Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మణిపూర్‌ బీజేపీలో తిరుగుబాటు

ఆశిశ్‌ బిశ్వాస్‌

హింసాయుత ఘర్షణల అనంతరం దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కుకీ ఎంఎల్‌ఏలు, నాయకులు సమావేశంలో పాల్గొని నిత్యం హింసాకాండ చెలరేగే పరిస్థితి ఉండకూడదని గిరిజనేతరులతో కలిసితాము జీవించలేమని స్పష్టం చేశారు. మే 3వ తేదీన ప్రజాసమూహాల మధ్య హింసాకాండ చెలరేగి కొన్ని రోజులవరకు ఘర్షణలు సాగాయి. సైన్యం, పారామిలిటరీ దళాలు, స్పెషల్‌ పోలీసులు వేలాదిమంది రాష్ట్రానికి వచ్చి అదుపు చేయగలిగారు. హైకోర్టు నిర్ణయమే ఈసారి గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఉవ్వెత్తున ఘర్షణలు జరగడానికి తక్షణకారణం. ఇప్పటికే 34 గిరిజనజాతులు ఎస్‌టీ హోదా కలిగిఉన్నాయి. మెజారిటీ ప్రజలకు ఎస్‌టీ హోదా ఇచ్చినట్లయితే ఆర్థికంగా తాము మరింత దిగజారిపోతామని తమకు ఉన్న హోదా, సౌకర్యాలు తగ్గిపోతాయని గిరిజనులు చెబుతున్నారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీజేపీ ఆ షాక్‌ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మణిపూర్‌ బీజేపీలో తిరుగుబాటు మరో షాక్‌ ఇస్తోంది. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ బీజేపీ కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. మణిపూర్‌లో గిరిజన తెగలమధ్య ఈ నెల ప్రారంభంలో తీవ్రమైన కల్లోలమే చోటుచేసుకుంది. సైన్యాన్ని ఇతర పారా మిలిటరీ దళాలను మోహరించి పరిస్థితిని తాత్కాలికంగా అదుపు చేయగలిగారు. ఈ సందర్భంగానే బీజేపీ రాష్ట్ర యూనిట్‌లో గిరిజన ఎంఎల్‌ఏలు ఇంకా వివిధ స్థాయిల్లో నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులతో కలిసి తాము పనిచేయబోమని కొంతమంది బీజేపీ గిరిజన ఎంఎల్‌ఏలు ప్రకటించారు. ఇలా ప్రకటించిన ఎంఎల్‌ఏ లలో ఏడుగురు కుకి సభ్యులు. ఇటీవల జరిగిన హింసాకాండ జాతుల మధ్య ఘర్షణలు జరిగే సున్నితమైన ప్రాంతంలో విస్తరించింది. ఈ నేపధ్యంలో మిజోరం నుంచి ఎంఎల్‌ఏలు ఒక ప్రకటనచేశారు. విచ్చల విడిగా ఘర్షణలు, హింసాకాండ, హత్యలు జరిగాయి. వేలాదిమంది మెజారిటీ జనాభాగలిగిన మెయిటీలు, కుకీలు, నాగాలు, మిజోలు, హమార్‌లు తదితర గిరిజన తెగలు ఈ ఘర్షణల్లో పాల్గొన్నారు. మెజారిటీ జనాభాఉన్న మెయిటీల పరిస్థితిని పునర్‌నిర్వచించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. మెయిటీలు నివసించే ప్రాంతానికి ఎస్‌టీల హోదా ఇవ్వాలని ఇందుకువారికి అర్హతఉందని రాష్ట్రహైకోర్టు తెలిపింది. కేంద్రానికి సిఫారసు చేయాలని కూడా రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఆ తరువాతనే రాష్ట్రంలో సైన్యం వస్తేనేగానీ అదుపు చేయలేనంతగా హింసాకాండ చెలరేగింది.
హింసాయుత ఘర్షణల అనంతరం దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కుకీ ఎంఎల్‌ఏలు, నాయకులు సమావేశంలో పాల్గొని నిత్యం హింసాకాండ చెలరేగే పరిస్థితి ఉండకూడదని గిరిజనేతరులతో కలిసితాము జీవించలేమని స్పష్టం చేశారు. మే 3వ తేదీన ప్రజాసమూహాల మధ్య హింసాకాండ చెలరేగి కొన్ని రోజులవరకు ఘర్షణలు సాగాయి. సైన్యం, పారామిలిటరీ దళాలు, స్పెషల్‌ పోలీసులు వేలాదిమంది రాష్ట్రానికి వచ్చి అదుపు చేయగలిగారు. హైకోర్టు నిర్ణయమే ఈసారి గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఉవ్వెత్తున ఘర్షణలు జరగడానికి తక్షణకారణం. ఇప్పటికే 34 గిరిజనజాతులు ఎస్‌టీ హోదా కలిగిఉన్నాయి. మెజారిటీ ప్రజలకు ఎస్‌టీ హోదా ఇచ్చినట్లయితే ఆర్థికంగా తాము మరింత దిగజారిపోతామని తమకు ఉన్న హోదా, సౌకర్యాలు తగ్గిపోతాయని గిరిజనులు చెబుతున్నారు. రాష్ట్రం అనేక సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంగానీ, నాయకులుగానీ, కేంద్ర నాయకులుగానీ వాటిని పట్టించుకోవడంలేదు. అధికారిక పర్యటనలుచేసి తిరిగి వెళ్లిపోతున్నారు. రాష్ట్ర జనాభాలో 53శాతం మంది మెయిటీలు ఉన్నారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌, చుట్టుపక్కలగల లోయల్లో మెయిటీలు ఎక్కువగా ఉన్నారు. మొత్తం ప్రాంతంలో 10శాతం ప్రాంతంలో మెయిటీలే నివసిస్తున్నారు. అత్యధికంగా గిరిజన క్రైస్తవ గ్రూపులు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరు నివసించే ప్రాంతం చాలా విశాలమైనది.
