Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వాస్తవ విరుద్ధమైన బడ్జెట్‌

డా. జ్ఞాన్‌పాఠక్‌

కేంద్ర బడ్జెట్‌ వాస్తవాలకు విరుద్ధంగా ఉంది. 202324లో భారత ఆర్థికరంగ వృద్ధిరేటు తక్కువగా ఉంటుందని అంతర్జాతీయ, జాతీయ సాధికారత సంస్థలు విశ్లేషించాయి. అంతేకాదు, ఇది ప్రజలను మోసంచేసేదిగా ఉంది. ఆదాయం, వృద్ధిరేటు అత్యధికంగా అంచనాలు వేశారు. అలాగే సాధించలేనంత ఎక్కువగా వాగ్దానాలు ఉన్నాయి. వివిధరంగాలకు కేటాయింపులు కూడా అసమతుల్యంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రభుత్వ అసమర్థత నెలకొనిఉంది. అణగారిన వర్గాల ప్రజలకోసం అమలుజరిపే పథకాలకు అత్యంత తక్కువ కేటాయింపులు ఉన్నాయి. వీరి జీవనభృతికి ధరవరలు, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండి వచ్చే ఆదాయంతో సర్దుకోలేకుండా ఉన్నారు. 2023లో వృద్ధిరేటు 5.7శాతానికి తగ్గుతుందని ఓఈసీడీ అంచనావేసింది. ప్రభుత్వం 202324 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 10.5శాతం ఉండవచ్చునని అంచనావేసింది. అంతర్జాతీయ ఏజన్సీలు వృద్ధి అంచనాలను 6.57శాతం ఉండవచ్చునని తెలిపాయి. 202223 ఆర్థిక సర్వే అంచనాప్రకారం, 202324లో 6.5శాతం ఉండవచ్చునని ఆనాడు అంచనా వేసింది. ప్రపంచబ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌, ఏడీబీ, ఆర్‌బీఐలు కూడా తక్కువ వృద్ధిరేటునే అంచనావేశాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆర్థిక, రాజకీయ పరిణామాలపై వృద్ధిరేటు ఆధారపడి ఉంటుంది. ప్రజలను ఆకర్షించేందుకు మాత్రమే 202324లో దేశ వృద్ధిరేటును అధికంగా అంచనావేసి, మెరుగైన అంకెలను చూపించారు. ఎక్కువ కేటాయింపులు జరిపి 10.5శాతం వృద్ధిరేటును అంచనా వేశారు. అయితే వాస్తవంగా 6 లేదా అంతకంటే తక్కువగానే వృద్ధిరేటు నమోదు కావచ్చుననేది సాధికారత సంస్థల అంచనా. రానున్న సంవత్సరాలలో వార్షిక వృద్ధిరేటు స్వల్పంగానే ఉండే అవకాశాలు ఉన్నాయని ఇవి 10నుంచి 12శాతం వరకు సగటున నమోదు కావచ్చునని 202324 ఆర్థిక సర్వే కూడా చెబుతోంది. 202223 ఆర్థికసర్వే ప్రకారం, అంచనావేసిన ఆర్థికవృద్ధి జీడీపీలో 7శాతం ఉండవచ్చు. సమాచారాన్ని లోతుగా పరిశీలించినప్పుడు మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది. 202223లో మొదటవేసిన అంచనాలు జీడీపీ విలువ రూ.2,73,07,751 కోట్లు. అదే బడ్జెట్‌ అంచనాల్లో రూ.2,58,00,000 కోట్లు. జీడీపీ 15.4శాతానికి పెరగవచ్చునని ఈ అంచనా చెబుతోంది. 202223 జీడీపీ వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7శాతం ఉండవచ్చునని ఆర్థిక సర్వే అంచనావేసింది. ఇక్కడ ఎంతమోసం జరిగిందనేది అర్థమైపోతుంది. 7శాతం జీడీపీ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో జరుగుతుందా అనేది పెద్ద సందేహం. ఎందుకంటే ప్రతి మూడునెలలకు తగ్గుతూనే ఉంది. జీడీపీ అంచనాలలోనే కాదు. వృద్ధి ఆదాయాన్ని మరింత పెంచుతుందనేది కూడా నమ్మలేనిదే. సామాజిక రంగానికి కేటాయింపులు వాస్తవాలకు విరుద్ధంగానే ఉన్నాయి. అతి తక్కువగా కేటాయింపులు చేశారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ప్రత్యేకించి ఆరోగ్యం, విద్య, నిరుద్యోగం తదితర విషయాలపై ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ వహించలేదని అర్థమవుతోంది. ఈ అంశాలలో సామాన్యజనం గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 2023`24 అంచనాలు కొన్ని అంశాల పైనే కేంద్రీకరించారు. ప్రైవేటీకరణ, పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణ, ఆర్థిక ప్రోత్సాహాలు, మౌలిక సదుపాయాలకు భారీ పెట్టుబడులపై కేంద్రీకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img