Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బహుళ జాతి సంస్థల భూ దురాక్రమణ!

బొల్లిముంత సాంబశివరావు

అనేక ఆఫ్రికా దేశాల్లో వచ్చిపడే విదేశీ పెట్టుబడుల ప్రవాహం గురించి ప్రచారం చేశారే తప్ప దాని ప్రమాదం ఆ దేశాల పాలకులకు పట్టలేదు. ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు అనుమతించరాని పెట్టుబడిదారుల ప్రతిప్రాదనలకు ఎటువంటి సమీక్ష లేకుండా ఆమోదం తెలిపాయి. కాంబోడియా, సూడాన్‌, కాంగో, ఘనా మొదలైన దేశాలు
భూ కేటాయింపుల్లో సరిహద్దులను కూడా విస్మరించాయి. పాలకుల విధానాల ఫలితంగా ఆఫ్రికా దేశాల్లోని అత్యధిక భూములు బడా పెట్టుబడిదారుల ఆధీనంలోకి వెళ్లాయి. భూములు కోల్పోయి, ఉపాధి కరువై తీవ్ర సంక్షోభంలో ఉన్న అనేక దేశాల్లోని పేదలు, రైతులు పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. విదేశీ పెట్టుబడిదారుల ఆధీనంలో ఉన్న తమ భూములు తిరిగి ఇవ్వాలని,
ఉపాధి అవకాశాలు కల్పించాలని, బహుళ జాతి సంస్థలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాలను వారు డిమాండ్‌ చేస్తున్నారు.


బహుళ జాతి సంస్థల కన్ను నేడు పేద దేశాల వ్యవసాయ భూములపై పడిరది. కొన్ని అరబ్‌ దేశాలు కూడా ముందుముందు ఏర్పడనున్న ఆహార సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దఎత్తున భూ కొనుగోళ్లు చేస్తున్నాయి. ఎక్కువగా ఆఫ్రికా దేశాల రైతుల భూములు పరాయికరణ చెందుతున్నాయి. ఈ దేశాల్లో భూ హక్కులు కలిగిన రైతులు చాలా తక్కువగా (2 నుండి 10 శాతం) ఉండటం, భూమి హక్కుకు ఆచార వ్యవస్థలు సరిపోతాయని భావించటం, జాతీయ విధానం విధిగా ప్రభుత్వ యాజమాన్యం కలిగి ఉండటం అందుకు కారణంగా ఉంది. సామ్రాజ్యవాదానికి, బహుళ జాతి సంస్థలకు లొంగిన ప్రభు త్వాలు తమ స్వాధీనంలో ఉన్న భూములను అమ్మటం లేదా లీజుకు ఇవ్వటం ద్వారా భూములు బహుళ జాతి సంస్థల పరమౌతున్నాయి. వెనకబడిన వ్యవ సాయాన్ని అభివృద్ధి చేస్తామని, ఆసుపత్రులు, స్కూల్స్‌, రోడ్లు ఏర్పాటు చేస్తామని, పంట ద్వారా లభించే ఆదాయంలో వాటా ఇస్తామని రైతాంగానికి భ్రమలు కల్పించి బహుళజాతి సంస్థలు మోసంచేస్తూ వారి భూములు లాక్కొంటున్నాయి.భవిష్యత్తులో ఆహారం, ఇంధన కొరత సమస్యను దృష్టిలో పెట్టుకుని వాటి వ్యాపారం కోసం పెద్దఎత్తున భూ సేకరణకు పూనుకున్నాయి. 2007-08 ప్రపంచ ఆహార ధరల సంక్షోభం తర్వాత భారీ ఎత్తున భూ సేకరణను బహుళ జాతి సంస్థలు చేపట్టాయి. భూ సేకరణ అంటే ఇక్కడ దేశవిదేశీ సంస్థలు, ప్రభుత్వాలు, వ్యక్తులు పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేయటం లేదా లీజుకి తీసుకోవటం. ఈ పద్దతుల్లోనే లక్షల ఎకరాల భూములను బహుళ జాతి సంస్థలు కాజేశాయి. ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IఖీూRI) 2009 అంచనా ప్రకారం వెనకబడిన దేశాల్లో 15 నుండి 20 మిలియన్ల హెక్టార్ల వ్యవసాయ భూమి 2006 నుండి చేతులు మారింది. 