తాము చాలా తక్కువ ప్రాంతంలో నివసిస్తున్నామని మెయిటీలు బాధపడుతున్నారు. అయితే మెయిటీలు నివసించే ప్రాంతంలోనే ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా ఉందని ఇటీవలప్రభుత్వం ఎక్కువ సౌకర్యాలు ఇంఫాల్‌, పరిసరప్రాంతాల్లోనే ఏర్పాటుచేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. కొండప్రాంతాల్లో చాలా తక్కువ సౌకర్యాలే ఉన్నాయని, ఆర్థికంగా తాము దోపిడీకి గురవుతున్నామని గిరిజనులు ఫిర్యాదు చేస్తున్నారు. అత్యధిక జనాభా ఉన్న క్రైస్తవేతర మెయిటీలు,క్రైస్తవ గిరిజనుల మధ్య తీవ్ర విభజన ఉంది. ఈ రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రభుత్వం పెద్దగా ప్రయత్నం చేయలేదు. మెయిటీల హోదాను పునర్‌నిర్వచిస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఈ రెండుగ్రూపులమధ్య ఇటీవల కాలంలో పెద్దగా ఘర్షణలేమీలేవు. అయితే తాము దోపిడీకి గురవుతున్న ప్పటికీ, ఆర్థికంగా దిగజారిపోతున్నామని చెబుతున్నప్పటికీ బీజేపీ నాయకులు పట్టించుకోవడంలేదని గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు, గౌహతిహైకోర్టు తీసుకున్ననిర్ణయం తర్వాతనే హింసాకాండ జరిగింది. అంతకుముందు ఇలాంటి పరిస్థితి లేదు.
ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని మణిపూర్‌లో అడవులను నరికివేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారని, బంగ్లాదేశ్‌కు, ఇంకా ఇతర నాయకులకు వీరి చర్యలు ప్రయోజనం కలిగిస్తున్నాయని రాష్ట్రప్రభుత్వం ఆరోపిస్తోంది. స్థానిక నాయకులు కూడా ఓటు బ్యాంకు తగ్గకుండా చూసుకునేందుకు ఇలాంటి పనులకు సహకరిస్తున్నారని బెబుతున్నారు. మెయిటీలు, గిరిజనుల పరిస్థితులను పరిశీలించేందుకు కొండప్రాంతాల్లో ఇల్లిల్లు తనిఖీ చేయాలని ఇంఫాల్‌లో అధికారులు కోరుతున్నారు. అనంతరం పోలీసులు, సాయుధ మెయిటీ గ్రూపులుతో కలిసి ఇల్లిల్లు తిరిగి తనిఖీలు చేస్తున్నారు. ఇది కుకీలు, తదితర గిరిజనులకు ఆగ్రహం తెప్పించింది. స్థానికంగా ప్రతిఘటన మొదలైంది. చివరకు కుకీలు ఆయుధాలు చేపట్టడం జరిగింది. ఇటీవల తలెత్తిన హింసాకాండలో గిరిజనులు ఎక్కువగా ఉన్నప్రాంతంలో తీవ్రవనష్టాలు జరిగాయని ఇంఫాల్‌ నుండి పనిచేసే మీడియా తెలియజేసింది. ఈ హింసాకాండలో అనేక వందల ఇల్లు, కార్యాలయాలు, షాపులు, ప్రార్థనాలయాలు, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. కనీసం 100కోట్లకుపైగా నష్టం జరిగి ఉంటుంది. దీర్ఘకాలంగా మతాల మధ్య అపనమ్మకం ఏర్పడటంతో సామాజికంగా జరిగిన నష్టం అత్యంత విలువైనది. గ్రూపులమధ్య అసహనం పెరిగిపోయింది. అయినప్పటికీ హోంమంత్రిని కలిసిన ఎంఎల్‌ఏలు కూడా బీజేపీలోనే ఉండి పనిచేస్తున్నారు. పొరుగున ఉన్న క్రైస్తవ మెజారిటీగల మిజోరం రాష్ట్రంలో గ్రూపులతో మాట్లాడిన తర్వాత వీరు బహిరంగంగానే డిన్నర్లు చేస్తున్నారు. గిరిజనులు, గిరిజనులేతర ప్రాంతాల మధ్య విభజన అనధికారికంగా ఇప్పటికే జరిగిపోయిందని నాగాలు, కుకీల నాయకులు చెబుతున్నట్లుగా మణిపూర్‌నుండి వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో సాధారణపరిస్థితిని త్వరలో పునరుద్ధరిస్తామని బీజేపీ ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కల్లోల పరిస్థితలు ఏర్పడినప్పటికీ బీజేపీ కేంద్ర నాయకత్వం కనీసం ఆప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని అంచనావేయలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img