Friday, August 19, 2022
Friday, August 19, 2022

ఒకే కుదురు ప్రజలను చీల్చిన అమెరికా

అజయ్‌ పట్నాయక్‌
రష్యన్లు, ఉక్రెనియన్లు ఒకే కుదురు వాళ్లు. చరిత్ర, సంస్కృతి, భాష ఇద్దరిదీ ఒకటే. వివిధ కాలాల్లో అనేకసార్లు ఇద్దరూ ఒకే దేశంలో నివసించారు. 8621242 మధ్య కాలంలో కీవ్‌రస్‌ పేరుతో రాజకీయ ఫెడరేషన్‌ ఏర్పడిరది. ఆధునిక ఉక్రెయిన్‌ బెలారస్‌, రష్యాలో కొన్ని భాగాలు పొలిటికల్‌ ఫెడరేషన్‌లో భాగమే. ఈ మూడు స్లావిక్‌ రాష్ట్రాలు రష్యా రాజ్యంలో, ఆ తర్వాత సోవియట్‌ యూనియన్‌లో భాగంగా ఉన్నాయి. 1922లో సోవియట్‌ యూనియన్‌ ఆవి ర్భావం తర్వాత ఉక్రెయిన్‌ను వలస పాలన నుంచి విముక్తి గావించి ఉక్రెయిన్‌ ప్రాదేశిక గుర్తింపునకు లెనినిస్టు జాతీయ విధానం పునాది వేసింది. ఉక్రెయిన్‌ అభివృద్ధికి ఎనలేని కృషి చేసింది. మతాంధకారాన్ని ఏ రూపంలో ఉన్నా నిర్దాక్షిణ్యంగా సోవియట్‌ అణచివేసింది. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన తర్వాత మళ్లీ మతం ప్రజల్లో వ్యాప్తి చెందింది. జాతీయవాదం విడివిడిగా దేశాలుగా మారిన అనేక ప్రాంతాల్లో ప్రచారంలోకి వచ్చింది. ఇతర ప్రాంతాలను కలుపుకోవడం, ఏకరూపత భావజాలం ఉక్రెయిన్‌లో జాతుల మధ్య సంబం ధాలను సమూలంగా మార్చివేసింది. సాంస్కృతిక, భౌగోళిక విభజన జాతీయ వాద ప్రాజెక్టుకు బాగా ఉపకరించింది. విడిపోయిన పశ్చిమ ఉక్రెయిన్‌ 2018 లో పోలెండ్‌లో కలిసిపోయేంత వరకు ఆ భావజాలం కొనసాగింది. ఐక్య ఉక్రెయిన్‌ 1941లో జర్మన్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా నిలిచిన సోవియట్‌ యూనియన్‌ రెడ్‌ ఆర్మీ పోలెండ్‌లో ప్రవేశించిన తర్వాత ఉక్రెయిన్‌ పశ్చిమ, తూర్పు ప్రాంతాలు ఐక్యమయ్యాయి. పశ్చిమ ప్రాంత ప్రజలు ఐరోపా తరహాలో ఎక్కువగా రోమన్‌ కాథలిక్‌లు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా జాతీయత గల, రష్యన్‌ మాట్లాడే ప్రామాణిక క్రైస్తవాన్ని అనుసరించే ప్రజలు. రెండు ప్రాంతాల్లో ఆచార వ్యవహారాలు, భాషల తేడా ఇప్పటికీ స్పష్టంగా తెలుస్తుంది. సోవియట్‌ యూనియన్‌లో రాజకీయ పంథా మారిన తర్వాత ప్రత్యేకించి ఈ శతాబ్ది ప్రారంభం నుంచి ఉక్రెయిన్‌ ఒకటే దేశంగా స్థిరత్వం పొందడానికి సామాజిక, సాంస్కృతిక, భౌగోళిక విభజన నిరోధించాయి. విక్టర్‌ యనుకోవిచ్‌ దేశంలో పశ్చిమ తీర ప్రాంతాల మద్దతుతో ఉక్రెయిన్‌లో అధికారం చేపట్టిన తర్వాత దేశ రాజకీయ వ్యవస్థలో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. రష్యా సరిహద్దుల్లో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తూనే, రాజకీయ పరిస్థితిని అవకాశంగా తీసుకొని ప్రభుత్వాన్ని మార్చాలన్నది పశ్చిమ దేశాల ఆలోచన. 2003 లో జార్జియాలో పశ్చిమ దేశాల అండదండలతో ఎన్‌జిఓ సంస్థలు ఎన్నికలు జరపాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అప్పటికే ఎన్నికైన యనుకోవిచ్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. యురేసియా ప్రాంతంలో రష్యా ప్రభావం తగ్గించాలన్నదే పశ్చిమ దేశాల లక్ష్యం. యనుకోవిచ్‌ రాజీనామా చేయగా ఎన్నికలు జరిగి పశ్చిమ దేశాల అనుకూల శక్తులు గెలిచాయి. పశ్చిమ దేశాల వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అనంతరం 2010 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలు పశ్చిమ దేశాలను ఆందోళనపరిచాయి. యుషెంకో గెలిచి అధ్యక్షుడయ్యాడు. 