Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మోదీకి కర్నాటక ముస్లింల షాక్‌!

సుశీల్‌ కుట్టి

ఎన్నికల్లో ప్రయోజనం పొందడంకోసం ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింలను ఆకట్టుకునేందుకు విపరీతమైన ప్రయత్నాలే చేశారు. దిల్లీలో, కేరళలో ముస్లింలను బుజ్జగించి ప్రత్యేకించి పస్మాండ ముస్లింలను ఆకట్టు కునేందుకు ముస్లిం పెద్దలతో చర్చలు కూడా జరిపారు. అయితే మోదీ ఎత్తుగడ కర్నాటకలో విఫలమైంది. దాదాపు ఏడాదిన్నరగా కర్నాటకలో ముస్లింలను సంఫ్‌ుపరివార్‌ కార్యకర్తలు అనేక విధాలుగా వేధించారు. చివరకు వేసుకునే దుస్తులపై కూడా ఆంక్షలు పెట్టారు. అనేక ప్రాంతాల్లో ముస్లింలపై దాడులు కూడా చేశారు. ఈ నేపధ్యంలో ముస్లింల ఓట్లు రాబట్టుకునేందుకు పన్నిన వ్యూహం పనికిరాకుండా పోయింది. బీజేపీకి షాక్‌ ఇచ్చిన ముస్లింలు అత్యధికంగా కాంగ్రెస్‌కు ఓటువేసినట్లుగా సమాచారం. కాంగ్రెస్‌ మంచి విజయాన్ని సాధించడానికి ముస్లింలు కూడా గణనీయంగా తోడ్పడ్డారు. అయితే ముస్లింలు ఎక్కువగా బైటపడ కుండా కాంగ్రెస్‌కు ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ముస్లింలు ఎవరికి ఓటు వేస్తున్నారనే విషయం దాదాపు రహస్యంగానే ఉండిపోయింది. ఈ విషయంలో బీజేపీ, సంఫ్‌ు వ్యూహకర్తలు విఫలమయ్యారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అనే నినాదం ఎందుకు కొరకాకుండా పోయింది. ముస్లింలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసినందునే వాళ్లకు తప్పనిసరిగా కొన్ని మంత్రిపదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే తమకు ఉపముఖ్య మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా ముస్లింల నుండి వచ్చింది. కర్నాటకలో ముస్లింలు పూర్తిగా కాంగ్రెస్‌కే ఓటువేశారు. అందువల్ల కాంగ్రెస్‌కు దక్కిన ఫలితంలో ముస్లింలకు కూడా వాటా ఉంటుందనేది బహిరంగ రహస్యమే.
కాంగ్రెస్‌ ముస్లింలతో కుదిరిన ఒప్పందం మేరకు మంత్రి పదవులు ఇచ్చే విషయం చర్చనీయాంశమేకాదు. ఉప ముఖ్యమంత్రి పదవికాకుండా ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని, వాటిల్లోనూ హోం శాఖ, ఆర్థిక, విద్యాశాఖలు ముస్లింలకు ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా వచ్చింది. మంత్రి పదవులే కాకుండా కర్నాటక ఉలేమా వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవికూడా తమకు ఇవ్వాలని ముస్లింలు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న చైర్మన్‌ మౌలానా షఫీ కాంగ్రెస్‌ నియమించిన వ్యక్తి కాదు. బీజేపీప్రభుత్వం ఉండగా ఆయనను నియమించారు. ఎవరు నియమించినా మౌలానా తమ మత ప్రజలకే సేవలు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ముస్లింలు కాంగ్రెస్‌ నియమించే వ్యక్తి తమకు దగ్గరగా ఉండేవాడు కావాలని కోరు కుంటున్నారు. ఈసారి ముస్లింలు మొత్తంగానే కాంగ్రెస్‌వైపు నిలవడం ఆశ్చర్యపరచే విషయమే. ముస్లింలలో అష్రాఫీ, పస్మాండ, సున్నీ, షియాలేకాక బహ్ర వర్గం కూడా కాంగ్రెస్‌కు ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. పోలింగ్‌ కంటే కొన్ని రోజులు ముందుగా అన్ని తెగల ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ముస్లింలను హత్యచేసిన సంఫ్‌ు పరివార్‌ కార్యకర్తలను శిక్షించకుండా వదిలి పెట్టడం కూడా బీజేపీని గట్టిగా దెబ్బతీయడానికి ముస్లింలకు అవకాశం కలిగింది. రాహుల్‌గాంధీ భారత్‌ జోడోయాత్ర చేయకముందే ముస్లింల ఓట్లను సమీకరించేందుకు కాంగ్రెస్‌ ఒక వ్యూహాన్ని రూపొందించింది. కర్నాటకలో ఈ వ్యూహం విజయవంతంగా ఫలించింది. ఈ వ్యూహం ప్రకారం ముస్లింలు అంతా మౌనంగా కాంగ్రెస్‌కు ఓటు వేశారు.
