Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పెరూలో ఉధృతమైన నిరసనోద్యమం

కెన్‌ లివింగ్‌స్టోన్‌

తిరుగుబాటుతో అధికారానికి వచ్చిన పెరూ అధ్యక్షుడు బినా బొలుర్టికు వ్యతిరేకంగా నిరసనోద్యమం తీవ్రతరమైంది. రాజధాని లిమానగరంతో సహా దేశంలోని 11అతిపెద్ద పరిపాలనా ప్రాంతాలలో ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ఏడు ప్రాంతాలలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ అధ్యక్షుడు డిక్రీ జారీ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు రోజురోజుకు విస్తృత మవుతున్నాయి. నిరసన కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటూ దేశంలో తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని నినాదాలు చేస్తున్నారు. ఎమర్జెన్సీని విధించి మౌలిక రాజ్యాంగ హక్కులపైఆంక్షలు విధించారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలులేదు, ఎక్కడా గుమికూడరాదు, వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రత లేదు. ఒక నియంత ప్రభుత్వంలో ఎక్కడైనా ఇలాగే ఉంటుందన్నది దేశాధ్యక్షుడు నిరూపించాడు. ఎన్నికలలో గెలిచి దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్సిన అధ్యక్షుడు పెడ్రొ క్యాజిలోపై తిరుగుబాటు జరిపి ఆయనను పదవి నుంచి తప్పించారు. లాటిన్‌ అమెరికాలో అనేక దేశాలలో ఏర్పడిన వామపక్ష భావజాలం కలిగిన ప్రభుత్వాలు పెరూ ప్రజాస్వామ్య ఉద్యమానికితోడ్పాటును ప్రకటించగా అమెరికా తదితర ప్రభుత్వాలు తిరుగుబాటును సమర్థించాయి. క్యాజి లోను అరెస్టుచేసిన తరువాత పెరూలో తమ రాయబార కార్యాలయా నికి రావలసిందిగా మెక్సికో అధ్యక్షుడు అమ్‌లో ఆయనను ఆహ్వానించారు. అయితే అప్పటికే పోలీసులు వచ్చి క్యాజిలోను అరెస్టు చేశారు. ఆ తరువాత పార్లమెంటు (కాంగ్రెస్‌) ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు బొలుర్టిని దేశాధ్యక్షుడిగా ప్రకటించింది.
క్యాజిలో గతంలో స్కూలు టీచరుగా పనిచేశారు. పెరూ గ్రామీణ ప్రాంతాల్లో యూనియన్‌ నాయకుడిగా ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఉంది. 2021 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మితవాద నాయకుడు కెయికో ఫ్యుజిమొరితో ఎన్నికల్లో పోటీచేసి 45 వేల ఓట్లతో విజయం సాధించారు. పరిపాలన చేపట్టిన గత 18 నెలలుగా ఆయనను అధికారం నుంచి తప్పించాలని మితవాద శక్తులు రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాల వెనుక అనేక దేశాలలో తిరుగుబాటు శక్తులను ప్రోత్సహించే అమెరికా పెరూలోను అదే పనిచేసింది. డిసెంబరు 7వ తేదీన తిరుగుబాటు ద్వారా మిత వాద శక్తులు అవినీతి ఆరోపణలు చేసి బొలీవియాలో గతంలో జరిగి నట్టుగానే ఇక్కడ కూడ అధ్యక్షుడిని పదవి నుంచి బలవంతంగా దింపి వేశారు. పచ్చి మితవాద శక్తుల ఆగడాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిన వెంటనే ప్రజలుఉద్యమం ప్రారంభించి నలుమూలలా వ్యాపింప చేశారు. ఇప్పుడు ఉద్యమం మరింత బలోపేతమయింది. పోలీసులు, సైనికులు తీవ్ర దమనకాండకు పాల్పడుతున్నారు. వీరి దౌర్జన్య కాండలో కనీసం 70 మంది మృతిచెందారు. అనేక వేల మంది గాయపడ్డారు. పోలీసులకు, ప్రదర్శనకారులకు దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఘర్షణలు జరిగాయి. తక్షణం బొలుర్టి రాజీనామా చేయాలని జైలులో పెట్టిన క్యాజిలోను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే పార్లమెంటును రద్దుచేసి తాజాగా వీలైనంత త్వరగా అధ్యక్ష పదవికి ఎన్నికలునిర్వహించాలని డిమాండ్‌చేస్తున్నారు. అలాగే పెరూను ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించేందుకు రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. దేశంలో జాతి, వర్గం, రాజకీయవాతావరణం అత్యంత ప్రగాఢంగా అసమానతలను పెంచాయి.
తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరుపుతున్న ఆందోళనల్లో పాల్గొనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పోలీసులు, సైనికులు కలిసి హతమార్చిన ప్రదర్శనకారుల కుటుంబాలకు న్యాయంచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిరసకారులపై పోలీసులు దమనకాండ జరుపుతూ హింసిస్తున్నారని పెరూ కార్మికుల జనరల్‌ కాన్ఫిడరేషన్‌ సహాయ ప్రధాన కార్యదర్శి గుస్తావ్‌ మినయ విమర్శించారు. అలాగే పోలీసులను రెచ్చగొడుతూఉద్యమాలకు వ్యతిరేకంగా వార్తలు అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ మీడియాను ఆయన తీవ్రంగా ఖండిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img