Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

సాధించిన హక్కులపై ఉక్కు పాదమేస్తున్నరు

పల్లవి
లెక్క లేని పని గంటలు ఒక్కటై ఎదిరించి
అలుపెరగని ఉద్యమాలు ఎరుపెక్కంచినారు
ఎదిరించిన పోరులోన ఏరులై పారింది నెత్తురు
పారినట్టి నెత్తురులో ఎరుపెక్కిన ఎర్ర జెండా
ఎనిమిది గంటల పనిదినాలను సాధించినదీనాడే
మేడే ఈ నాడే కార్మికుల పండుగ దినమీనాడే

సాధించిన హక్కుల పై ఉక్కు పాదమేస్తున్నరు
యజమానుల శ్రమదోపిడి సై యంటుందీ సర్కారు
పనికి దగ్గ వేతనాన్ని పాతరెయ్య జూస్తున్నరు
కొత్తకొత్త చట్టాలతో కార్మికుల కడుపుగొట్టి
కార్పోరేట్‌ శక్తులకు గులామై సలామ్‌ జేస్తున్నది

చికాగో నగరంలో చిందించిన రక్తంతో…
తెచ్చుకున్న హక్కులకు ఉరితాళ్ళను బిగిస్తూ…
నలబై నాలుగు చట్టాలను రద్దు జేస్తూ..మోదీ
సర్కారు నేడు నాలుగు కోడులుగా మార్చి..
కార్పోరేట్‌ పెద్దలకు ఊడిగం జేస్తున్నది
కార్మికులు ఏకమై కదులుదాము రథచక్రాలై

ఎనిమిది గంటల పనిదినాలను…
ప్రభుత్వరంగ కంపెనీలను…
కాపాడగ కదులుదాము…
కలసిమెలసి సాగుదాము..
సమరాలను నడుపుదాము..
గమ్యం ముద్దాడుదాము..

కార్పోరేట్‌ శక్తుల పై పరిమితి విధించమంటూ..
కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేయ నినదిస్తూ..
పనిజేసే కార్మికుల పర్మినెంట్‌ చేయాలని
లేబర్‌ కోడు లొద్దని.. రైతు చట్టాల రద్దు కొరకు
నిగ్గదీసి అడుగుదాము ఒక్కటై కదలి రండి
మేడే ఈ నాడే కార్మికుల పండుగ ఈ నాడే

కనీస వేతన జీవోలను ఏర్పాటు కావాలని
సమాన పనికి సమాన వేతనం కల్పించాలని
అసంఘటిత కార్మికులకు సంక్షేమ చట్టం-
మొకటి తేవాలని…
ఉత్పత్తి శక్తులైన కార్మికులు, కర్షకులు..
దిక్కులన్నీ పిక్కటిల్ల పిడికిలెత్తి కదలుదాము
మరో పోరాటానికి సమర శంఖమూద్దాము
ఏకమై పోరుదాము.. సాధించి తీరుదాము

  • జి.చంద్రమోహన్‌ గౌడ్‌, 9866510399

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img