Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బీజేపీకి గర్వ భంగమే

రా బావ ఏంటి హుషారుగ నవ్వుతూ వస్తున్నావు. ఈ రోజు కొత్త వార్త ఏం మోసుకొచ్చావు. వార్త కాదు బావ కడుపుమంట. మోదీ, షాలు ఇద్దరూ వారి కుయుక్తులకు తిరుగుండదని విర్రవీగేవారికి కర్నాటక ప్రజలు చెక్‌పెట్టారు. మీ ఎత్తుగడలు మాదగ్గర పనిచేయవని నిరూపించారు. నిజమే బావ ఈ ఎన్నికల ద్వారా బీజేపీకి గర్వభంగం కాగా కాంగ్రెసుకు ఊపిరిపోశారు. పూర్తి మెజారిటీ ఇచ్చి కుమారస్వామికి అవకాశం లేకుండా చేశారు. అది సరే మరల రెండు వేల నోటు ప్రహసనం ఏంటి. ఏముంది అధికారంలో ఉన్నపార్టీకి ఎదురుదెబ్బ తగలగానే ఇటువంటివి తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చి తమ పార్టీ వాళ్లకు స్వాంతన చేకూర్చే వాటిలో ఇదొకటి. సరే ఎట్టకేలకు తిరిగి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసి శివకుమార్‌ను ఓదార్చి హమ్మయ్య అని గాలి పీల్చుకుంది అధిస్టానం. రాహుల్‌ చెల్లి ప్రియాంకను ఎన్నికలు ప్రచారంలో చూచిన బడుగువర్గాల ప్రజలకు మరొకసారి ఇందిగాగాంధీ గుర్తుకురావడం కూడా విశేషమే. అంతేకాకుండా త్వరలో ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణా కాంగ్రెసుకు ఆశలు రేకెత్తించాయి. అది సరే బావ ఏ పార్టీ అధికారంలోఉన్నా మంత్రుల్ని ఎంపికచేసి పద్ధతి నాకు నచ్చలేదు. అది ఒక ముఖ్యమంత్రికే అప్పచెప్పడం అప్రజాస్వామ్యమే.
అదేంటి అలా అంటావు మనకు స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుండి సాగుతున్న సాంప్రదాయమేకదా కావచ్చు ప్రజలెన్నుకున్న శాసనసభ్యులకు ఏ అధికారం లేకుండా ఒక్క ముఖ్యమంత్రే తన అనుయాయునికి మంత్రి పదవులు కట్టపెట్టడం సబబుకాదు. ప్రజలెన్నుకున్న శాసనసభ్యులకు మంత్రులను ఎన్నుకునే హక్కు ఉంటేనే అసలైన ప్రజాస్వామ్యం. మంత్రులను చేయదలచినపేర్లు ముఖ్యమంత్రి బైటపెడితే రాజ్యసభకు, శాసనమండలికి ఎన్నుకున్న విధంగా ప్రతి ఎం.ఎల్‌.ఏ ఎన్నుకుంటే అప్పుడు ఆయా మంత్రుల్ని ప్రజలెన్నుకున్నట్లు అవుతుంది. ఇప్పుడున్న పద్ధతిలో ప్రజలెన్నుకున్న ప్రతిపక్ష శాసనసభ్యులకు సంబంధంలేకుండా మంత్రులవుతున్నవారు ప్రజలకు మంత్రులెలా అవుతారు. నే చెప్పిన పద్ధతిలోనైౖనా అధికారపార్టీ వారు మంత్రులవుతారు. కాని అప్పుడు ప్రజలెన్నుకున్న ప్రతి ఎంఎల్‌ఏని ఎన్నుకున్నట్లు అవుతుంది. అప్పుడు ప్రతి మంత్రిని ప్రజలెన్నుకున్నట్లుగా భావించితే అది అసలు ప్రజాస్వామ్య పద్ధతి అవుతుంది. కాని ఈ విషయంపై ఎవరూ శ్రద్ధ వహించడంలేదు. దేశ అధ్యక్షున్ని ఎన్నుకున్న పద్ధతిలోనే మంత్రుల ఎన్నిక జరిగితే అసలైన ప్రజాస్వామ్యంకాగలదు. భలేవాడివయ్యా