Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

బడ్జెట్‌లో నిరుద్యోగులకు చోటేది?

సుబోధ్‌ వర్మ

యువతదే భవిష్యత్‌. వారు ఆధునిక భారత నిర్మాణంలో ప్రధానపాత్ర అని రోజూ ఊదరగొట్టే బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో చోటు లేకుండా చేసింది. రోజురోజుకీ పెరుగుతున్న నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించకపోగా ప్రజల జీవనం, జీవన భృతిపైన 202324 బడ్జెట్‌ తీవ్రమైన దెబ్బ కొట్టింది. ప్రజలకు నేరుగా ఆర్థిక ప్రయోజనాలు దక్కే పథకాలు, స్కీములకు కేటాయింపులను గణనీయంగా తగ్గించారు. ప్రజలు కీలకమైన సమస్యలను పట్టించుకోలేదు. ముఖ్యంగా నిరుద్యోగం, అందునా యువతను నిర్లక్ష్యం చేస్తున్నారు. గత 41 నెలల్లో నిరుద్యోగం 7శాతానికి అటూఇటూగా ఉంటోందని పీఎంఐఇ సర్వే తెలియజేసింది. పట్టణ నిరుద్యోగం 810శాతం ఉందని, ఇది కొనసాగు తూనే ఉందని సర్వే తెలియజేసింది. ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిరది. గత మూడు సంవత్సరాలుగా ఒకే విధంగా ఉంది. 2020లో 41.1శాతం ఉండగా, అది అలా కొనసాగుతోంది. కరోనా మహమ్మారికి ముందున్న 40.9శాతం నిరుద్యోగం 2023లోనూ నమోదైంది. అయితే కార్మికులకు, ప్రత్యేకించి పనులు చేసేవారు లేదా పనులకోసం వెదికేవారి సంఖ్య 42.9శాతం నుండి 38శాతానికి గత మూడేళ్లలో తగ్గింది. ఒకవైపు జనాభా పెరుగుతున్నది, అదే సమయంలో ఉద్యోగాల సృష్టి పెరగడంలేదు. కార్మికులు సైతం విసుగుచెంది శ్రామికులు మార్కెట్‌లోకి రావడం తగ్గింది. దీని అర్థం జీవన ప్రమాణాలు పడిపోయాయి.
పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ప్రధాని మోదీ మాత్రం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న నినాదాన్ని వల్లెవేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో గల ఉద్యోగాల ఖాళీలు పది లక్షలున్నాయని త్వరలో పూరిస్తామని వాగ్దానాలు గుప్పిస్తూనే ఉన్నారు. నిరుద్యోగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన విధానాన్ని కేంద్రం రూపొందిస్తుందన్న ఆశతో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న ముఖ్యమైన పథకాలకు నిధులను తగ్గించివేశారు. వీటిలో ప్రధానమైంది మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాథి పథకం. దీనికి 33శాతం నిధులను కోసివేశారు. 202223లో సవరించిన అంచనాల ప్రకారం, 9,400 కోట్లు కేటాయించగా, 202324లో 60వేల కోట్లు మాత్రం ఇస్తారు. జాతీయ జీవన భృతి మిషన్‌కు తగ్గించారు. నేరుగా ఉపాధికల్పన పథకాలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, ఇతర సంక్షేమ పథకాలకూ తగ్గించారు. ఐసిడిఎస్‌కు నిధులు ఏమాత్రం పెంచలేదు. ఉద్యోగాల సృష్టికి బడ్జెట్‌లో నిధులు కల్పిస్తామని ప్రభుత్వం, దాని వందిమాగధులు విపరీతమైన భ్రమలను కల్పిస్తూ ప్రచారం సాగించారు. అలాగే ప్రభుత్వం మూలధనం ఖర్చును పెంచుతుందని,దాని వల్ల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని కూడా చెప్పారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుపైన ఖర్చుచేస్తే వచ్చే ఉద్యోగాలకంటే విద్య, ఆరోగ్యరంగాల మీద ఖర్చుచేస్తే ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయి. అయినప్పటికీ వీటికి ప్రాధాన్యత నివ్వడంలేదు. విశ్వవిద్యాలయాల్లో సైతం ఖాళీలు నింపకుండా సంవత్సరాల తరబడికాలం గడుపుతున్న పరిస్థితి నెలకొని ఉంది. అన్ని అర్హతలుండి ఉద్యోగాలకోసం దరఖాస్తుచేసినా వాటిని పెండిరగ్‌లోపెట్టి మౌనంగా ఉంటున్న సందర్భాలు అనేకం. విదేశీయాత్ర పరికరాలను దిగుమతి చేసుకొనేందుకు అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నారు. దీనివలన స్థానిక ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అదే సమయంలో స్థానికులకు ఉద్యోగాలు లభించవు.
మరో భ్రమను కూడా ప్రచారంలో పెట్టారు. బ్యాంకులు రుణాలివ్వడం పెరిగితే ఉత్పత్తి శక్తి పెరుగుతుందని, ఫలితంగా ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. గత అనేక సంవత్సరాలుగా మనం పొందిన అనుభవాన్నిచూస్తే ఇది భ్రమో అర్థమవుతుంది. కార్పొరేట్‌ రంగానికి ప్రోత్సాహకాల పన్ను రాయితీలు, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చినప్పటకీ ఉద్యోగాలు మాత్రం పెరగడంలేదు. ఈ మార్గంవల్ల ఎలాంటి ప్రయోజనంలేదని తేలింది. లిస్టెడ్‌ కంపెనీలు కరోనా మహమ్మారి కాలంలోనూ అపార లాభాలను పొందాయి గానీ ఉద్యోగాలు రాలేదు. పనులు, ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాదిమంది కొనుగోలుశక్తి సన్నగిల్లి వస్తువుల డిమాండ్‌ పడిపోయింది. ఇలాంటి పారిశ్రామిక వేత్తలకిచ్చే రాయితీలు, సబ్సిడీల మూలంగా వారి లాభాలు పెరుగుతాయి.
ఇక సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలకు తగిలిన దెబ్బలతో అవి కుదేలయ్యాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ పన్నుల వ్యవస్థ, అనంతరం కరోనా మహమ్మారి ఇవన్నీ కలిసి ఈ పరిశ్రమలు మళ్లీ కోలుకోకుండా చేశాయి. దేశంలో 6.33 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలుండగా, 6.30 కోట్లు(99శాతం) సూక్ష్మ పరిశ్రమలు, 3.31 లక్షల చిన్న, 5వేలు మధ్య తరహా పరిశ్రమలున్నాయి. ఈ విషయాలు ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. సూక్ష్మ పరిశ్రమల్లో దాదాపు 11కోట్ల మంది కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలు 32 లక్షలు, మధ్యతరహా పరిశ్రమల్లో కేవలం 2లక్షల మందే ఉన్నారు. సూక్ష్మ పరిశ్రమలతో ఈ పరిశ్రమలన్నిటికీ సహాయంచేస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. 2022 ఆర్థిక సంవత్సరం చివరి మూడునెలల్లో, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.2.57 లక్షల కోట్లు రుణాలిస్తే, సూక్ష్మ పరిశ్రమలకు 68.9 వేల కోట్లు మాత్రమే రుణాలిచ్చారు. మోదీ ప్రభుత్వం గుడ్డిగా నయా ఉదార విధానాలు అనుసరిస్తూ బడావ్యాపారులు, పరిశ్రమలు, ఇతర దేశాల సంస్థలకు సహాయ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడంలేదు. అధిక ఉద్యోగాలు లభించడంలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img