ముక్కోణపుపోటీ సైతం కాంగ్రెస్‌ విజయానికి దోహదం చేసింది. అలాగే జేడీఎస్‌ గణనీయంగా దెబ్బతినడం కాంగ్రెస్‌కు లాభించింది. ప్రాంతీయపార్టీ అయిన జేడీఎస్‌ని ఎంపిక చేసుకోవడం కంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఎంపిక చేసుకోవడమే మేలని గతంలో జేడీఎస్‌కు ఓట్లువేసిన అనేకమంది భావించారు. కాంగ్రెస్‌ ఇతర రాష్ట్రాల్లోనూ ముస్లింల ఓట్లు కోసం కర్నాటకలో అమలుచేసిన పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్‌ వెనుక అండగా నిలవాలన్న భావన ముస్లింలలో గణనీయంగా ఏర్పడిరది. ప్రాంతీయపార్టీల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయంకూడా ముస్లింలలో బలపడిరది. మోదీ వచ్చి ప్రచారంచేస్తే గెలిచినట్లేనని బీజేపీ నాయకులు ఇంతవరకు విశ్వసిస్తున్నారు. మోదీ సైతం అదే ధీమా ఏర్పడిరది. తాము ఎన్ని ప్రజావ్యతిరేక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలలో మోదీపైగల ఆకర్షణ తగ్గబోదన్న బీజేపీనాయకుల నమ్మకం వమ్మయింది. మోదీ ఆకర్షణ దిగజారి పోతున్నదని కర్నాటక ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి గతంలో వలెనే ఓట్లశాతం లభించింది. ఇదొక సానుకూల పరిణామం. అయితే ఓటమికి దారి తీసిన పరిస్థితులపై లోతుగా సమీక్షించుకునే పరిస్థితి కనిపించడంలేదు. మోదీ ఆకర్షణీయ శక్తి ఓట్లు తెచ్చిపెడుతుందన్న ప్రచారం కర్నాటకలో పనిచేయలేదు. కాంగ్రెస్‌పార్టీ కర్నాటక విజయం ప్రభావం తెలంగాణ సహా ఈ ఏడాది చివరికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీలో చేరాలనుకున్న చాలామంది ప్రస్తుతం ఆలోచనలోపడ్డారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు తమదేనన్న మోదీ, అమిత్‌షాల ప్రకటనలు అంతగా విలువలేనివిగా మారిపోయాయి. తెలంగాణలో ఫైర్‌బ్రాండ్‌గా చెప్పు కుంటున్న బీజేపీ ఎంఎల్‌ఏ టి.రాజాసింగ్‌పైగల సస్పెన్షన్‌ వేటును ఆ పార్టీ ఎత్తివేసింది.
నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ వంటివారిపై కూడా సస్పెన్షన్‌ను బీజేపీ తొలగించింది. వీరంతా తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా మౌనంగాఉన్న బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అంతమాత్రాన వీరు పార్టీకి దూరంగాఏమి లేరు. ప్రముఖంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు కనిపించకపోవచ్చు.
కర్నాటకలో మోదీ,అమిత్‌ షాలు సుడిగాలి పర్యటనలుచేసి ప్రచారం సాగించారు. మోదీ 19 బహిరంగసభల్లో అలాగే అనేక రోడ్‌షోలు నిర్వహించారు. కేంద్రమంత్రులు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, అనేకమంది పార్లమెంటు సభ్యులు, అసంఖ్యాక సంఫ్‌ు పరివార్‌ కార్యకర్తలు సాగించిన ప్రచారం ప్రజలను నమ్మించలేక పోయింది. కర్నాటక ప్రజలు బీజేపీకి గట్టి షాక్‌ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img