతూ ఉండటం వలన 1952లో రూ.152 లు ఉన్న ఎకరా వరి సేద్యపు ఖర్చు నేడు 26 వేలకు పైగా పెరిగింది. సగటు దిగుబడి ఎకరాకు 22 క్వింటాళ్లు. ప్రభుత్వ మద్దతు ధర 1880 రూపాయల ప్రకారం రూ. 41,360 ఆదాయం వస్తుంది. మిగిలే ఆదాయం 15,360 రూపాయలు. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కన్నా ఎక్కువ లభించినప్పుడు ఇంకొంచెం మిగులు ఎక్కువగా లభిస్తుంది. రెండవ పంట నుండి వచ్చే ఆదాయంతో కలిపి పంటలపై రైతుకు వచ్చే ఆదాయం 32 వేలకు మించదు. నెలవారీ ఆదాయం చిన్న రైతులకు వచ్చేది మూడు వేల రూపాయల లోపే. ఈ రైతులు ఎక్కువ రోజులు కూలి పనులకు వెళ్లటం ద్వారా వచ్చే ఆదాయంతో వారి నెలసరి ఆదాయం మరికాస్త పెరిగింది. కూలి పనులు కుదించుకు పోవటంతో దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా చిన్న రైతులకు తగ్గిపోయింది. చిన్న రైతులు పాడి గేదెలను పెట్టుకుని కొంత ఆదాయం పొందేవారు. ప్రస్తుతం ఆ ఆవకాశం కూడా వీరికి లేదు. ఒకటి నుండి రెండు హెక్టార్ల లోపు రైతులు అందుకు ఏ మాత్రం భిన్నంగా లేరు. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలు కూడా చిన్న, సన్న, దిగువ మధ్యతరగతి రైతులకు దక్కటం లేదు. చాలీచాలని ఆదాయంతో చిన్న రైతులు, మధ్య తరగతి రైతులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. పిల్లల, కటుంబ పోషణ భారంగా మారి అప్పులు చేయాల్సిన పరిస్థితులకు జారిపోయారు. అవి తీర్చేం దుకు ఉన్న కాస్త భూమిని అమ్ముకుంటూ కూలీల జాబితాలో చేరు తున్నారు. జాతీయ నమూనా సర్వే రైతులకు వచ్చే ఆదాయం గురించి చెప్పిందే కాని, అందుకు కారణాలు చెప్పకపోవటం వలన సర్వే పూర్తి న్యాయబద్ధంగా లేదు. పాలకుల విధానాల ఫలితంగానే వ్యవసాయం సంక్షోభంలో పడిరది. బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం వ్యవసాయాన్ని దండగగా మార్చి వ్యవసాయం నుండి రైతులు వైదొలిగేలా చేసి వారి భూములు కార్పొరేట్‌ సంస్థ లకు అప్పగించేందుకు పాలకులు సిద్ధమయ్యారు. తక్కువ ఆదాయం రావడానికి పాలనా విధానాలే కారణం.
చిన్న, సన్న కారు రైతుల ఆదాయం పెరగాలంటే, సేద్యపు ఖర్చులు తగ్గే విధంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు తగ్గించాలి. వాస్తవ పంట ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరలు ప్రకటించి ప్రభుత్వమే కొను గోలు చేయాలి. వడ్డీలేని పంట రుణాలు అవసరం మేరకు ఇవ్వాలి. గ్రామీణ ఉపాధి పనులు పెరిగే విధానాలు అమలు చేయాలి. భూ కమతాల్లో మార్పులు జరిగే విధంగా భూ సంస్కరణలు అమలు చేసి ప్రభుత్వ భూములు, భూస్వాముల మిగులు భూములు గ్రామీణ పేదలతో పాటు వీరికి కూడా పంపిణీ చేయాలి.
వ్యాస రచయిత సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img