2004 లో జరిగిన నిరసన ర్యాలీలు బయటి శక్తుల ప్రోద్బలంతో జరిగాయని విశ్లేషకులు వెల్లడిరచారు. తమకు అనుకూల వ్యక్తిని అధికారంలోకి తీసుకురావాలనుకున్న పశ్చిమ దేశాల యత్నం విఫలమైంది. అయితే రష్యాకు వ్యతిరేకంగా, అలాగే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం జరిగి అధ్యక్షుడు యుషెంకొకు రష్యాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్‌ అంతర్గత కలహాలు ఉధృత మయ్యాయి. దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో అత్యధిక ఓటర్లు యుషెం కొను గెలిపించారు. అయితే యుషెంకొ అనుసరించిన విధానం పట్ల ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేయడమే గాక తాము మోసపోయామని గ్రహించారు. అయితే 2010 ఎన్నికల్లో విక్టర్‌ యనకోవిచ్‌కి ఉక్రెయిన్‌ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని డొనెట్‌స్క్‌లో 90.4 శాతం, లుగన్‌స్క్‌లో 88.8 శాతం, స్వతంత్ర ప్రాంతం క్రిమియాలో 78.3 శాతం ఓటర్లు ఎన్నికల్లో ఓటు చేసి గెలిపించారు. 2007 లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో యనుకోవిచ్‌ నాయకత్వంలోని ‘పార్టీ ఆఫ్‌ రీజియన్స్‌’ కు 175 సీట్లు లభించాయి. యుషెంకో నాయకత్వంలోని ‘అవర్‌ ఉక్రెయిన్‌’ కు 72 స్థానాలు, మరో పార్టీ ‘ఫాదర్‌ లాండ్‌’ కు 156 సీట్లు లభించాయి. మూడేళ్లలో యుషెంకోవిచ్‌ తిరిగి గెలుపొంది అధ్యక్షుడయ్యారు. పశ్చిమ దేశాల అనుకూల ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ఓటర్లు ఆ పార్టీని శిక్షించారు. 2012 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో యుషెంకోకు 5.5 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. అవర్‌ ఉక్రెయిన్‌కు కేవలం 1.1 శాతం మాత్రమే రావడం పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం కూడా దక్కలేదు. పార్టీ ఆఫ్‌ రీజియన్స్‌కు 2007 లో 175, 2012 లో 185 సీట్లు లభించాయి. ఫాదర్‌లాండ్‌ పార్టీకి 156 నుంచి 101కి తగ్గిపోయాయి. తీవ్ర జాతీయవాదం పార్లమెంట్‌ ఎన్నికల్లో అనూహ్యంగా తీవ్ర జాతీయవాద గ్రూపుల ప్రభావం పెరిగింది. అప్పటి వరకు ఒక్క సీటు కూడా రాని ‘స్వొవొడ’ పార్టీకి 37 సీట్లు లభించాయి. అంతకుముందు కేవలం 0.76 శాతం ఓట్లుండగా 20072012 మధ్య కాలంలో ఓట్ల శాతం 10.44 కు పెరిగింది. యనుకోవిచ్‌ రష్యా అను కూలుడిని, ఉక్రెయిన్‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా స్వొవొడ గ్రూపు ప్రయోజనం పొందింది. దుష్ప్రచారం