Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మనం మరిచిన మహా పండిత రాహుల్‌ సాంకృత్యాయన్‌

సంగిరెడ్డి హనుమంత రెడ్డి
రాహుల్‌ సాంకృత్యాయన్‌ అనేక రంగాల్లో విస్తృత విశేష కృషి చేశారు. ప్రభావశీల తోడ్పాటును అందించారు. అయినా చరిత్రకారులు, తత్వవేత్తలు, రచయి తలు, రాజకీయ కార్యకర్తలు ఆయనను మందకొడిగానే స్మరించుకుంటు న్నారు. నేటి తరం విద్యావేత్తలకు, విద్యార్థులకు రాహుల్‌ సాంకృత్యాయన్‌ ఎవరో తెలియదు.
రాహుల్‌ సాంకృత్యాయన్‌ కులవంతి దేవి, గోవర్ధన్‌ పాండే దంపతులకు, తన అమ్మమ్మ గారి ఇంట, ఉత్తరప్రదేశ్‌ ఆజమ్‌ ఘర్‌ జిల్లా పాండహ గ్రామంలో సనాతన సరయుపరిణ (భూమిహార్‌) బ్రాహ్మణ కుటుంబంలో 1893 ఏప్రిల్‌ 9న జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు కేదార్‌నాథ్‌ పాండే. రాహుల్‌ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. 1898లో తాత గారి ఊరిలో ఉన్న ఒకే ఒక పాఠశాల మదరసలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉర్దూ నేర్చుకు న్నారు. ఆయన సహాధ్యాయులు అందరూ ముస్లింలే. ఇంటి వద్దే అనేక భాష లను అభ్యసించారు. ఫోటోగ్రఫీ కూడా నేర్చుకున్నారు.
రాహుల్‌ చిన్న వయసులోనే స్పష్టంగా తెలియని కారణాలతో ఇల్లు వదిలి వెళ్లిపోయారు. సన్యాసులు, భిక్షువులతో కలిసిపోయారు. కలకత్తాలో పొగాకు కొట్టులో సహాయకునిగా పనిచేశారు. సాధువుల సాంగత్యంలో గంజా తాగే వారు. గాంధీని పెట్టుబడిదారుల ప్రతినిధి అని విమర్శించేవారు. గాంధీ హత్య తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నారు. గంజా మానేశారు. అప్పుడప్పుడు మాంసాహారం తినేవారు. కుంభ మేళాలో పెద్ద సాధువుల ఘోరమైన కొట్లాటలు చూసి విసుగెత్తిపోయారు. జంతుబలులకు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసినందుకు సనాతన పూజారులు రాహుల్‌ను చితకబాదారు. గృహస్తులను మోసం చేసిన కపట సాధువులపై రాహుల్‌ వ్యాసాలు రాశారు. గంజాయి తాగే పూజారులు, యోగినుల మధ్య లైంగిక వ్యవహారాలను ఎగతాళి చేశారు. 18వ ఏట వారణాసిలో చక్రపాణి బ్రహ్మచారి మఠంలో చేరారు. 19వ ఏట సన్యాసి రామ్‌ అవతార్‌ శర్మ పరిచయంలో అనేక అంశాల్లో అనుభవం గడిరచారు. 1915లో ఆగ్రాలో ఆర్చ్‌ ముసాఫిర్‌ స్కూల్‌లో చేరారు. ఆ సంస్థ ప్రచురించే పత్రిక ముసాఫిర్‌లోను హిందీ పత్రిక భాస్కర్‌లోనూ అనేక వ్యాసాలు రాశారు. తర్వాతి రోజులలో రాహుల్‌ సాంకృత్యాయన్‌ స్వామి దయానంద సరస్వతి స్థాపించిన వైదిక పిడివాద ఆర్య సమాజ్‌ను అనుసరించారు. హిందు సన్యాసి బాబా రామ్‌ ఉదార్‌ దాస్‌ పేరును తన పేరుగా మార్చుకున్నారు. తర్వాత శ్రీలంకలో బౌద్ధ దీక్ష తీసుకున్నారు. బుద్ధిజం రాహుల్‌ జీవితాన్ని మార్చింది. గౌతముని కుమారుని పేరు రాహుల్‌ కుతన గోత్రం సాంకృత్యను జోడిరచి రాహుల్‌ సాంకృత్యాయన్‌గా పేరు మార్చుకున్నారు.
