Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మత స్వేచ్ఛకు సంకెళ్లు

డాక్టర్‌ జ్ఞాన్‌ పాఠక్‌

మత స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఉందని ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022’ తాజా నివేదికలో వెల్లడిరచింది. ఈ నివేదిక ప్రపంచంలోని దాదాపు 200 దేశాల్లో మతస్వేచ్ఛ పరిస్థితిని సమగ్రంగా సమీక్షించి అంచనావేసింది. ఇది దేశంలోని అంతర్గత, వెలుపలి నుండి అనేకసంస్థలు వెల్లడిరచిన నివేదికల ఆధారంగా రూపొం దించడమైంది. ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాలు, మతస్వేచ్ఛ లక్ష్యంగా ఈ నివేదిక రూపొందించినట్లు అంతర్జాతీయ మత స్వేచ్ఛకార్యాలయ రాయబారి రషాద్‌ హుస్సేన్‌ ప్రస్తావించారు. భారతదేశంలోని విభిన్న మతాలకు చెందిన న్యాయవాదులు, మత నాయకులు హరిద్వార్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టిన ద్వేషపూరిత ప్రసంగాలను ఖండిరచారని తద్వారా దేశంలోని బహుళత్వం, సహనం వంటి సంప్రదాయాలను గౌరవించాలని పిలుపునిచ్చారు.
2022లో సంవత్సరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మైనారిటీ వర్గాలపై బెదిరింపులు, దౌర్జన్యాలు, హత్యలు, దాడులు జరిగాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా హిందువులు కానివారిపై గో హత్యలు, గొడ్డుమాంసం వ్యాపారులపై ఆంక్షలు, ముస్లింపురుషులు హిందూ స్త్రీలను మతమార్పిడిలోభాగంగా వివాహం చేసుకున్నట్లు వివిధ ఆరోపణలు చేశారు. పాస్టర్లపై దాడులు, హత్యలు, చర్చిలు, ముస్లిం ప్రార్థనా కార్యక్రమాలపై దాడులు, వారి ప్రార్థనలకు అంతరాయం కలిగించడం, వివిధ రాష్ట్రాల్లో చర్చిలను విధ్వంసానికి గురిచేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. అక్టోబరులో జరిగిన ఒక పండుగ సందర్భంగా మైనారిటీలు, హిందూమతస్థులపై దాడి చేశారనే ఆరోపణలపై నలుగురు ముస్లిం పురుషులపై పోలీసులు అకారణంగా దాష్టీకానికి, హింసకు పాల్పడినట్లు ఈ నివేదిక బహిర్గతం చేసింది. ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌లో జరిగిన మతఘర్షణల్లో ముస్లింలఇళ్లు, దుకాణాలను కూల్చివేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. స్థానిక ప్రభుత్వాలు ఏకపక్షంగా, సాక్ష్యాలు లేకుండా ముస్లిం మైనారిటీలు, తక్కువ ఆదాయవర్గాలపై శిక్షలు విధించాయి. భారతరాజ్యాంగం ప్రతిమనిషికి మత స్వేచ్ఛను కల్పించింది. అన్ని మతాలతో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్మవహరించాలని, మతం ఆధారంగా ప్రజల్లో వివక్షను నిషేధించాలని పేర్కొంది. పౌరులు తమ విశ్వాసాన్ని నిర్భయంగాపాటించే, ప్రకటించేహక్కును కల్పించింది. ప్రజలు తమ హక్కులను నైతికత, ఆరోగ్యం ప్రాతిపదికగా పాటించాలని పేర్కొంది.
దేశంలోని 28రాష్ట్రాలలో 13రాష్ట్రాలు మతమార్పిడులను నియంత్రించే చట్టాలు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. 2020, అక్టోబర్‌లో జరిగిన ఢల్లీి అల్లర్లలో ముస్లిం నిరసనకారులపై పోలీసులు హింసాత్మక చర్యలు చేపట్టినట్లు సిటిజన్స్‌ కమిటీ నివేదిక పేర్కొంది. క్రైస్తవులు ఇతరులను బలవంతంగా మతమార్పిడి చేయిస్తున్నారని, హిందువులను బలవంతంగా మతం మార్పిడి చేయిస్తున్నారని, ఆరాధన కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు క్రైస్తవ సంఘాలపై ఆరోపణలు మోపి కేసులు బనాయించినట్లు ఈ నివేదిక తెలిపింది.
ఆగస్ట్‌లో, ముస్లింమాసమైన ముహర్రం పండుగ సందర్భంగా అనుమతి లేకుండా ప్రదర్శనచేయడంపై శ్రీనగర్‌లో షియా ముస్లింలను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. భద్రతా కారణాలను సాకుగాచూపుతూ ప్రభుత్వం గత 25 ఏళ్లుగా ఇటువంటి ఊరేగింపులను అనుమతించలేదు. ఉత్తరప్రదేశ్‌లోని దుల్హేపూర్‌ గ్రామంలో సామూహిక ప్రార్థన కోసం ఒక ఇంట్లో సమావేశమైన ముస్లింలను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా, కర్నాటక రాష్ట్రాల్లో మతమార్పిడి నిరోధక చట్టాలను హిందువులు కాని వారిపై అమలు చేశాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ కూడా మతమార్పిడి నిరోధక చట్టాన్ని ఆమోదించింది, దీనిపై క్రైస్తవులు ఆ రాష్ట్ర హైకోర్టులో సవాలు చేశారు. అక్టోబరులో, కర్ణాటకలోని అన్ని బాలికల పాఠశాలలో హిజాబ్‌లు ధరించడంతోపాటు విద్యాసంస్థల్లో మతపరమైన వస్త్రధారణపై కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జరిగిన సమీక్షలో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ ఏప్రిల్‌ 26న, 108 మంది మాజీ ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ, అస్సాం, ఢల్లీి, గుజరాత్‌, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ముస్లింలు, మైనారిటీలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని తద్వారా దేశ రాజ్యాంగాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌జీఓ హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ తన వార్షిక నివేదికలో ప్రభుత్వం మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలపై ప్రభుత్వం వివక్షను కొనసాగించడం దారుణమని పేర్కొంది. 2021లో జరిగిన 505 ఘటనలతోపాటు నవంబరు 26నాటికి దేశవ్యాప్తంగా క్రైస్తవులపై 511 దాడులు, దౌర్జన్యాలు జరిగినట్లు యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫోరమ్‌ వెల్లడిరచింది. ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా మైనారిటీలు, ముస్లింలపై చాలా సంఘటనలు నమోద య్యాయి. ఏప్రిల్‌ 6న, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అమెరికన్‌ క్రిస్టియన్‌ ఆర్గనైజేషన్స్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా 2022 వార్షిక నివేదికను విడుదల చేసింది. 2021లో దేశంలోని క్రైస్తవులకు వ్యతిరేకంగా 761 హింసాత్మక సంఘటనలను నమోదు చేసింది, ఇందులో వాగ్వివాదాలు, హత్యలు, సాయుధ దాడులు జరిగినట్లు పేర్కొంది. ‘‘క్రైస్తవులు, ముస్లింలు, మైనారిటీ వర్గాలపై హింసాత్మక చర్యలు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే’’ అని ఆ బృందం తన లేఖలో పేర్కొంది. నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డ్‌ బ్యూరో 2020లో 857తో పోలిస్తే, 2021లో 378 మతపరమైన హింసాత్మక సంఘటనలను నివేదించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img