Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మనసును కదిలించే కళారూపం ఫొటోగ్రఫీ

సి.హెచ్‌. విజయభాస్కర్‌
పూర్వ కాలపు కట్టు కథలు చదివి సృష్టికి ప్రతి సృష్టి చేయటం నిజమని నమ్మేవారు. ఆ కథలపై సత్య శోధన చేసి పెదవిరిచే వాళ్ళం. నిజాల నీడల్ని ఇట్టే ఒడిసిపట్టి వాటికి జీవం పోస్తే ఎలా ఉంటుందని ఓ ఊహకు తావిచ్చి అటుగా ఆలోచించే వాళ్ళం. మరిచిపోయిన సంగతులన్నీ కలలో కాకుండా కళ్ళెదుట నిలిస్తే అబ్బో అంటూ అబ్బురపోతూ చూడాలి అనుకునేవాళ్ళం. స్వప్నాలు సాకారమైతే ఓ వింతఅనుభూతి. అటువంటి ఓ అద్భుతం ఛాయగ్రహణం, వాడుకగా ఫొటోగ్రఫీిి అంటాము. ఇది ఎలా అవుతుంది అనుకోవచ్చు కానీ కొత్త ఆవిష్కరణగా మనసును తట్టిలేపే కళారూపం ఫొటోగ్రఫీ˜ి. చీకటికి నీడ ఉంటుందంటే ఆశ్చర్యపోతాం కానీ సినిమాని గమనించినప్పుడు నిజమే అనుకుంటా అని సమాధాన పడతాం. ఫొటోగ్రఫీ విషయంలో అలాకాదు అదో అద్భుతమైన కళ, కాంతిని ఒడిసిపట్టి అందులో నిక్షిప్తమైన అనేక దృశ్యాలకు చిత్రంగా నిలుస్తుంది ఛాయగ్రహణం. కొన్ని రకాల రసాయనాలతో రూపొందించిన ప్లేట్‌ పై కాంతిని ముద్రించి దృశ్యాన్ని పట్టేస్తాం..అంటే కాంతిలో చోటుచేసుకునే పరివర్తనల తోటి ఈ చిత్రాన్ని ఇస్తాం. అందువల్ల ఫొటోగ్రఫీని ఛాయచిత్రంగా భావిస్తాం. ఫొటోగ్రఫీకి శతాబ్దాల చరిత్రఉంది 18వశతాబ్దంలో ప్యారిస్‌లో నలుపుతెలుపు ఫొటోగ్రఫీ ప్రారంభమైంది. ఈ ఫొటోగ్రఫీని ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్‌ డాగురె అనే వ్యక్తి 1837లో ఫొటోగ్రఫీ ప్రాసెస్‌ను కనుగొన్నారు. 1939 జనవరి 9న ఫ్రెంచ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ డాగురె టైప్‌ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలలకు ఆగస్టు 19న ఫ్రాన్స్‌ ప్రభుత్వం దీనిపై పేటెంట్‌ హక్కులు కొనుగోలు చేసింది. అంతటితో ఊరు కోలేదు. ఈ ప్రక్రియను ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. ప్రతీ సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం ఫొటోగ్రఫీ దినోత్సవానికి ఒక అంశాన్ని నిర్ణయించి దానికి అనువుగా అనేక ప్రయోగాలు చేయడం ఆనవాయితీగా మారింది. ఒకప్పుడు ఫొటోగ్రఫీ సంపన్నులకు మాత్రమే పరిమితం అనుకునే దశలో ఉండేది అయితే ఫ్రాన్స్‌ ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత సామాన్యులకు చేరువ చేసింది. ఈ చిత్రాన్ని అంటే దృశ్యాన్ని మొత్తంగా ఆవరించిన కాంతిని రసాయనాలు పూసిన పలకపై బందీ చేస్తే, క్రమంగా ఫిలిం, ఆ తర్వాత డిజిటల్‌ చిప్పుల విధానాలు అందబాటులోకి వచ్చాయి. చేతిలో సెల్‌ ఉంటే చాలు దృశ్యాన్ని బంధించే సదుపాయం అందబాటులోకి వచ్చింది. దీంతో ప్రతి సామాన్యుడు అసాధారణ శక్తి సంపన్నుడుగా మారిపోయాడు. ఎలాంటి దృశ్యాన్ని అయినా ఇట్టే పట్టేస్తాడు. ఫొటోగ్రఫీ మన దేశానికి కూడా 19వ శతాబ్దం నాటికి అందుబాటులోకి వచ్చి 20వశతాబ్దం ఆరంభానికి అందరికీ తెలిసిన ఇంద్రజాలంగామారింది. నిన్నటినీ, నేటిని,రేపటిని ఎప్పటి కప్పుడు నూతనఆవిష్కరణలతో మురిపించడం ఛాయ గ్రహణం చతురత. ఎన్నో గతించిన సంగతులు, ఎందరో కనుమరుగైన వారి చిత్రాలు, ఘటనలు మనసును భావోద్వేగానికి లోను చేసిన అనుభూతులు ఏవీ ఎక్కడికీ పోలేదంటూ ప్రపంచానికి భరోసాగా నిలిచింది. ఫొటోగ్రఫీ గమ్మత్తులను చేస్తూ, జీవిత గతుల ఒడిదుడుకులను మరచి మౌనంగా నీడలన్నింటినీ చెరిగిపోని నిజాలుగా మలుస్తున్న అపరబ్రహ్మలు-ఫొటోగ్రాఫర్లు. వారందరికీ వందనాలు……
నేడు అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img