Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రైవేటీకరణ దిశగా ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలు

ఇటీవలి 38వ స్టాండిరగ్‌ కమిటీ రిపోర్ట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ (2022-2023) ప్రకారం ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ అసలు లక్ష్యం వాటిని ప్రైవేటీకరించడమే అని స్పష్టమైంది. ఆ లక్ష్యం దిశగా తొలి అడుగుగా ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలకు ఆర్డర్లు కరువయ్యాయి. ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించేందుకే టెండర్లలో పాల్గొనేందుకు అనుమతించడం లేదు. కొన్ని సంవత్సరాలలో ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ కార్పొరేషన్లలో చాలా వరకు అనారోగ్య సంస్థలుగా మారతాయి. ఈ కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం ఉపయోగించుకుని వాటిని తక్కువ ధరలకు విక్రయిస్తుంది. పూర్వపు ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు కొత్తగా సృష్టించిన డిఫెన్స్‌ అండర్‌ టేకింగ్‌ యూనిట్‌లుగా పునర్నిర్మించడం అనేది ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలను ఉత్పాదక, లాభదాయక ఆస్తులుగా మార్చడం, పోటీతత్వాన్ని పెంపొందించడంతోపాటు సామర్థ్యాన్ని మెరుగు పరచడం లక్ష్యంగా పెట్టుకుంది. మరింత క్రియాత్మక, ఆర్థిక స్వయంప్రతిపత్తితో, ఈ కొత్త డిఫెన్స్‌ పబ్లిక్‌సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌ యూనిట్స్‌ దేశంలో, విదేశాలలో నూతన మార్కెట్లను అన్వేషిస్తాయి. ఇది కేవలం కార్పొరేటీకరణకు మద్దతు కోరడానికి మాత్రమే ఉద్దేశించింది. కార్పొరేటీకరణ జరిగిన ఏడు కార్పొరేషన్‌ లను కలిపి 2023-24 సంవత్సరానికి 16,694.58 కోట్ల ఆర్దర్లు మాత్రమే వచ్చాయి. మ్యూనిటేషన్‌ ఇండియా లిమిటెడ్‌, ఆర్మర్డ్‌ వెహికల్స్‌ నిగంలిమిటెడ్‌ కార్పొరేషన్‌లకు మాత్రమే ఆర్డర్లు సౌకర్యంగా ఉంది. అయితే 8 ఫ్యాక్టరీలతో ఆర్మర్డ్‌ వెహికల్స్‌ నిగం లిమిటెడ్‌ కేవలం రూ.1915 కోట్లు. 4 ఫ్యాక్టరీలు ఉన్న ట్రూఫ్‌ కంఫర్ట్‌ లిమిటెడ్‌ కేవలం రూ.88.89 కోట్లు, 8 ఫ్యాక్టరీలతో యంత్ర ఇండియా లిమిటెడ్‌ రూ.700 కోట్ల ఆర్డర్‌లను కలిగి ఉన్నందున ట్రూఫ్‌ కంఫర్ట్‌ లిమిటెడ్‌, యంత్ర ఇండియా లిమిటెడ్‌ అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలకు నేరుగా ఇండెంట్‌లు ఇవ్వడం ఆపి, ఓపెన్‌ టెండర్‌ ద్వారా ప్రైవేట్‌కు వెళ్లడంతో మొత్తం 7 కార్పొరేషన్ల భవితవ్యం తలకిందులైంది. ఇటీవల ఆర్మీ కొత్తగా రూపొందించిన 12 లక్షల ఆర్మీ యూనిఫామ్‌ల సేకరణకుగాను బహిరంగ టెండర్‌ను ప్రారంభించింది. ఆంక్షలు విధించడం ద్వారా ట్రూఫ్‌ కంఫర్ట్‌ లిమిటెడ్‌ కింద ఉన్న 4 ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలు టెండర్‌లో పాల్గొనడానికి కూడా అనుమతించలేదు. గ్లైడర్స్‌ ఇండియా లిమిటెడ్‌ కార్పొరేషన్‌ కింద ఉన్న పారాచూట్‌ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీని విస్మరించి, ప్రైవేట్‌ ఉత్పత్తిదారుల నుండి 350 కంబాట్‌ ఫ్రీ ఫాల్‌ పారాచూట్‌ సిస్టమ్‌ కొనుగోలు చేయాలని సైన్యం నిర్ణయించింది. కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నదని గ్రహించిన ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ ఉద్యోగులు, వారి సంఘాలు కార్పొరేటీకరణను ప్రతిపాదించిన రోజు నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇటీవల, ఆల్‌ ఇండియా డిఫెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, భారతీయ ప్రతిరక్షా మజ్దూర్‌ సంఫ్‌ు, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ రికగ్నైజ్డ్‌ అసోసియేషన్స్‌ డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు వివరణాత్మక నోట్‌ను సమర్పించాయి. ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసు కోవాలని, ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు పరిధిలోని డిపార్ట్‌మెంటల్‌ సంస్థలుగా ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల హోదాను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. ఉద్యోగ సంఘాలు ఇచ్చిన విలువైన సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నారు. 30,000 కోట్ల విలువైన రక్షణరంగ సంస్థల ప్రైవేటీకరణ బడా గుత్తాధిపత్యాల నేతృత్వంలోని పాలక పెట్టుబడిదారీవర్గ కుట్రలో భాగం.
ప్రభుత్వాలు కార్పొరేట్‌ శక్తుల చేతిలో కీలుబొమ్మలుగా వారి ఎజెండాను అమలు పరుస్తున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేవారు కార్పొరేట్‌శక్తులే కావడంతో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత వారిఎజెండాను అమలు పరుస్తున్నారు. ప్రతి ప్రభుత్వ రంగసంస్థలు ప్రెవేటీకరణ కాకుండా పరిరక్షించే బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే. దేశ భద్రతకు సంబంధించిన రక్షణరంగంలో ప్రైవేట్‌వ్యక్తుల ప్రమేయం ఉండరాదు.
ఆళవందార్‌ వేణుమాధవ్‌, 8686051752

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img