అది అంత పెద్ద విషయం కాదుగాని ముఖ్యమంత్రి మంత్రులు, శాసనసభ్యులకు తెలియకుండా ఒక్కడే అన్ని నిర్ణయాలు తీసుకుని అవి ప్రజల నెత్తిన రుద్ది గతంలో రాజులవలె పరిపాలించడం సబబుకాదు. భలే వాడివి బావ గతంలో రాజులకున్నట్లు సలహాదారులు ఉన్నారుగ. వారి సలహాలు ఎంతవరకు ఇస్తారో తెలియదుగాని ముఖ్యమంత్రిని అనుసరించి ఉన్నవారికి నిరుద్యోగ సమస్య తీరినట్లవుతుంది. అలా కాదు మఖ్యమంత్రి ఎంత తెలివిగల వాడైనా తన ఆలోచనలు కరక్టేకాదా అని సలహా అడగడానికి ఉపయోగపడతారుగ. ఏమో నాకు మాత్రం మోదీ, షాలు మాత్రం ఇతరులను అడగకుండ నియంతృత్వపాలన సాగిస్తున్నారని పిస్తోంది. ఇప్పుడు ప్రధాని నుండి అందరు మంత్రులకు సలహాలు ఇవ్వడానికి ఐఏఎయస్‌లు ఉన్నారుగ. అటువంటప్పుడు రాజకీయ సలహాదారులు అవసరమా. అధికారులు ఎంతోకష్టపడి ఐఏయస్‌లు అయినా వారి స్వప్రయోజనాలతో మంచిచోట పోస్టింగ్‌లు కోసమే ప్రధానికి, ముఖ్యమంత్రులకు తలవంచుతున్నారుగ. అదీకాక కక్షతో తప్పుదారి పట్టించే అధికారులు కూడా ఉంటారు.
అది నిజమే ఎన్నికల ఫలితాలు రాకముందే రెండుపార్టీల నుంచి ముఖ్యమంత్రి కాగలవారిని వెళ్లి దర్శనం చేసుకోవడం చూస్తున్నాం కద. వారు నిజాయితీగా, న్యాయంగా పనిచేయాలంటే వారిపై రాజకీయ ఒత్తిడి ఉండకూడదు. మంత్రులు, శాసనభ్యులు అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే తీర్మానాలుచేసి జీ.ఓలు తేవడం వరకే పరిమితం కావాలి. ఆ జీ.ఓలు అమలుపరచడం అధికారులకు వదిలివేయాలి. అది ప్రజాస్వామ్య వ్యవస్థ. కాని దానికి స్వస్తిపలికి ప్రజాస్వామ్యం బదులు నాయక స్వామ్యం వచ్చి మంత్రులు, శాసనసభ్యుల చుట్టూ తిరిగి వారు చెప్పినవిధంగా అధికారులు చేస్తున్నారు. మూకస్వామ్యమే ప్రజా స్వామ్యంగా ప్రస్తుతం చెలామణి అవుతోంది. ఇది కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నతంతే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే తీరు ఇదే. మరి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నట్లా లేనట్టా. లేకపోయినా ఉన్నట్లు భ్రమించి ప్రపంచంలో మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశమని డబ్బా కొట్టుకుంటున్నాం. అసలు 51శాతం ప్రజలెన్నుకున్నవారు ఏలు తుండగా, 49శాతం ప్రజల నాయకులు తలవంచడం తప్ప ఎటువంటి అధికారం లేదు. 70శాతం ఓట్లు పోలైతే అందులో 51శాతం వచ్చిన వారు పాలిస్తున్నవారు ఇది మనప్రజాస్వామ్యం. ఏది ఏమైనా మోదీ ఆశిస్తున్న హిందూ రాజ్యస్థాపనకు మొదటగా కర్ణాటక ప్రజలు చెక్‌పెట్టి గర్వభంగం కల్గించడం హర్షణీయం.
వ్యాస రచయిత సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img