Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రతిపక్షం సంపూర్ణ ఐక్యత కష్టమే

నిత్య చక్రవర్తి

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించు కునేందుకు ప్రతిపక్షాలన్నీ ఐక్యమై బీజేపీని లోక్‌సభ ఎన్నికల్లో ఓడిరచాలన్న లక్ష్యం నెరవేరే అవకాశాలు కనిపించడంలేదు. 2024 లోక్‌సభ ఎన్నికలు జరుగ నున్నాయి. ఎన్నికలకుముందు అన్ని ప్రతిపక్షాలు ఒక్కటయ్యే అవకాశం కనిపించడంలేదు. పైగా ఇటీవల పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతబెనర్జీ, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్‌లు భేటీఅయి చర్చించారు. వీరి సమావేశంపై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాజకీయపార్టీలను ఒకటిగా చేయడం ఎలా అన్నది చర్చకు వచ్చినప్పటికీ ఈ ఇరువురునాయకులు ప్రతిపక్షానికి కాంగ్రెస్‌కు నాయకత్వం ఇవ్వడానికి అంగీకరించలేదు. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదిపార్టీలు ప్రతిపక్షఐక్యతకు పెద్ద అడ్డంకిగా నిలిచాయని, ఐక్యత కుదరకుండా చేస్తున్నాయన్న ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాన్నివీరే కలిగిస్తున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ ఊహలే కావచ్చు. అంతేకాదు, దేశంలోఉన్న అన్ని ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యంలో చాలా అరుదుగా మాత్రమే ఒక్కటిగా నిలిచాయి. ప్రధానంగా ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో మాత్రమే ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా అత్యవసరపరిస్థితిని వ్యతి రేకించాయి. కాంగ్రెస్‌గానీ, ప్రాంతీయ పార్టీలుగానీ తమ సొంత ప్రయో జనాలను పక్కనపెట్టి, అవసరమైతే కొన్ని త్యాగాలుచేస్తేనే ఐక్యత సాధ్య మవుతుంది. అయితే ఆ పరిస్థితిలో కాంగెస్‌ ఇతర ప్రతిపక్షాలు లేవు.
కనీసం బీజేపీని ఓడిరచడంకోసం ఓడిరచాలన్న ధ్యేయంకల పార్టీలు గరిష్టంగా పొత్తులు కుదుర్చుకోవడం, సర్దుబాటు చేసుకోవడం తద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసుకోవడం తప్పనిసరి. అప్పుడే ప్రతిపక్షాలు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం కలుగుతుంది. ప్రతిపక్షం రెండు శిబిరాలుగా మారిపోయి ఎన్నికల్లో పోటీచేస్తే బీజేపీనే ప్రయోజనం పొందుతుంది. ఈ విషయాన్ని ప్రాంతీయపార్టీలు తీవ్రంగా ఆలోచించడంలేదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌యేతర ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్‌కు నాయకత్వం అప్పగించేందుకు అంగీకరించాయి. బీజేపీయేతర ప్రభుత్వం ఆనాడు ఏర్పడిరది. అప్పటి మన్‌మోహన్‌సింగ్‌ ప్రభుత్వానికి 61మంది ఎంపీలున్న వామపక్షాలు మద్దతుతెలిపాయి. అయితే ఆనాటి పరిస్థితు లను, పరిణామాలను ప్రతిపక్షాలు ఇప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. ఆనాటి ఎన్నికల్లోనూ ముందుగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కాలేదు. ఆనాడు కాంగ్రెస్‌ ప్రధానపక్షంగా ఎన్నికైంది. మిగిలిన ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అండగా నిలిచాయి. యూపీఏ ప్రభుత్వం ఏర్పడి పూర్తికాలం పరిపాలన చేసింది. ఈసారి 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రాల స్థాయిలో గట్టిగా ప్రతిపక్షాలు కృషి చేసినట్లయితే యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు దారితీసిన పరిస్థితి మళ్లీ రావచ్చు.
బీజేపీ ప్రభుత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీ, ఆప్‌లకు వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని అంగీకరించ డానికి సిద్ధంగాలేవు. ప్రతిపక్ష ఫ్రంట్‌కు నాయకత్వం వహించగలిగిన స్థాయి కాంగ్రెస్‌కు లేదన్నది ఈ పార్టీల అభిప్రాయం. అలాగే ప్రధాన మంత్రి అభ్యర్థిగా పోటీచేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ప్రతిపక్షంలోలేడన్న అభిప్రాయం బలంగాఉంది. ప్రధానవ ుంత్రి అభ్యర్థిగా రాహుల్‌గాంధీని కాంగ్రెస్‌ నాయకత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పోటీచేస్తారన్న సంకేతాలను ఇస్తున్నారు.
కాంగ్రెస్‌తో స్నేహంగాఉండి సర్దుబాట్లు చేసుకోవాలను కుంటున్న ప్రతిపక్షాలు రెండు విషయాలను కాంగ్రెస్‌కి స్పష్టం చేయాలి. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్‌గాంథీని ప్రధాని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించరాదని స్పష్టంగా చెప్పాలి. రానున్న నెలల్లో కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తనసత్తా చూపించి మంచి ఫలితాలను సాధించినట్లయితే ప్రతిపక్షాలు కాంగ్రెస్‌తో కలిసిపోటీచేసే విషయం ఆలోచించవచ్చు. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్‌కు మూడురాష్ట్రాల్లో బీజేపీని ఓడిరచి గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందుకు తగిన గట్టి కృషిని పార్టీ నాయకత్వం చేయవలసిఉంటుంది. ముందుగా రాజస్థాన్‌లో పార్టీలోఉన్న అంతర్గత కుమ్ములాటలను పరిష్కరించాలి. 2023లో ఆరు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీచేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కర్ణాటకలో జేడీఎస్‌కు సర్దుబాటు కుదిరినట్లయితే బీజేపీని తేలికగా ఓడిరచే అవకాశం ఉంది. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, అవినీతికి మారుపేరుగా నిలిచిన ప్రభుత్వం, ఫలితంగా బీజేపీపై తీవ్ర వ్యతిరేకత లాంటి అంశాలు కాంగ్రెస్‌కు సానుకూలంగాఉన్నాయని విశ్లేషకులు అంచనావేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌ వెంట 16 ప్రతిపక్షాలు నడిచే అవకాశం ఉందని, రాహుల్‌ నాయకత్వాన్ని కూడా అంగీకరించవచ్చునని భావిస్తున్నారు. బీజేపీయేతర టీఎంసీ, బీఆర్‌ ఎస్‌, ఆప్‌ పార్టీలు కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఫ్రంట్‌లోచేరే అవకాశాలు కల్పించడంలేదు. ఇప్పుడు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఒక్క తెలంగాణలో తప్పితే కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీల మధ్య పోటీఉండే అవకాశం లేదు. లోక్‌సభ ఎన్నికలలో పరిస్థితి ఇలా ఉండబోదు. ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలకు ప్రభుత్వం ఏర్పాటుచేసే సంఖ్యలో సీట్లు లభిస్తే ప్రత్యామ్నాయ కార్యక్రమం రూపొందించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. 2004లోనూ వాజ్‌పేయి ప్రధానిగా బీజేపీ ప్రభుత్వం ఓటమిపాలైంది. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వ కాలంలో ఆనాటి పరిస్థితులు కనిపించడంలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img