Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మద్దతు ధరపై కమిటీ నిరుపయోగం

రావుల వెంకయ్య

రైతు ఉద్యమాన్ని ఉపసంహరించుకునే సందర్భంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రధానమంత్రి విస్మ రించినట్లు అర్థమవుతున్నది. రైతుకి మద్దతు ధర కోసం చట్టబద్ధ హక్కు కేరళ తరహా విమోచన చట్టం, 4 వేలకు పైగా రైతుల మీద బనాయించిన కేసులు ఉపసంహరణ, 750 మందికి పైగా వ్యవ సాయ రైతు అమరవీరులకు నష్టపరిహారం, దిల్లీ సరిహద్దుల్లో స్మారక చిహ్నం ఏర్పాటు, లఖింపూర్‌ ఖేరీ ఘటనలో బాధ్యులైన అజయ్‌ మిశ్రాని మంత్రి వర్గం నుండి తొలగించి అతని కుమారుడు ఆశీస్‌ మిశ్రాకు శిక్ష పడేటట్లు చేయాలి. ఈ హామీలు ఏ ఒక్కటి అమలుపరచకుండా తూ.తూ. మంత్రంగా కేంద్రం ఈ కమిటీని వేసి చేతులు దులుపుకుంది.

కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించు కుంటూ, రైతులకు క్షమాపణలు చెప్పి రైతుల డిమాండ్ల పరిష్కారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చి ఎనిమిది నెలలు దాటిన తర్వాత ప్రకటించిన కమిటీ తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ప్రధానమైన వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధ హక్కుగా రావడానికి కృషి చేస్తానని అంద రితో సంప్రదించి కమిటీ వేస్తానని ప్రకటించారు. ఇటీవల జులై మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించింది. భారతదేశంలో ప్రధానమైన పంటలు 52 ఉంటే కేంద్రం కేవలం 23 పంటలకు మాత్రమే ప్రకటించింది. వరికి వంద రూపాయలు మాత్రమే నిర్ణయించింది. మిగిలిన పంటలకు అంతంత మాత్రమే. క్వింటాలు వరి పండిరచడానికి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు సి2G50 ప్రకారం 3 వేల రూపాయలకు పైగా రావాలి. కానీ కనీసం మద్దతు ధర రూ. 2060 మాత్రమే.
ఇప్పుడు జులై 8న ప్రకటించిన కనీస మద్దతు ధరల మీద అవగాహనకు ఏర్పాటు చేసిన కమిటీని వ్యవసాయ మంత్రి తోమర్‌ ప్రకటించారు. ఉన్న వారిలో అత్యధికులు ప్రభుత్వానికి అనుకూలంగా, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు అనుకూలంగా వున్నవారే. గతంలో ఇలాంటి కమిటీని సుప్రీంకోర్టు కూడా ప్రకటించి నవ్వుల పాలైంది. ఈ కమిటీని 540 రైతు సంఘాలు ప్రాతినిధ్యం వహించే రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి ఏకగ్రీవంగా తిరస్కరిం చింది. మరలా ఈ చట్టాల్ని తీసుకురావాలని కేంద్రం దురాలోచనగా ఉంది. అందుకే కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ పదేపదే ఈ చట్టాలను గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. దానిని బట్టి ప్రభుత్వ ఆలోచన అర్థమవుతోంది.
ఈ కమిటీలో 29 మంది ఉన్నారు. మాజీ వ్యవసాయ శాఖ కార్యదర్శి అగర్వాల్‌ అధ్యక్షులుగా ప్రకటించారు. ఇంకా నీతి ఆయోగ్‌ నుండి రమేష్‌ చంద్‌, సుక్పాల్‌ సింగ్‌, సిఎస్‌సి శేఖర్‌, నవీన్‌ సింగ్‌, సిఎస్‌ఆర్‌ఐ తరుపున కార్యదర్శి వినోద్‌ ఆనంద్‌, ఇప్కో చైర్మన్‌ దిలీప్‌ సంఘానీ, రైతు సహకార సంఘాల నుండి ఇద్దరు, వ్యవసాయ విశ్వవిద్యాలయ సీనియర్‌ సభ్యులు, ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐదుగురు ఈ కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, అసోం, ఒరిస్సా, కర్ణాటకలకే చెందిన వారు ఉన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా చట్టాలకు మద్దతుగా పార్లమెంటులో ఓటు వేసిన వారి ఈ కమిటీ వేసేటప్పుడు మాట మాత్రంగానైనా ఉద్యమంలో పాల్గొన్న రైతు సంఘాలతో కనీసం చర్చించలేదు. దాన్నిబట్టి కమిటీ విశ్వసనీయత అర్థం అవుతుంది. ఈ కమిటీ ప్రకృతి వ్యవసాయం మీద పంటల వైవిధ్యం ఎలా ఉండాలి, సూక్ష్మ నీటిపారుదల పథకాల మీద, కృషి విజ్ఞాన కేంద్రాల పనితీరు, ఇతర పరిశోధన అభివృద్ధి సంస్థలు పనితీరు మొదలగు వాటిని పరిశీలిస్తుంది. దాన్నిబట్టి రైతుల డిమాండ్ల మీద కాకుండా ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రధాన డిమాండ్లు పక్కదోవ పడతాయి.
రైతు ఉద్యమాన్ని ఉపసంహరించుకునే సందర్భంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రధాన మంత్రి విస్మరించినట్లు అర్థమవుతున్నది. రైతుకి మద్దతు ధర కోసం చట్టబద్ధ హక్కు కేరళ తరహా విమోచన చట్టం, నాలుగు వేలకు పైగా రైతుల మీద బనాయించిన కేసులు ఉపసంహరణ, 750 మందికి పైగా వ్యవసాయ రైతు అమరవీరులకు నష్టపరిహారం, దిల్లీ సరిహద్దుల్లో స్మారక చిహ్నం ఏర్పాటు, లఖింపూర్‌ ఖేరీ ఘటనలో బాధ్యులైన అజయ్‌ మిశ్రాని మంత్రివర్గం నుండి తొలగించి అతని కుమారుడు ఆశీస్‌ మిశ్రాకు శిక్ష పడేటట్లు చేయాలి. ఈ హామీలు ఏ ఒక్కటి అమలుపరచకుండా తూ.తూ. మంత్రంగా కేంద్రం ఈ కమిటీని వేసి చేతులు దులుపుకుంది.
రైతు ఉద్యమంలో తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి. ఇవాళ సంయుక్త కిసాన్‌ సమన్వయ సమావేశంలో తలెత్తిన అభిప్రాయ భేదాలతో కొంతమంది సమావేశం నుండి బయటికి వచ్చి పోటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం. దానిమీద ఈ సమస్య పరిష్కారం గురించి తిరిగి ఐక్యతను పునరుద్ధరించడానికి ఒక కమిటీ ఏర్పడి కృషి కొనసాగిస్తుంది. ఆ కృషి ఫలించి తిరిగి ఐక్య ఉద్యమం ముందుకు సాగాలి. రైతులు రైతు సంఘాలు ఈ డిమాండ్ల సాధన కోసం ఉద్యమం కొనసాగించాలి. రైతులు, రైతు సంఘాలు కలిసి రావాలి.
వ్యాస రచయిత ఎఐకెఎస్‌ అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img