Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

భారత్‌లోనే పేదలెక్కువ

అభివృద్ధిచెందిన ఐదు దేశాల్లో భారతదేశం కూడా ఒకటని బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం డప్పు కొట్టుకొంటోంది. ఇది వాస్తవంకాదని మోదీకి తెలియకపోలేదు. అయినప్పటికీ ఏదో సాధించి నట్లుగా ప్రచారం చేసుకోవడం మోదీకి బాగా అలవాటైన విషయం. దేశ జీడీపీ నిరంతరం తగ్గిపోతూనే ఉంది. అయినప్పటికీ దేశం అభివృద్ధివైపు పయనిస్తోందని దాదాపు దశాబ్దికాలంగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను భ్రమల్లో ముంచుతున్నారు. వాస్తవం చెప్పకుండా భ్రమలు కల్పించడం ప్రజలను మోసగించడమే అవుతుంది. 2014లో అధికారానికి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం 201112 నుండి గణాంక సంస్థలు అందించిన వివరాలను వెల్లడిరచకుండా దాచివేసింది. ప్రపంచబ్యాంకు భారతదేశంలో ఉన్న అత్యంత తీవ్ర పేదరికాన్ని బైటపెట్టింది. ప్రపంచ బ్యాంకు సర్వే ప్రకారం భారతదేశంలో సగటున ఒక వ్యక్తి 1.5డాలర్ల మేరకు ఆదాయం పొందుతూ జీవిస్తున్నాడు. ఈ సర్వే ప్రకారం దేశంలో 1.5 డాలర్ల లోపు ఆదాయంతో జీవిస్తున్న వారి సంఖ్య 23శాతం ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో పేదరికం భారతదేశంలోనే ఎక్కువగా ఉంది. 201112 నాటి నుంచి మనకు ఇంతవరకు లభించిన సమాచారం ఇదే.
పేదరికంపై అధికారిక గణాంకాలు లభించడంలేదు. పేదరికం ఎంత అనేది ఊహించడమే అవుతుంది. ఊహాజనితంగా వివిధవర్గాల నుంచి సేకరించిన గణాంకాలు మాత్రమే మనకు లభిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఉండదు. జాతీయస్థాయి సర్వేఫలితాలను ధృవీకరణ లేని వర్గాలద్వారా వెల్లడైన గణాంకాలతో పోల్చిచూసే అవకాశంకూడా లేదు. అధికారిక గణాంకాలు వెల్లడైనా ఖచ్చితంగా వాస్తవ గణాంకాలకంటే తక్కువగానే ఉంటాయి. అధికారిక గణాంకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బైటకు రావడం లేదు. 201718 నాటి నుంచి జాతీయ నమూనా సర్వే, వినిమయ వ్యయం సర్వే, ఫలితాలను ప్రభుత్వం వెల్లడిరచడం నిలిపి వేసింది. సర్వే ఫలితాల వివరాలు ప్రభుత్వం దాటివేసింది. అనధికారిక గణాంకాల వివరాలను పరిశీలిస్తే పేదరికం అత్యంత తీవ్రంగా ఉందనేది స్పష్టమవుతోంది. 2024లో లోకసభ ఎన్నికలు జరుగనున్నందున ఈ గణాంకాలు వెల్లడైతే ప్రతి కుటుంబానికి వాస్తవ విషయం తెలిసిపోతుంది. అప్పుడు ఓటర్లు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ అభివృద్ధి ప్రత్యేకించి ఆర్థికవ్యవస్థ ఎలా ఉంది, ప్రభుత్వ సామర్థ్యం ఏమిటి అనే అంశాలపై ఒక అంచనాకు రావల్సిన సమయం ఇది. అంగీకృత వర్గాల నుంచి సంబంధిత అంశాల సర్వే వివరాలు మనకు లభించడంలేదు. ఆర్థిక రంగ సూచికలు స్పష్టంగాలేవు. ప్రజలు సగటున తలసరి వ్యయం ఎంత అనేది తెలుసుకునే