Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రభుత్వ భవనంలో శివలింగమా!

ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో శివలింగం ఏర్పాటు రాజ్యాంగ విరుద్దం. మనది లౌకిక రాజ్యం. అనగా ప్రభుత్వం మతపరమైన వాటిని ప్రోత్సహించరాదు. భిన్నమతాలు, సంస్కృతులు, ఆచారాలు కలిగిన దేశం మనది. దేవుడు, మతమూ వ్యక్తిగతంగానే ఉంచుకోవాలి. ప్రభుత్వపరంగా, అధికారికంగా, మతపరంగా జరిగే కార్యక్రమాలకు ప్రజాధనాన్ని ప్రభుత్వం ఉపయోగించరాదు. అది రాజ్యాంగ వ్యతిరేకం. ప్రజాపాలనకోసం ఉపయోగించాల్సిన ఒంగోలు కలెక్టరేట్‌ పరిధిలోని ప్రభుత్వ భవనంలో మతపరమైన విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు? కలెక్టరు కార్యాలయంలో జరిగే ప్రతి విషయము కలెక్టరుకు తెలియకుండా జరగదు. మరి శివలింగ నిర్మాణం ప్రభుత్వ కార్యలయ ఆవరణలో ఎలా జరిగిందో తెలియచెయ్యాల్సిన భాద్యత కలెక్టరుకి ఉంది. నిర్మాణంకోసం ఎంత ఖర్చు అయింది, అందుకు ప్రభుత్వ అనుమతి ఉందా, మరి ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మాణం జరిగిందా? అలా జరగొచ్చా! అనేది ప్రజలకున్న సందేహాలు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ గోడలకు దేవుని బొమ్మలు, బీరువాలకి మతపరమైన బొమ్మలని పెట్టి, వారం వారం పూజలుకూడా చేస్తుంటారు. అలాగెే కొత్త అధికారి వచ్చినపుడల్లా వాస్తు పేరుతో మరమ్మతులు, ఇవన్నీకూడా లౌకికరాజ్యంలో చెయ్యకూడదు. మనం రాజ్యాంగంలో సెక్యులరిజం అని వ్రాసుకున్నాం. పాలనలో ఎక్కడా మతజోక్యం ఉండరాదు. కానీ మన నాయకులకు రాజ్యాంగపై ఎటువంటి గౌరవం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలలో భజనలు, శాంతి పూజలు చెయ్యటమనేది రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినట్టే. కనుక వెంటనేె శివలింగాన్ని ప్రకాశం భవనం నుండి తొలగించి, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొవాలని, ఈ మొత్తం తంతు ప్రజలకు తెలియచెయ్యాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఫటనలు జరక్కుండా, అధికారులకు అదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
నార్నె వెంకటసుబ్బయ్య

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img