Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రతిపక్షాల ఐక్యతకు మెరుగవుతున్న అవకాశాలు

నిత్య చక్రవర్తి

బీజేపీపైన పోరాడేందుకు నరేంద్రమోదీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షం ఒక్క తాటిపై నిలవాలి. ఇటీవల అనేక అపజయాలను ఎదుర్కొన్న బీజేపీ ఇల్లు చక్కదిద్దుకొనే ప్రయత్నంలో ఉన్నది. 543 లోక్‌సభ నియోజక వర్గాలలో 200 సీట్లలో బీజేపీని కాంగ్రెస్‌ ముఖాముఖి ఎదుర్కోవాలి. బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ ప్రతిపక్షాలన్నింటిని కలుపుకుపోయేందుకు ప్రాధాన్యతనివ్వాలి. గోవాలో మూడు పార్టీలు విడివిడిగా బీజేపీని ఎదుర్కొంటే పరిస్థితి ఎలా ఉంటుంది? బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఆప్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోలేదు. బీజేపీ వ్యతిరేక ఓట్లను అత్యధికంగా దక్కించుకోవాలంటే టీఎంసీ ఒంటరిగా పోటీ చేయకుండా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేయాలి.

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు అవకాశాలు మెరుగయ్యాయి. 2022, 2023లలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి బీజేపీని ఎదుర్కొంటే 2024 ఏప్రిల్‌, మే నెలల్లో జరగవలసిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు మరింత సత్తా చూపగలవు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల ధోరణి అనంతరం 2021 మార్చిఏప్రిల్‌లో జరిగిన రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలదాకా కొనసాగింది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య జరిగాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఆ తర్వాత జరిగిన ఐదు నెలల్లో ఐక్యతా ధోరణి బలపడిరది. బీజేపీపై ఎన్నికల పోరాటం చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. ఒకనాడు వామపక్షాలు, కాంగ్రెస్‌ ఉన్న స్థాయి ఇప్పుడు టీఎంసీ సంతరించుకున్నది. భవానీపూర్‌ ఉప ఎన్నికలో టీఎంసీ 71.99 శాతం ఓట్లు పొందగా బీజేపీ 22.29 శాతం, సిపిఎం 3.56 శాతం పొందాయి. మరో రెండు నియోజక వర్గాలు షంషీర్‌గంజ్‌లో బీజేపీ కంటే కాంగ్రెస్‌ ఎక్కువ ఓట్లు తెచ్చుకోగా, ముషీరాబాద్‌లో టీఎంసీ చేతిలో ఓడిపోయింది.
మినీ భారత్‌
దక్షిణ కోల్‌కతా భవానీపూర్‌ నియోజకవర్గంలో బెంగాలీయేతరులు ఎక్కు వగా ఉన్నారు. వీరిలో గుజరాతీలు, బిహారీలు, యూపీ నుండి వచ్చినవారు ఇక్కడ 46 శాతం మంది ఓటర్లున్నారు. అనేక రాష్ట్రాలకు చెందిన ఓటర్లలో ఎక్కువగా గుజరాతీలున్నారు. వీరిలో అత్యధికులు టీఎంసీకి అండగా నిలిచారు. అందువల్ల జాతీయ స్థాయిలో అన్ని తరగతుల, మతాల ప్రజలు మమతా బెనర్జీని సమ్మతిస్తున్నారని భావించాలి. జాతీయ స్థాయి నాయకురాలిగా ఆమె ఎదిగే అవకాశాలున్నాయి. బెంగాల్‌లోని మరో నాలుగు నియోజక వర్గాల్లో అక్టోబరు 30న ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో జరగనున్న నాలుగు నియోజవర్గాల ఉప ఎన్నికల్లోనూ తాజాగా వచ్చిన ఫలితాలే వస్తాయని అంచనా. అనంతరం మున్సి పల్‌ ఎన్నికలున్నాయి. రాష్ట్ర మహిళలు, పెద్ద వయసు స్త్రీలు, యువతులు, మైనారిటీలు, గ్రామ, పట్టణ ప్రాంతాల పేదలలో మమతకు మంచి ఆదరణ ఉన్నది. రాష్ట్రంలో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. విజయవంతమైన నాయకురాలిగా ఎదిగారు. ప్రధాని మోదీపైన పోరాటం చేయగలిగిన సత్తా పెంపొందించుకున్నారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ అనేక రాష్ట్రాలలోని ఎన్నికల్లో విజయాలు సాధించలేకపోయారు.