విశాలమైన నుదురు, ఎద, భుజాలతో ఆరడుగుల నిండైన విగ్రహం రాహుల్‌ది. ఆయన స్వాతంత్ర సమర యోధుడు. రచయిత. బహుళ శాస్త్రజ్ఞుడు. బహుభాషా కోవిదుడు. అయినా ప్రధానంగా హిందీలో రచనలు చేశారు. బౌద్ధ సన్యాసి జీవితం తర్వాత రాహుల్‌ మార్క్సిస్టు సోషలిజాన్ని అనుసరించారు. ఉదారవాద మానవవాదిగా, రాజీలేని సనాతన సంప్రదాయ వ్యతిరేకిగా మారా రు. రాహుల్‌ హిందీ భాషా ప్రేమికులు. ‘‘నేను నా పేరు, రూపురేఖలను, ఆహా రపు అలవాట్లను, సంప్రదాయాలను మార్చుకున్నాను. కాని హిందీ పట్ల అబి óప్రాయాలను మార్చుకోలేదు.’’అనేవారు. రాహుల్‌ ఖురాన్‌ను అరబ్బీ నుండి సంస్కృతంలోకి అనువదించారు. రాహుల్‌కు లాంఛనప్రాయ విద్య చాలా తక్కు వ. ఐనా ఆయన పాండిత్యం, విషయ పరిజ్ఞానం, బోధనా పటి మను గమనించిన లెనిన్‌ గ్రాడ్‌ విశ్వవిద్యాలయం రాహుల్‌ను 1937-38లలో, తిరిగి 1947-48లలో చరిత్ర అధ్యయన ఆచా ర్యులుగా నియమించుకుంది. రష్యాలోని అతిపురాతనమైన, విశా లమైన ఈ ప్రభుత్వ పరిశోధన విశ్వవిద్యాలయం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరంలో ఉంది. ప్రజా సంబంధ, ప్రజావసర పరి జ్ఞానాన్ని గుర్తించడంలో నాటి సోవియట్‌ యూనియన్‌ పేరు గాంచింది.
విస్తృతంగా ప్రపంచ పర్యటన చేసిన భారతీయ పండితులలో రాహుల్‌ ప్రముఖులు. 45 ఏళ్ల పాటు ప్రపంచాన్ని పర్యటించారు. ఈయనను భారతీయ పర్యాటక పితామహుడు అంటారు. సాంకృత్యాయన్‌ చాలా దేశాలు పర్యటించారు. అనేక పర్యాటక గ్రంథాలు రచించారు. దర్శించిన ప్రదేశాల ప్రాంతీయ, చారిత్రక, సాహిత్య అంశాలను వివేచనతో, జ్ఞానయుక్తంగా పొందు పరిచారు. పర్యటన చరిత్రకు సాహిత్య రూపం కల్పించటంలో కీలక పాత్ర పోషించారు. రాహుల్‌ 11 ఏళ్ల పాటు భారత దేశమంతా తిరిగారు. లడక్‌, కిన్నౌర్‌, కశ్మీర్‌ ప్రాంతాలలో, నేపాల్‌, టిబెట్‌, శ్రీలంక, ఇరాన్‌, చైనా, పూర్వ సోవియట్‌ యూనియన్‌లలో పర్యటించారు. బిహార్‌లోని సారన్‌ జిల్లా పర్సాగఢ్‌ గ్రామంలో చాలా సంవత్సరాలు గడిపారు. ఆ గ్రామ ప్రవేశ ద్వారానికి రాహుల్‌ ద్వారం అని పేరుపెట్టారు. ఆయన ప్రయాణాలన్నీ భూమార్గాల్లోనే సాగాయి. కొన్ని దేశాలలో రహస్య రూపాలలో తిరిగారు. టిబెట్‌లో బౌద్ధ సన్యాసిగా అనేకమార్లు ప్రవేశించి, విక్రమశిల, నలంద విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల నుండి విలువైన చిత్రలేఖనాలు, పాళి, సంస్కృత భాషలలో వ్రాతప్రతులను తీసు కొచ్చారు. 