వల్ల 2014లో జరిగిన ఎన్నికల్లో యనుకోవిచ్‌ ఓటమి పాల య్యారు. పశ్చిమ దేశాల సహాయ సహకారాలతో యనుకోవిచ్‌కి వ్యతిరేకంగా విస్తృతప్రచారం జరిగింది. ఉక్రెయిన్‌ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఓటర్లు అసలు ఓట్లు వేయకుండా బహిష్కరించారు. తాము ప్రజాస్వామ్య అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అనేక వాగ్దానాలు ప్రకటించి విజయం పొందారు. ద్వీపకల్ప ప్రాంతంలో రెఫరెండం జరిగిన తరవాత క్రిమియా తిరిగి రష్యాలో కలిసి పోయింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలోనే 2014 లో ప్రభుత్వం మార్పు వ్యవహారం తీవ్రమైన ఘర్షణకు లోనైంది. కీవ్‌ నాయకత్వాన్ని గుర్తించడానికి డాన్‌బాస్‌ తూర్పు ప్రాంత ప్రజలు తిరస్కరించటంతో అంతర్యుద్ధం మొదలైంది. ఎనిమిదేళ్లపాటు సాగిన ఈ యుద్ధంలో 15వేల మంది ఉక్రెయిన్‌ ప్రజలు మర ణించారు. వీరిలో ఎక్కువ మంది తూర్పు ప్రాంత ఉక్రెయిన్‌కు చెందిన వారు. ప్రభుత్వం మారిన తరవాత కుహనా జాతీయవాదుల ప్రభావం పెరిగింది. అప్పటి వరకు అధికార భాషగా ఉన్న రష్యన్‌ గుర్తింపును రద్దు చేశారు. స్కూళ్లను మూసివేశారు. రష్యా, ఒఎస్‌సిఇ (ఐరోపా భద్రత, సహకార సంస్థ) సమ క్షంలోనే జర్మనీ, ఫ్రాన్స్‌ అధ్వర్యంలో 2015 లో జరిగిన మినిస్క్‌ ఒప్పందాన్ని అమలు చేయలేదు. ఈ ఒప్పందం పైన లుహన్క్స్‌, డొనెట్క్స్‌ రాష్ట్రాల నాయకు లతో సహా ఉక్రెయిన్‌ ఆ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వాలి. అయితే ఈ ఒప్పందాన్ని ఉక్రెయిన్‌ అమలు చేయలేదు. అలాగే ఒప్పందం అమలుకు ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని ఒప్పించేందుకు పశ్చిమ రాజ్యాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో పశ్చిమ రాజ్యాలు ఉక్రెయిన్‌కి ఆయుధాలు సర ఫరా చేశాయి, సైనికులకు శిక్షణ ఇచ్చాయి, అనేక మంది సైనిక సలహా దారులను తయారుచేశాయి. అంతిమంగా నాటో ఉక్కు కౌగిలికే చేరుకున్నాయి. నాటో దళాలు ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించిన తరవాత రష్యా ఎంత మాత్రం వేచి చూడాలనుకోలేదు. నాటో అప్పుడప్పుడు తూర్పు వైపు విస్తరించేం దుకు పూనుకొన్నది. ఈ అంశాన్ని రష్యా అనేక మార్లు నాటో దృష్టికి తీసుకువెళ్లి ఇది సరైంది కాదని చెప్పింది. చివరిగా 2021 డిసెంబరులో గట్టి ప్రయత్నమే చేసింది. ఐరోపా భద్రత, నాటో విస్తరణ నిలిపివేత సూత్రాలపై అమెరికా, దాని మిత్ర దేశాలతో ఒప్పందం కుదుర్చుకొనేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఉక్రెయిన్‌లో సైనిక చర్యను 2022 ఫిబ్రవరి 24 న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. కీవ్‌ ప్రభుత్వం పెడుతున్న హింస నుండి, జరుపుతున్న సామూహిక మారణకాండ నుండి ఆ ప్రాంత ప్రజలను రక్షించేందుకు సైనిక చర్యను ప్రకటించారు.

వ్యాస రచయిత జెఎన్‌యు రిటైర్డు ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img