2013 జనవరి నాటికి ల్యాండ్‌ పోర్టల్‌ సంస్థ ల్యాండ్‌ మ్యాట్రిక్‌ డేటా ప్రకారం 49 మిలియన్‌ హెక్టార్ల భూములకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. 2011 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 56 మిలియన్‌ హెక్టార్ల కోసం విక్రయ ఒప్పందాలు జరిగాయి. సూడాన్‌లోని అమెరికా కంపెనీలు ఆర్క్‌ క్యాప్‌, నైల్‌ ట్రేడిరగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇంక్‌ మధ్య ఒక మిలియన్‌ హెక్టార్ల భూమిని తీసుకున్నాయి. చైనా కొలంబియా మధ్య నాలుగు లక్షల హెక్టార్ల ఒప్పందం జరిగింది. టాంజా నియాలో 3,25,000 హెక్టార్లకు బహుళ జాతి సంస్థలు పెట్టుబడులు ఉన్నాయి. యుఎఇ… పాకిస్థాన్‌లో 3,24,000 హెక్టార్ల భూమి కొనుగోలు చేసింది.
ప్రభుత్వ ఆధీనంలోని భూములను విదేశీ ప్రభుత్వాలకు, బహుళ జాతి సంస్థలకు ఇస్తున్న లీజు చెల్లింపు వైనం ఎంతో హాస్యాస్పదంగా ఉంది. సౌదీ అరే బియా యువరాజు బందర్‌ బిన్‌ సుల్తాన్‌ 1,05,000 హెక్టార్లకు సంవత్సరానికి లీజు రూపంలో చెల్లించేది 1,25,000 అమెరికా డాలర్లు. ఇది హెక్టారుకు ఒక డాలర్‌కి కొంచెం ఎక్కువ. పెరూలోని దక్షిణ కొరియా పెట్టుబడిదారులు హెక్టా రుకు 0.80 డాలర్‌ మాత్రమే లీజు చెల్లిస్తున్నారు. ఇథియోపియాలో భారతీయ బడా పెట్టుబడిదారులు కొనే హెక్టారు ధర 3,11,000 కాగా, సంవత్సర లీజు 1.20 నుండి 8 డాలర్లు. టాంజానియాలో 3 లక్షల హెక్టార్లలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం 1000 హెక్టార్లలో పని చేస్తున్నాయి. గాబన్‌లో ఓలమ్‌ ఇంట ర్నేషనల్‌ పెట్టుబడి 3 లక్షల హెక్టార్లలో ఉంటే ప్రస్తుతం 59 వేల హెక్టార్లలో పని జరుగుతున్నది. నైజీరియాలో మూడు సంస్థల పెట్టుబడులు 6 లక్షల ఎకరాలు. ఈక్వటోరియల్‌ పామ్‌ ఆయిల్‌ ఒప్పందం 1,69,000 వేల హెక్టార్లు. 2020 నాటికి 50 వేల హెక్టార్లలో పని మొదలు పెట్టాలని ప్రణాళికలు వేసింది.
యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు, ఇతర అనేక దేశాల్లో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డాయి. ఇయు ల్యాండ్‌ మ్యాట్రిక్స్‌ డేటా 2016 ప్రకారం ఈ దేశాల భూ ఆక్రమణలు ఇతర దేశాల్లో ఈ విధంగా ఉన్నాయి (భూములు హెక్టార్లలో) యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 19,72,000, ఫ్రాన్స్‌ 6,29,953, ఇటలీ 6,15,674, ఫిన్లాండ్‌ 5,66,558, పోర్చుగల్‌ 5,03,953, నెదర్లాండ్స్‌ 4,14,974, జర్మనీ 3,09,566, బెల్జియం 2,51,808, లక్సెంబర్గ్‌ 1,57,914, స్పెయిన్‌ 1,36,504, రొమేనియా 1,30,000, స్వీడన్‌ 77,329, డెన్మార్క్‌ 31,460, ఆస్ట్రియా 21,000, ఎస్టోనియా 18,800 హెక్టార్ల భూములు ఆక్ర మణ చేశాయి. తమ ఆధీనమైన భూముల్లో చెరకు, పామాయిల్‌, జీవ ఇంధ నాలు, తమకు అవసరమైన ఆహార పంటలు ఉత్పత్తులకు బహుళ జాతి సంస్థల, విదేశీ బడా పెట్టుబడిదారుల ప్రాధాన్యతగా ఇవ్వటం వలన ఆఫ్రికా దేశాల్లోని సాంప్రదాయ పంటలకు ప్రజలు దూరమయ్యారు. దీనితో పాటు సంస్కృతి మూలాలు ప్రమాదంలో పడుతున్నాయి.