12వ శతాబ్దంలో అటు తర్వాత టిబెట్‌కు పారిపోయిన బౌద్ధ సన్యా సులు ఈ చిత్ర లేఖనాలు, వ్రాత ప్రతులను తీసుకెళ్లారు. వీటిని 22 కంచర గాడి దలపై రాహుల్‌ ఇండియా తెచ్చారట. ఆయన గౌరవార్థం పట్నా మ్యూజియంలో ఈ వస్తువులతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
రాహుల్‌ సామాజిక సంస్కర్త, బహుభాషా కోవిదుడు. 30 భాషల్లో, అనేక మాండలీకాలలో ప్రావీణ్యం కలవారు. 12 భాషలలో రాయగల సామర్థ్యం ఉంది. అరబిక్‌, పార్శీ, తమిళ్‌, కన్నడం లాంటి దక్షిణ భారత భాషలు, టిబెటన్‌, సింహలీస్‌, రష్యన్‌, ఫ్రెంచ్‌ వంటి విదేశీ భాషల పాండిత్యం ఆశ్చర్యకరం. రాహుల్‌ భారతీయ శాస్త్రజ్ఞుడు, పురావస్తు శాస్త్రవేత్త. ప్రాచీన శాసనాల అధ్య యనం, శిలాశాసనాల పరిశోధన, లిపి శాస్త్రాల్లో ప్రావీణ్యతలు కలవాడు. మార్క్సిస్టు సిద్ధ్దాంతవేత్త, సృజనశీల రచయిత. 20 ఏళ్లకే అనేక రచనలు చేశారు. జీవితపు చివరి రెండేళ్ళు మతిమరుపుతో బాధపడ్డా, అనేక అంశాల్లో 150 పైగా గ్రంథాలు రాశారు. వాటిల్లో సామాజిక శాస్త్రం, చరిత్ర, తత్వశాస్త్రం, బుద్ధిజం, టిబెటాలజి, నిఘంటువులు, వ్యాకరణం, సంపాదకత్వం, జానపద సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాలు, నాటకాలు, రాజకీయాలు, ప్రచార కరపత్రాలు, అనువాదాలు ఉన్నాయి. ఆయన చాలా రచనలు ముద్రణకు నోచుకోలేదు. రాహుల్‌ ప్రఖ్యాత హిందీ రచనలలో ‘వోల్గా నుండి గంగా (ప్రయాణం) వరకు’ ఒకటి. ఈ కాల్పనిక చారిత్రక గ్రంథం ఆంగ్లంతో సహా అనేక భారతీయ భాషల్లోకి అను వాదమైంది. ఇప్పటికీ ఇది అధిక సంఖ్యలో అమ్ముడు పోతోంది. రాహుల్‌ రచిం చిన ‘మధ్య ఆసియా చరిత్ర’ పుస్తకానికి 1958లో కేంద్ర సాహిత్య అకా డెమి పురస్కారం లభించింది. 1963లో భారత ప్రభుత్వం రాహుల్‌ను పద్మ భూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. ఆయనకు లోతయిన పాండిత్యం ఉన్నా సామాన్యు లకు కూడా అర్థమయ్యే సాధారణ హిందీలోనే గాక సంస్కృతం, పాళీ, భోజపురి భాషలలో తన రచనలు సాగించారు.
