Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పెత్తందార్లను ఎదిరించిన పెద్దయ్య

కె. రామాంజనేయులు

కర్నూలు జిల్లా డోన్‌ తాలూకా కరడుగట్టిన ముఠా నాయకుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న తరుణాన అక్కడ సీపీఐ ఆవిర్భావానికి (1975లో) పునాది వేసిన నాయకులలో కామ్రేడ్‌ సొంటె పెద్దయ్య ఒకరు. ఆయన డోన్‌ తాలూకా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ప్రముఖులు. అవినీతిని, భూస్వా ముల అక్రమాలను ఎదిరించి ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులైన పెద్దయ్య తన జీవితాంతం పార్టీకి అంకితమై పనిచేశారు. తాను పని చేయడమే కాదు తన కుటుంబాన్ని కమ్యూనిస్టు పార్టీ కుటుంబంగా తీర్చిదిద్దారు. గ్రామ పెత్తందార్లకు, భూస్వాములకు, వారి అనుచరుల ఆగడాలకు ఎదురు నిలిచారు. జిల్లా నాయకులతో కలిసి భూపోరాటాల్లో పాల్గొన్నారు. భూమి లేని నిరుపేదలకు భూములు దక్కేలా చేశారు. ఈ ప్రాంతంలో పార్టీ విస్తరణకు కృషి చేశారు.
ఎద్దుపెంట గ్రామ విఆర్‌ఒగా ఉన్న నరసింహారెడ్డి గ్రామస్తులపై పెత్తం దారుగా ఆగడాలకు పాల్పడుతుండడంతో ఆయనకు వ్యతిరేకంగా పోరాడేం దుకు నిర్ణయించుకున్న పెద్దయ్య ఇలాంటి సమస్యలపై పోరాడే భారత కమ్యూనిస్టు పార్టీ గురించి తెలుసుకున్నారు. ఆదోనిలో 1975లో సీపీఐ జిల్లా మహాసభలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లిన పార్టీ సభ్యత్వం పొందారు. ఇదే సంవత్సరం బి.రామదుర్గం గ్రామంలో గయోపాఖ్యానం నాటకాన్ని ప్రదర్శించడానికి పూనుకోగా ఆ గ్రామ పెత్తందార్లు ఆ నాటకాన్ని ప్రదర్శిస్తే గ్రామంలో ఘర్షణలు జరుగుతాయని పోలీసు అధికారులకు తప్పుడు ఫిర్యా దు చేసిన ఫలితంగా పోలీసులు ఆ నాటకాన్ని ఆడనివ్వకుండా చేశారు. ఆనాడు సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఉన్న వై.స్వామి రెడ్డి, చదువుల రామయ్యతో కలిసి డోన్‌ డీఎస్పీ కార్యాలయం ముందు బి.రామదుర్గం గ్రామ ప్రజలతో కలిసి ధర్నా చేసి, జరిగిన వాస్తవ సంఘటనలను పోలీస్‌ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. అనంతరం పోలీసుల బందోబస్తుతో గ్రామంలో విజయ వంతంగా నాటకం ప్రదర్శించి పెత్తందార్ల అహంభావంపై తొలి విజయం సాధించారు. ఒక ప్రధాన ముఠా నాయకుని అనుచరులపై తిరగబడి సాధిం చిన విజయోత్సవంతో బి.రామదుర్గం, ఎద్దుపెంట, తాడూరు గ్రామాలలో సీపీఐ శాఖలు ఏర్పడ్డాయి. పెత్తందార్ల దౌర్జన్యాలపై ప్రజలను చైతన్యపరిచేం దుకు గ్రామ పంచాయతీ కేంద్రమైన ఎద్దుపెంటలో జరిగిన సీపీఐ బహిరంగ సభను విచ్చిన్నం చేసేందుకు గ్రామ విఆర్‌ఓ నరసింహారెడ్డి అన్ని రకాలుగా ప్రయత్నించారు. సభ జరిగిన రోజు గ్రామంలో ఉన్న అంగళ్ళను మూసి వేయించారు. అయినా బహిరంగ సభ విజయవంతమైంది. ఆ సభకు మొద టిసారిగా కటారుకొండ గ్రామం నుండి నక్కి రామన్న నాయకత్వాన హాజరైన 10మంది యువకులు తమ గ్రామంలో అనేక సంవత్సరాలుగా ఉన్న ఫ్యూడల్‌ భూస్వామ్య, పెత్తందార్ల ఆగడాలను వివరించి, ప్రజలకు అండగా నిలవాలని సీపీఐ నాయకత్వాన్ని కోరారు. దీంతో ఆ గ్రామంలో మొదట రైతు సంఘం, అనంతరం సీపీఐ శాఖలు ఏర్పడ్డాయి. బి.రామదుర్గం గ్రామశాఖకు కె.చంద్రప్ప, ఎద్దుపెంట గ్రామశాఖకు పెద్దయ్య, కటారుకొండ గ్రామశాఖకు నక్కి రామన్న కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.
