Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పెట్టుబడిదారుల సేవలో తరిస్తున్న ప్రభుత్వాలు

డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి

దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాల మధ్య తేడా గమనిస్తే ఆశ్చర్యపోతారు. నెహ్రూ పాలనలో ముంద్ర కుంభకోణం బైటపడిరది. ఈ కేసులో ఆనాటి ఆర్థికమంత్రి టీటీ కృష్ణమాచారి రాజీనామా చేశారు. ఇప్పుడు మోదీ సన్నిహితుడు గౌతమ్‌ అదానీ గ్రూపుపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై మోదీ కనీసం మాట్లాడటంలేదు. కలకత్తాకు చెందిన హరిదాస్‌ ముంద్ర పరిశ్రమల్లో కొత్తగా ఏర్పాటైన ఎల్‌ఐసీ 1.26కోట్లకు అధిక ధరలు చెల్లించి వాటాల కొనుగోలు ద్వారా పెట్టుబడులు పెట్టింది. ఆర్థిక కష్టాల్లోఉన్న ముంద్ర పరిశ్రమలలో ఎల్‌ఐసీ అధిక ధరలకు వాటాలుకొని సహాయపడిరదన్న ఆరోపణలు రుజువయ్యాక కృష్ణమాచారి రాజీనామా చేశారు. అదానీ గ్రూపు లెక్కలు చూపించడంలోనూ షేర్‌మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించడం లోనూ అక్రమాలకు పాల్పడిరదన్న ఆరోపణలు వచ్చినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. మోదీ ప్రభుత్వం పార్లమెంటులో సైతం ఈ వ్యవహారంపై కనీసం మాట్లాడటంలేదు. నెహ్రూ ప్రభుత్వానికి, మోదీ ప్రభుత్వానికి మధ్యగల తేడాను గమనించాలి. గత ప్రభుత్వాలలో జరిగిన తప్పులను ఇప్పుడు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. ఆనాడు ప్రైవేటు బీమా రంగంలో జరుగుతున్న అక్రమాలను, అవినీతిని బైటపెడుతూ 1955 లోక్‌సభలో ప్రముఖ పార్లమెంటు సభ్యుడు ఫిరోజ్‌ గాంధీ బైటపెట్టాడు. ఫిరోజ్‌ గాంధీ పరిశోధనాత్మక జర్నలిస్టు కూడా. ఆయన రామకృష్ణ దాల్మియా (దాల్మియా జైన్‌గ్రూపు) చేసిన అవినీతి ఆరోపణలు కూడా రుజువుకావడంతో దోషి రెండేళ్లు జైలుశిక్ష అనుభవించాడు. బీమా రంగంలో అవినీతిని సహించరాదని నెహ్రూ ప్రభుత్వం 250 ప్రైవేటు బీమా కంపెనీలను జాతీయంచేసి ఎల్‌ఐసీ ఏర్పాటు చట్టాన్ని పార్లమెంటులో ఆమోదింపచేశారు.
1957జూన్‌లో ఆరు హరిదాస్‌ ముంద్రా పరిశ్రమల్లో ఎల్‌ఐసీ కోటి రూపాయలు పెట్టుబడి పెట్టింది. అది అప్పటికీ తక్కువ మొత్తం అయి ఉండవచ్చు. ఇప్పుడు ఎల్‌ఐసీ భారీపెట్టుబడులు పెట్టింది. పెట్టుబడులు పెట్టే ముందు ఎల్‌ఐసీ పెట్టుబడుల కమిటీలను సైతం సంప్రదించలేదు. సంస్థాగత అవినీతిని ఫిరోజ్‌గాంధీ ఎంతమాత్రం సహించేవాడుకాదు. అందుకనే అవినీతిపరులపైన కొరడా రaళిపించాడు. నెహ్రూ స్వయాన ఆయన మామ అయినప్పటికీ ఫిరోజ్‌ వెనుకాడకుండా కుంభకోణాలను బైటపెట్టి అందుకు కారణమైనవారిని శిక్షింపచేశాడు. పైన తెలిపిన కుంభకోణాలపై నెహ్రూ ప్రభుత్వం ఎమ్‌సీ చాగ్లా కమిషన్‌ను వేశారు. కేవలం 24రోజుల్లో కమిషన్‌ తనదర్యాప్తు ముగించి నివేదిక అందించింది. కమిషన్‌ అత్యంత పారదర్శకంగా విచారణ జరిపింది. ముంద్రా పరిశ్రమలను గట్టెక్కించడంలో కృష్ణమాచారి సహకరించాలన్న ఆరోపణలు రుజువు కావడంతో ఆయన రాజీనామా చేశారు. 1990లలో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేసిన ఆర్థిక కుంభకోణాన్ని సీపీఐ నాయకుడు గురుదాస్‌ దాస్‌ గుప్తా బైటపెట్టాడు. స్టాక్‌మార్కెట్‌లో జరుగుతున్న అనేకఅక్రమాలను ఆయన వెల్లడిరచాడు. తీవ్రఆర్థిక అక్రమాలకు పాల్పడిన హర్షద్‌ మెహతా కేసు దేశప్రజలను విభ్రాంతికి లోనుచేసింది. స్టాక్‌ బ్రోకర్‌ హర్షద్‌మెహతాపై అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేసింది. దేశంలో జరిగిన అతిపెద్ద ఆర్థిక మోసాన్ని దర్యాప్తు కమిటీ బైటపెట్టింది. ఈ కేసులో ఆనాటి వాణిజ్యశాఖ సహాయమంత్రి పి.చిదంబరం రాజీనామా చేశారు. హర్షద్‌ మెహతా స్టార్‌ ఎక్స్‌చేంజి కుంభకోణానికి సంబంధించిన దాదాపు అనేక డజన్ల కంపెనీలలో ఒకదానిలో చిదంబరం పెట్టుబడులు పెట్టారు. అనేక సంస్థలు, వ్యక్తులు అధికార కేంద్రాలకు సన్నిహితంగా ఉన్నారని వీటిపట్ల నిర్లక్ష్యం ఉన్నదని ఆనాటి జేపీసీ వెల్లడిరచింది. ఈ కుంభకోణంపై దర్యాప్తు అంతిమంగా దేశంలోని మార్కెట్‌ నియమనిబంధనలను పూర్తిగా సరిచేసేందుకు దోహదపడిరది. జవాబుదారీ యంత్రాంగాలను ఏర్పాటు చేశారు.