‘‘ఏదీ స్థిరం కాదు. ప్రతిదీ క్షణికమే. (సబ్బం కనికం)’’ అన్న బుద్ధుని బోధన, ‘‘ఏదీ చివరిది కాదు. ఏ మనిషీ సంపూర్ణుడు కాదు. సత్య గుత్తాధి పత్యాన్ని నమ్మను. చేయవలసింది చేస్తాను. భావి తరం దాన్ని మెరుగుపరుచు కోనీ.’’ అన్న లెనిన్‌ వ్యాఖ్యా నాలు రాహుల్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. 13.04. 1919న పంజాబ్‌ అమృత్‌సర్‌ జలియావాలా బాగ్‌ నరమేధంతో చలించి పోయారు. వలసవాద వ్యతిరేక రాజకీయాల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు. బ్రిటిష్‌ వ్యతిరేక రచనలు చేసినందుకు, ఉపన్యాసాలు ఇచ్చినందుకు 3 ఏళ్ల జైలు శిక్ష అనుభ వించారు. 1922 ఫిబ్రవరి 13 నుండి ఆగస్టు 9 దాకా బక్సర్‌ జైల్లో, 1923-24లలో హజారిబాగ్‌ జైల్లో రాజకీయ ఖైదీగా గడిపారు. 1921-27ల మధ్య రాజ కీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో ఉప న్యాసాలు చేశారు. గాంధీని గాంధీ బాబాగా పేర్కొని సనాతన వాదుల దురలవాట్లను ఖండిరచారు. రాహుల్‌ మంచి వక్త. ఆయన ఉపన్యాసం ప్రజల భాషలో గంగా ప్రవాహంలా సాగేది. 1935లో సోవియట్‌ రష్యా తొలి పర్యటన తర్వాత సామ్యవాదిగా, మార్క్సిస్టుగా మారారు. పునర్జన్మ, మరణానం తర జీవితం మొదలగు భావాలను తిరస్కరించారు. కిసాన్‌ సభ, జాతీయ కాంగ్రెస్‌ లలో రాజకీయ క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. 19.10.1939లో కమ్యూ నిస్టు పార్టీ సభ్యునిగా చేరారు. బాంబేలో జరిగిన హిందీ సాహిత్య సమ్మేళన్‌లో ఆయన అధ్యక్ష ఉపన్యాసానికి కినుక వహించిన పార్టీ రాహుల్‌ కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని 1948 జనవరిలో రద్దు చేసింది. రాహుల్‌ విజయాలలాగే ఆయన వ్యక్తిత్వం కూడా చిరస్మరణీయం, ఆకర్షణీయం. కుల వ్యవస్థపై విప్లవకర భావాలు కలిగి ఉండేవారు. గాంధీ హరిజనుల ఆలయ ప్రవేశ పిలుపు ఒక ఉచ్చు అన్నారు. హరిజన పేరునే ఎద్దేవా చేశారు. వారు దేవుని మనుషులైతే దేవుడు వారిని గుడ్డి కన్నుతో కూడా ఎందుకు చూడలేదన్నారు. హరిజనులకు నూలు వడకడంలో శిక్షణ ప్రయోజనం కలిగించ దని, దానికి బదులుగా వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని వాదించారు.
రాహుల్‌ సాంకృత్యాయన్‌ శ్రీలంకన్‌ విశ్వవిద్యాలయంలో బోధన వృత్తిని అంగీకరించారు. అక్కడ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు బారిన పడ్డారు. జ్ఞాపకశక్తి కోల్పోయారు. 14.04. 1963న 70 ఏళ్ల వయసులో డార్జిలింగ్‌లో తుది శ్వాస వదిలారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ వ్యక్తిగతంగా సేకరించిన వస్తువులను, సమాచార గ్రంథాలను, చిత్రలేఖనాలను దేశవ్యాపిత విశ్వవిద్యాలయాలు, ప్రదర్శనశాలల్లో భద్రపరి చారు. ఆయన్ను మనం సర్వదా స్మరించుకోవాలి. ఆయన రచనలను అధ్య యనం చేయాలి. పరిశోధించాలి. సమాజ ప్రయోజనానికి అనువర్తించాలి. రాహుల్‌ తాత్వికత నేటి సమాజానికి అత్యవసర ఆవశ్యకం. విద్యావేత్తలు, విద్యార్థులకు రాహుల్‌ గురించి తెలియజేయాలి.
(రేపు రాహుల్‌ సాంకృత్యాయన్‌ జయంతి)
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్‌ ఫోరం
జాతీయ కార్యదర్శి, 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img