వివిధ దేశాల ప్రజా వ్యతిరేక పాలకులు విదేశీ సంస్థలకు భూములు ఏ విధంగా కట్టపెడుతున్నదీ లీజు కాలం, అందుకు చెల్లించే మొత్తం తెలియ చేస్తున్నది. అలా భూములు కట్టబెట్టినందుకు ఆ దేశాల పాలకులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయి. పాలకుల విధానాల వలన, బహుళ జాతి సంస్థల మోసపు మాటలు నమ్మిన స్థానిక రైతులు భూములు కోల్పోయి జీవనో పాధి సమస్యను ఎదుర్కొంటున్నారు. భూములకు ఇచ్చే పరిహారం మార్గదర్శకాల వల్ల రైతాంగం తీవ్ర అన్యాయానికి గురైయ్యారు. ఇథియోపియా, ఘనా దేశాల్లో రైతులకు ఇచ్చిన పరిహారం వారి జీవనోపాధి పునరుద్దరణకు ఏ మాత్రం సరిపడలేదని అధ్యయనాలు నిర్ధారించాయి. రసాయనిక ఎరువుల వలన భూసారం తగ్గి భూములు నిస్సారమౌతున్నాయి.
భూములను వదులుకున్న రైతులు, వారి భూముల్లోనే కూలీలుగా మారారు. ఫలితంగా వారి కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. భూములు ఉన్న పెట్టుబడిదారులు స్థానిక ప్రజలను వ్యవసాయ ప్లాంట్లలో పెద్ద సంఖ్యలో కూలీ లుగా నియమించుకున్నారు. ఉద్యోగ కల్పనకు ఇచ్చిన హామీలో అతి తక్కువ ఉపాధి కల్పన మాత్రమే జరిగింది. కూలి కూడా అతి తక్కువగా ఉంది. ఇథి యోపియాలోని కరుటూరి గ్లోబల్‌ పెట్టుబడిలో కూలీల రోజు కూలి రెండు డాలర్లు. ఈ కూలీతో వారి కుటుంబ అవసరాలు తీరక దుర్భర పరిస్థితుల్లో కూరుకుపోయారు.
అనేక ఆఫ్రికా దేశాల్లో వచ్చిపడే విదేశీ పెట్టుబడుల ప్రవాహం గురించి ప్రచారం చేశారే తప్ప దాని ప్రమాదం ఆ దేశాల పాలకులకు పట్టలేదు. ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు అనుమతించరాని పెట్టుబడిదారుల ప్రతిప్రాదనలకు ఎటువంటి సమీక్ష లేకుండా ఆమోదం తెలిపాయి. కాంబోడియా, సూడాన్‌, కాంగో, ఘనా మొదలైన దేశాలు భూ కేటాయింపుల్లో సరిహద్దులను కూడా విస్మరించాయి. పాలకుల విధానాల ఫలితంగా ఆఫ్రికా దేశాల్లోని అత్యధిక భూములు బడా పెట్టుబడిదారుల ఆధీనంలోకి వెళ్లాయి. భూములు కోల్పోయి, ఉపాధి కరువై తీవ్ర సంక్షోభంలో ఉన్న అనేక దేశాల్లోని పేదలు, రైతులు పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. విదేశీ పెట్టుబడిదారుల ఆధీనంలో ఉన్న తమ భూములు తిరిగి ఇవ్వాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, బహుళ జాతి సంస్థలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాలను వారు డిమాండ్‌ చేస్తున్నారు.
వ్యాస రచయిత సెల్‌
9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img