అదానీ గ్రూపు అకృత్యాలు వెలుగుచూసిన వ్యవహారంలో ఒక అంశం స్పష్టంగా ఉంది. ఇందులో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడా కనిపించదు. అదానీ గ్రూపుకు చెందిన లిస్టెడ్‌ కంపెనీలన్నింటికీ అధిక ప్రాధాన్యత, అధిక విలువకు వాటాల విక్రయం లాంటి అక్రమాలను ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన హిండెన్‌బర్గ్‌ కనుగొన్నది. కనీసం రెండు అదానీ కంపెనీలలో షేర్ల అసలుధరకు, కొనుగోలు ధరకు 800 రెట్లు తేడా ఉన్నదని అనుమతిఉన్న పరిమితులకంటే ఇది చాలా ఎక్కువని హిండెన్‌బర్గ్‌ బైటపెట్టింది. ఈ వ్యవహారాలన్నింటిపైన సమగ్రంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఎంతైనాఉంది. ఫోర్బ్స్‌ పత్రిక అంచనాప్రకారం, గౌతమ్‌ అదానీ గ్రూపు సంపద 2009నాటికి 6.4బిలియన్‌ డాలర్లు ఉంది. 2014నాటికి ఇది 7.1బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇది 2019నాటికి రెట్టింపుకంటే ఎక్కువగా 15.1 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. మోదీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనా కాలాన్ని పూర్తిచేసుకునే నాటికి అదానీ గ్రూపు ఊహించలేని స్థాయికి ఆర్థికంగా పెరిగిపోయింది. ఆ తరువాత అదానీ సొంతగా 124 బిలియన్‌ డాలర్లకు అమాంతం పెరిగి ప్రపంచంలోనే రెండవ పెద్ద సంపన్నుడిగా వార్త్తలకెక్కాడు. 2020నాటికి మరో 47 బిలియన్‌ డాలర్ల సంపద వచ్చి చేరింది. ఎలాంటి అనుభవం లేకపోయినా అనేక విమానాశ్రయాలను, ఆస్ట్రేలియాలో బొగ్గు గనులను, బంగ్లాదేశ్‌లో విద్యుత్తు ప్రాజెక్టు కాంట్రాక్టులను దక్కించుకున్నాడు. అదానీ పేరు సర్వవ్యాప్తమైంది. ఒక వ్యక్తివద్ద అసాధారణమైన సంపద పోగుకావడం నిజంగా ఆందోళన కలిగించే అంశం. అసలు విలువకంటే అధిక విలువగల కంపెనీలుగా మారిన అదానీ కంపెనీలు కేవలం సంస్థాగత, రిటైల్‌ పెట్టుబడిదారులకేకాక దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరమైన వ్యవహారం. అదానీగ్రూపు రక్షణ విభాగంలాంటి అనేక కీలక రంగాలలో చొరబడటం మరింత ముప్పు కలిగించే విషయం.
ప్రముఖ ఆర్థిక సంస్థలు ఎల్‌ఐసీ,ఎస్‌బీఐ లాంటివికూడా అదానీ గ్రూపు కారణంగా ఆర్థికంగా నష్టపోయాయి. అయితే ఈ రెండు కూడా వ్యవహారాన్ని తేలికగా తోసిపుచ్చి అదానీకి చెడ్డపేరురాకుండా చూడాలని భావించాయి. ఇవి దేశ ఆర్థిక సమగ్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ కమిటీ ద్వారా దర్యాప్తు జరిపించాలన్న డిమాండు పూర్తిగా న్యాయమైంది. అసలు వాస్తవం వెలుగుచూడాలి. దర్యాప్తుకు భయపడవలసిన అవసరం ఏముంది? ఆనాడు ముంద్రా కుంభకోణం వ్యవహారంలో ఫిరోజ్‌గాంధీ లోక్‌సభలో చర్చను ప్రారంభిస్తూ ఇంత తీవ్రమైన వ్యవహారాలు వెలుగు చూసినప్పుడు మౌనం కూడా నేరమే అవుతుందని అన్నారు. అసలు ఏమిజరిగిందన్నది తెలుసుకుని జవాబుదారీతనాన్ని నిర్థారించడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ అవశ్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img