మమతకు ప్రధాన మంత్రి పదవిని నిర్వహించగలిగిన స్థాయి ఉందని భావి స్తున్నారు. అయితే ఈ అంశం ఇప్పుడు ఎజెండాలో లేదు. బీజేపీపైన పోరాడేం దుకు నరేంద్రమోదీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షం ఒక్క తాటిపై నిలవాలి. ఇటీవల అనేకఅపజయాలను ఎదుర్కొన్న బీజేపీ ఇల్లు చక్కదిద్దుకొనే ప్రయత్నంలో ఉన్నది. రాహుల్‌గాంధీ వివిధ రాష్ట్రాల్లో అనేక ఆటంకాలను ఎదు ర్కొంటున్నారు. కాంగ్రెస్‌ పరిస్థితి గందరగోళంగానే ఉన్నది. ప్రస్తుతం ఈ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ క్రియాశీలంగా పనిచేయడం లేదు. అయితే రాహుల్‌ అన్ని వ్యవహారాల్లోనూ కాంగ్రెస్‌ ప్రతినిధిగా మాట్లాడు తున్నారు. రాజకీయ కుటుంబం పట్ల ప్రజలు ఆదరంగానే ఉన్నారు. కాంగ్రెస్‌ను మరింత పటిష్ఠం చేయాలంటే రాహుల్‌ని తాత్కాలిక అధ్యక్షుడిగా లేదా కార్యనిర్వా హక అధ్యక్షుడిగా ఎంపిక చేసి ఒక స్థాయిని కల్పించాలి. పార్టీకి ఎవరు నాయ కత్వం వహిస్తున్నారోతెలియడంలేదని ప్రముఖన్యాయవాది, కాంగ్రెస్‌సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ చేసిన వ్యాఖ్య సరైనదేనని అనిపిస్తోంది. 543 లోక్‌సభ నియోజక వర్గాలలో 200 సీట్లలో బీజేపీని కాంగ్రెస్‌ ముఖాముఖి ఎదుర్కోవాలి. బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ప్రతిపక్షాలన్నింటిని కలుపుకుపోయేందుకు ప్రాధాన్యతనివ్వాలి.
దేశంలో పండుగల సీజన్‌ ఇప్పటికే ప్రారంభమైనందున జాతీయ స్థాయిలో రాజకీయ కార్యకలాపాలకు అవకాశం ఉండదు. నవంబరు రెండో వారం తర్వాతనే రాజకీయ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ అసెంబ్లీలకు 2022 ఫిబ్రవరి, మార్చి లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సిద్ధపడేందుకు మూడు నెలలు మాత్రమే గడువు ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌ మినహా తక్కిన నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా పోటీచేసే అవకాశం ఉన్నది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రితో సహా అనేక మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు టీఎంసీలో చేరుతున్నారు. గోవాలో పరిస్థితి బాగా లేదు. ఆప్‌ అత్యంత క్రియాశీలంగా ఉన్నది. బీజేపీని సవాల్‌ చేసే స్థాయికి చేరింది. గోవాలో మూడు పార్టీలు విడివిడిగా బీజేపీని ఎదుర్కొంటే పరిస్థితి ఎలా ఉంటుంది? బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఆప్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోలేదు. బీజేపీ వ్యతిరేక ఓట్లను అత్యధికంగా దక్కించుకోవాలంటే టీఎంసీ ఒంటరిగా పోటీ చేయకుండా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేయాలి.
రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఓట్లను గరిష్టంగా సమీకరించి ఎన్నికల్లో బీజేపీని ఓడిరచాలంటే ప్రతిపక్షాల ఐక్యతకు మమత గట్టిగా కృషి చేయవలసి ఉంటుంది. త్రిపుర, అసోం, మేఘాలయ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ నాయకుల కోసం టీఎంసీ వేటాడుతోంది. కాంగ్రెస్‌ను వీడి సీనియర్‌ నాయకులు కూడా టీఎంసీలో చేరుతున్నారంటే కారణాన్ని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తెలుసుకొని సరిదిద్దుకోవాలి. ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి చేసే కృషిలో టీఎంసీ, కాంగ్రెస్‌ మధ్య ఘర్షణ ఉండవచ్చు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్‌ను అభిమానించే ప్రజలను సమీకరించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించగలిగితేనే రాహుల్‌ సమర్థమైన నాయకుడుగా ఎదుగుతారు. బీజేపీపై గెలవాలంటే కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తేనే సాధ్యమవుతుంది. 2024 ఎన్నికలను మమత, రాహుల్‌ కలిసి వ్యూహాలను రూపొందించుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img