అవకాశం ఉంటే తద్వారా అంచనా వేయడానికి కొంత మేరకు వీలు కలుగుతుంది. అయితే ప్రపంచబ్యాంకు తమకు లభించిన సూచికల ప్రకారం భారతదేశంలో తీవ్ర పేదరికం నెలకొని ఉందని స్పష్టం చేసింది. ఆయా దేశాలలో పేదరికం స్థాయిలు భిన్నంగానే ఉంటాయి. భారత ప్రభుత్వం నియమించిన తెందూల్కర్‌ కమిటీనివేదిక ప్రకారం, 201112 వ సంవత్సరంలో 22 శాతం ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. 201112నాటివరకు ఉన్న పేదరికం గణాంకాలే ఇప్పటివరకు ఆధారం. ఆనాడుకూడా సగటున వ్యక్తి వినిమయ ఖర్చు వివరాలు వెల్లడయ్యాయి. అప్పుడు వ్యక్తికి 1.90 డాలర్ల ఆదాయం తీవ్ర పేదరికానికి సంకేతంగా అంచనావేశారు. కరోనా మహమ్మారి ప్రారంభం కాకముందే ఇదే వ్యయాన్ని ఆధారం చేసుకుని పేదరికం స్థాయిని నిర్ణయించింది. ప్రపంచబ్యాంకు కన్సూమర్‌ పిరమిడ్‌హౌస్‌ హోల్డ్‌ సర్వే (సీపీహెచ్‌ ఎస్‌) అందించిన సమాచారాన్ని తీసుకొని పేదరికాన్ని నిర్ణయించింది. భారత ఆర్థిక రంగ పరిశీలకకేంద్రం (సీఎమ్‌ఐఈ) ఆ సమాచారాన్ని సేకరించింది. అయితే 201112 తరువాత 201920లో సేకరించిన సమాచారం ప్రకారం పేదరికం రేటు 10శాతమే ఉందని అధికారిక అంచనా. ప్రభుత్వం ఈ అంశంపై ఏనాడూ చిత్తశుద్ధితో పరిశీలించలేదు. ప్రపంచబ్యాంకు వివిధ ప్రైవేటు సంస్థల నుంచి సమాచారాన్ని తీసు కుంటుంది. అలా సమాచారం అందించేవాటిలో న్యూ పావర్టీ వెబ్‌సైట్‌ ఒకటి. వాస్తవంగా కొలంబియా యూనివర్సిటీలో సమర్పించిన పత్రం వివరాలు ఇంకా ప్రపంచానికి వెల్లడికాలేదు. అందులో ప్రజలు మరింత పేదరికంలోకి కరోనాతర్వాత జారిపోయారన్న అంశాన్నికూడా పేర్కొన్నారు. దఫదఫాలుగా లేబర్‌ఫోర్స్‌ సర్వేను జాతీయ గణాంకాల కార్యాలయం నిర్వహిస్తుంది. అలాగే వ్యవసాయం వాటా పారిశ్రామిక అభివృద్ధితో పోలిస్తే తక్కువగా ఉంటోంది. ఇది 1990లనుండి 2004వరకు ఒకే విధంగాఉంది. 16నుండి 17శాతం వరకు నమోదైంది. వ్యవసాయదారుల సంఖ్యసైతం 50 నుండి 43శాతానికి పడిపోయింది. దక్షిణాసియా దేశాలైన బంగ్లాదేశ్‌, చైనా తదితర దేశాలలో మన దేశ జీడీపీ కంటే ఎక్కువగా నమోదైంది. దేశంలో పేదరికం స్థాయిని ఎల్లవేళలా గుప్తంగానే ఉంచు తున్నారు. జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు తీసుకునే చర్యలు ప్రజలకు ఊరట కలిగించడం కంటే వారిమీద ఒత్తిడి చేసేలాగా ఉంటున్నాయి. ఆహారం, వ్యవసాయసంస్థలు (ఎఫ్‌ఏఓ) సేకరించిన సమాచారం సక్రమంగానే ఉంటోంది. తలసరి వినిమయాన్ని ఇది తెలియ జేస్తోంది. 201921మధ్యకాలంలో లభించిన సమాచారం ప్రకారం, వినిమయం రేటు పెరగలేదు. వాస్తవంగా గత ఏడాది నుంచి పేదరికంపై చర్చసాగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం కరోనా మహమ్మారికి ముందే పేదరికం నుంచి దేశం విముక్తి పొందిందని చెబుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img