ఒకవైపు ప్రత్యర్థుల ఆటంకాలను ఎదుర్కొంటూనే గ్రామంలో ఆనాడు పెత్తందార్లు అక్రమంగా రాయించుకుని అనుభవిస్తున్న భూములను వారి నుండి విముక్తి చేసి అప్పగించారు. గ్రామంలో చాకలి ఇనాం భూములను పార్టీ ఆధ్వర్యంలో విడిపించి గ్రామ సేవకులైన రజకులకు అప్పగించారు. ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలంలో 50 మందికి ప్రభుత్వం చేత పట్టాలు ఇప్పించారు. మిద్దేపల్లిలో ఎద్దుపెంట విఆర్‌ఓ అనుచరుల ఆగ డాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి విజయం సాధించారు. ఎద్దు పెంట, అనుంపల్లి, మిద్దెపల్లి గ్రామాల్లో రైతులతో పెత్తందారులు అక్రమంగా ప్రాంసరీ నోట్లు రాయించుకున్న వైనంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన వచ్చి ప్రాంసరీ నోట్లను స్వాధీనం చేసుకుని ప్రజల సమక్షంలో చించి రైతులను రుణ విముక్తులు చేశారు. హరిజనుల నుండి అక్రమంగా కొన్న భూములు 12 ఎకరాలను తిరిగి హరిజనులకు అప్పగించారు. హరిజన వాడలో ఇండ్ల స్థలాలకు ప్రభుత్వం నుండి పట్టాలు ఇప్పించి కాలనీ ఏర్పా టుకు కృషి చేశారు. హరిజన వాడలో తాగునీటి కొరతను పరిష్కరించేందుకు రక్షిత మంచినీటి పథకం ట్యాంక్‌ నిర్మించగా సీపీఐ రాష్ట్ర నాయకులు సురవరం సుధాకర్‌ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.
ఎద్దుపెంట గ్రామ ఆడపడుచు హరిజన కమ్మక్క కుటుంబానికి చెందిన తిరునాంపల్లి గ్రామంలో ఆ గ్రామ భూస్వామి యాటికంటి లక్ష్మిరెడ్డి ఆక్ర మించిన 30 ఎకరాల డిసి భూమిని తమకు అప్పగించి న్యాయం చేయాలని సీపీఐ నాయకుడైన పెద్దయ్యను ఆశ్రయించగా సీపీఐ డోన్‌ మండల కార్య దర్శి నక్కి రామన్న, పార్టీ జిల్లా కార్యదర్శి చదువుల రామయ్యతో సంప్రదించి అంచలంచలుగా ఆందోళన చేశారు. పార్టీ నాయకత్వాన భూ పోరాటం చేశారు. పోరాటాలకు భయపడిన భూస్వామి యాటికంటి లక్ష్మీరెడ్డి సీపీిఐ జిల్లా కార్యదర్శి చదువుల రామయ్యను గ్రామానికి ఆహ్వానించి ఆ గ్రామ పెద్ద రైతులు ఆక్రమించిన 130 ఎకరాల డిసి భూమిని అప్పగించగా, భూమి లేని నిరుపేదలైన దళిత, గిరిజన కుటుంబాలకు దీనిని పంపిణీ చేసారు. 30 ఎకరాల కోసం భూ పోరాటం చేయగా 130 ఎకరాల భూమి నిరుపేదలకు దక్కింది. తర్వాత సీసం గుంతల గ్రామంలో 30 ఎకరాల డిసి భూములను ఆ గ్రామ రైతులు సీపీఐ ఆధ్వర్యంలో దళితులకు అప్పగించారు.
డోన్‌ మండలం ఎద్దుపెంట గ్రామంలో రైతు కుటుంబంలో 1941లో జన్మించిన పెద్దయ్య గత ఏడాది (2020) డిసెంబరు 20న మరణించారు. పెద్దయ్య భార్య రామాంజినమ్మతో పాటు వారి కుమారులంతా పార్టీ నాయకులుగా ఉన్నారు. ఆయన ఎలాంటి ఆస్తులను సంపాదించుకోలేదు. పునాది స్థాయి నుండి చివరిదాకా పార్టీ నిర్మాణం కోసం పని చేసిన ఆయన పోరాట పటిమ, నిబద్ధత, అంకితభావం, నిస్వార్థ రాజకీయ జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయం. నేటి రాజకీయ పరిస్థితుల్లో పెద్దయ్య వంటి వారి పోరాటపటిమను స్ఫూర్తిగా పుణికి పుచ్చుకుని పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలి.
(ఎద్దుపెంటలో నేడు స్మారక స్థూపం ఆవిష్కరణ)
వ్యాస రచయిత సీపీఐ రాష్ట్ర
కార్యవర్గ సభ్యులు, 9440146608

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img