Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పెరిగిన వాతావరణ విపత్తులు

టి.వి. సుబ్బయ్య

రానున్న దశాబ్దాలలో విపత్తులు, నష్టాలు పెరుగుతాయని నివేదిక వెల్లడిరచింది. 1970లలో సగటున ఏడాదికి 711 వాతావరణ విపత్తులు సంభవించగా, 20002009 మధ్యకాలంలో ఏడాదికి 3,536 అంటే పది రోజులకు ఒక విపత్తు చోటు చేసుకొన్నది. 2010లో విపత్తులు కొంచెం తక్కువగా 3165 సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొత్తం 2030 లక్షల మరణాల్లో 90 శాతం జరిగాయని నివేదిక పేర్కొంది.

పర్యావరణం లేదా జీవావరణం తిరిగి బాగు చేయలేనంతగా కలు షితమైంది. ఫలితంగా ఆంత్రాక్స్‌, సార్సు, కొవిడ్‌19 లాంటి మహమ్మారులు విజృంభించి మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు, ప్రజలు కాలుష్యానికి కారణమవుతున్న వస్తువుల వినియోగాన్ని వదులుకోవడం లేదు. గత 50 ఏళ్ల కాలంలో వాతావరణ విపత్తులు బాగా పెరిగాయి. బండలు పగిలే ఎండలు, నింగినేలను ఏకం చేసేలా వర్షబీభత్సాలు సంభవిస్తున్నాయి. కాలుష్యం, ఎండల మూలంగా ప్రజల జీవనం కల్లోల భరితమైపోతోంది. 1970 నాటి నుండి తరచుగా ప్రతి ఏటా 4, 5 సార్లు ఎక్కువగా విపత్తులు సంభవిస్తు న్నాయని ఈ కాలంలో ఏడుసార్లు అత్యధికంగా నష్టాలు సంభవించాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ పరిశోధక విభాగం తాజా నివేదిక ప్రకటించింది. 1970 నుండి 1980ల వరకు ప్రకృతి విపత్తుల వల్ల సగటున రోజుకు 170 మంది మృతి చెందారు. అయితే ఈ మరణాలు 2010 తర్వాత 40 శాతం తగ్గాయని ప్రపంచ వాతావరణ సంస్థ 2021 సెప్టెంబరు 1న నివేదికను విడుదల చేసింది. 1970 నుండి ఇంత వరకు ప్రపంచ వ్యాప్తంగా 11 వేల ప్రకృతి విపత్తులు సంభవించాయి. ప్రపంచంలో ఈ సారి వేసవిలో తీవ్రమైన విపత్తులు సంభవించాయి. జర్మనీలో విధ్వంసకర, భీతిగొలిపే వర్షాలు, వరదలు ముంచెత్తాయి. అలాగే మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో, అదే సమయంలో అమెరికాలో గతంలో ఏనాడు ఎరగని స్థాయిలో ఎండలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత శక్తివంతమైన పెనుతుపాను, వర్షాలు లేని కరువుకాటక ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన దావానలాలు సంభవించాయి. అయితే ఈ విపత్తుల కాలంలో వివిధ చర్యలతో మరణాల సంఖ్యను తగ్గించగలిగారు. అమెరికాలో ఇడా తుపాను లూసియాన, మిస్సిసిపి ప్రాంతాల్లో బీభత్సం సృష్టించి అపారమైన నష్టం కలిగించింది. పెన్సిల్వేనియాతో పాటు న్యూయార్క్‌ నగరాన్ని వణికించింది. న్యూయార్క్‌ నీట మునిగింది. నివాసాలకు, జంతువులు, పశుపక్షాదులకు, ఆర్థికంగా అంచనాలకు అందని నష్టాలు జరిగాయి. దీనివల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటోంది.
రానున్న దశాబ్దాలలో విపత్తులు, నష్టాలు పెరుగుతాయని నివేదిక వెల్లడిరచింది. 1970లలో సగటున ఏడాదికి 711 వాతావరణ విపత్తులు సంభవించగా, 20002009 మధ్యకాలంలో ఏడాదికి 3,536 అంటే పది రోజులకు ఒక విపత్తు చోటు చేసుకొన్నది. 2010లో విపత్తులు కొంచెం తక్కువగా 3165 సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొత్తం 2030 లక్షల మరణాల్లో 90 శాతం జరిగాయని నివేదిక పేర్కొంది. అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తం ఆర్థిక నష్టాల్లో 60 శాతానికి పైగా ఉన్నాయి. 19702019 మధ్యకాలంలో వాతావరణ విపత్తుల వల్ల 175 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టాలు జరిగాయి. 20102019 మధ్య కాలంలో 1.38 ట్రిలియన్‌ డాలర్లకు నష్టం అపారంగా పెరిగింది.
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా అంతక్రితం సంవత్సరం కంటే 202021లో 18.52 శాతం మంచు తరిగిపోయిందని ఆ రాష్ట్ర సైన్సు, టెక్నాలజీ, వాతావరణ మండలి అధ్యయనం తెలిపింది. చైనాలో వెయ్యేళ్ల కాలంలో మొదటిసారిగా ఇటీవల అతి భారీ వర్షం అత్యంత తక్కువ సమయంలో కురిసి అనేక ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి. తాజాగా దిల్లీలో 20 ఏళ్ల కాలంలో గతంలో ఏనాడు లేని విధంగా వర్షాలు, వరదలు చాలా ప్రాంతాల్లో మునకకు గురై ప్రజలు అలవిమాలిన కష్టాలకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి కొరత ముంచుకొస్తున్నదని, 30 ఏళ్ల క్రితం లభించిన మంచి నీటిలో పావువంతు మాత్రమే లభిస్తోందని, అంతరిక్ష ఉపగ్రహాల సమాచారం ఆధారంగా అధ్యయనం చేసిన బ్రెజిల్‌ యూనివర్సిటిలు, అమెజాన్‌ వాతావరణ పరిశోధనా సంస్థలు జరిపిన అధ్యయనం వెల్లడిరచింది. అమెజాన్‌ అడవులు తరిగిపోవడం వేగవంతమైంది. 202021లో పదివేల హెక్టార్ల అడవి మాయమైందని అధ్యయనం తెలిపింది. రానున్న విపత్తుల నియంత్రణకు ప్రభుత్వాలు, ప్రజలు కలిసి తగు చర్యలు చేపట్టాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img