Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సంక్షేమంతోనే అభివృద్ధి

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

సంక్షేమం, అభివృద్ధి ఒకదానికొకటి పోటీ కాదు. అవి పరస్పరాధారితాలు. సంపూరకాలు. సంక్షేమం అభివృద్ధికి దారితీస్తుంది. సంక్షేమం సుస్థి రమై అభివృద్ధి పరిపూర్ణమైతే, సంక్షేమ పథకాల అవ సరముండదు. సంక్షేమ పథకాలు సామాన్యుల ప్రయోజనాలకు ఉపయోగపడాలి. సంపన్నుల, కార్పొరేట్ల అభివృద్ధికి అనువర్తించేటట్లు వాటిని రూపొందించటం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాద్రోహం.
ప్రజలకు కూడు, గూడు, గుడ్డ వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం, విద్యవైద్య సౌకర్యాలు అందించడం, పౌరుల ఆర్థిక, సామాజిక స్థితి క్షీణించకుండా కాపాడటమే గాక మెరుగుపరచటం, ఉన్నతీకరిం చటం ప్రజా సంక్షేమం. పెట్టుబడిదారుల లాభాల సౌకర్యాలు, సంపన్నుల సుఖ సంతోషాల, సౌకర్య విలాసాల భవంతులు, క్రీడలు, భోజన మధురాసక్రీడల ప్రాంగణాలు అభివృద్ధి కాదు. పేదలకు ఉపాధి కల్పించి, కనీస విరామ వినోదా లను అందించే సమ్మిళిత సమగ్ర ప్రగతియే అభివృద్ధి. ఇందులో ధనికవర్గ ఆది óపత్యం, పేదల దోపిడీ ఉండవు. సంక్షేమం రెండు పాలనా పద్ధతుల్లో అమలవు తుంది.1.సంక్షేమ పెట్టుబడిదారీ విధానం: ఇది వాణిజ్యవేత్తల అనుకూల విధా నాలు పాటిస్తుంది. ప్రభుత్వ రంగం కంటే ప్రైవేటు రంగం అతి ప్రభావ వంతంగా సాంఘిక సంక్షేమం అందిస్తుందని నమ్ముతుంది. 2. సంక్షేమ రాజ్యం: ఇందులో పౌరుల ఆర్థిక, సామాజిక సంక్షేమం ప్రభుత్వ బాధ్యత. సంక్షేమం ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. పథకాల అమలులో కార్మిక సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో 3రకాలు. ఉదారవాద, సామ్య వాద ప్రజాస్వామ్య, సంప్రదాయవాద సంక్షేమ రాజ్యాలు. వీటి లక్షణాలు వేరు.
రోమన్‌ సామ్రాజ్యం ప్రజల అవసరాలను రాజ్యం తీర్చేది. 1917 సోషలిస్టు విప్లవం తర్వాత సమసమాజ స్థాపన దిశలో సోవియట్‌లో సంక్షేమ రాజ్యం అమల్లోకి వచ్చింది. రైతుల, శ్రామికవర్గ సంక్షేమం ప్రాధాన్యత సంతరించు కుంది. స్త్రీలకు సమాన హక్కులు ఇచ్చారు. బాలల వికాసానికి పెద్దపీట వేశారు. అమెరికా ఐరోపా దేశాల్లో ఘోర ఆర్థిక మాంద్యంలో పెట్టుబడిదారీ విధానాన్ని కాపాడటానికి సంక్షేమ చర్యలు చేపట్టారు. అమెరికాలో1929-46 మధ్య పేదలకు, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్వెల్ట్‌ 1933-39 మధ్య న్యూ డీల్‌ పేరుతో సంక్షేమ పథకాలను ధారా వాహికంగా అమలుచేశారు. ప్రజలకు పనులు కల్పించారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. పేదల ఆకలి తీరింది. రైతులకు, నిరుద్యోగులకు ఊరట సామాజిక భద్రత లభించాయి. అమెరికా దళారీ మార్కెట్‌ వాల్‌స్ట్రీట్‌ సంస్క రణలు అమలయ్యాయి. పెట్టుబడిదారీ పాలన నిలబడిరది. ఇంగ్లండ్‌లో పెట్టు బడిదారీ ఆర్థికవేత్త జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ పెట్టుబడిదారీ వాణిజ్య చట్రాల ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. అవి కీన్సియనిజం పేరుతో ఖ్యాతిగాంచాయి. ప్రజ లకు పనులు కల్పించారు. ఆర్థిక సహాయం అందించారు. పన్నులు తగ్గించారు. కార్పొరేట్‌ ఖర్చులకు అనుబంధంగా ప్రభుత్వ ఖర్చులు పెంచారు. నిరుద్యోగ భృతి చెల్లించారు. బీమా పథకాలు అమలు చేశారు. బ్రిటిష్‌ ఆర్థికవేత్త, ఉదార వాద రాజకీయ సంఘ సంస్కర్త విలియం బెవెరిడ్జ్‌ నివేదిక సంక్షేమ రాజ్య స్థాప నకు దారితీసింది.1940-70 మధ్య రాజ్యం ధార్మిక సంస్థల నుండి, చర్చి నుండి ప్రజాసేవలను తీసుకుంది. ఇవన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థను కూలి పోకుండా ఉంచడానికే. ప్రజల సూత్రబద్ద సంక్షేమానికి కాదు. స్కాండినేవియన్‌ దేశాల్లో తొలినాటి కమ్యూనిస్టు, సోషల్‌ డెమొక్రాటిక్‌ ప్రభుత్వాలు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేశాయి. నేటి మధ్యేమార్గ ప్రభుత్వాలు వాటి రద్దుకు సాహసించలేకున్నాయి. ఇంకా మెరుగుపర్చి కొనసాగిస్తున్నాయి. విద్య వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉచితంగా అందుతున్నాయి. నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పెన్షన్లు, ఆహార సామాజిక భద్రతలు హామీ కల్పించారు.
భారత్‌లో రాజ్యాంగ పీఠిక, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు సంక్షే మ రాజ్య హామీనిచ్చాయి. రాజ్యాంగ అధికరణ 38 సమాన అవకాశాలను, అధి కరణ14 సమాన పనికి సమాన వేతనంతో సహా అనేక సమానత్వ సూత్రాలను అందించాయి. ఆదేశిక సూత్రాలు రాజకీయ ప్రజాస్వామ్యాన్నేగాక సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని, పోలీసు రాజ్యం బదులుగా సంక్షేమ రాజ్యాన్ని ఆదేశిం చాయి. గత ప్రభుత్వాలు కొంత, నేటి సర్కారు పూర్తిగా ఈ అవగాహనలను తారుమారు చేసింది. నేటి సర్కారు సంక్షేమ పెట్టుబడిదారీ విధాన సంప్రదాయ వాద సంక్షేమరాజ్యం. సంప్రదాయవాద పాలక పక్షాలు ఎన్నికల ప్రణాళికల్లో, ప్రచారాల్లో అర్థంలేని, ఆచరణ సాధ్యంకాని అశాస్త్రీయ, అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ వాగ్దానాలు చేస్తున్నాయి. సంక్షేమం పేరుతో అపాయకర జన సమీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాలుచేస్తున్నాయి. గద్దెనెక్కి ఎక్కువ ప్రమా ణాలను విస్మరిస్తున్నాయి. కొన్నిటిని అమలు చేసి అభాసు పాలవుతున్నాయి. ఈ అతిశయ, అతిక్రియాశీల, అవాంఛిత సంక్షేమాల, ప్రజల ఇష్టానిష్టాలతో సంబం ధంలేని సంక్షేమ రాజ్యాన్ని గేళి చేస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు లబ్ధి పొందాలి. వాటి పాదార్థిక, సామాజిక ప్రయోజనం సామాన్య ప్రజలకు అందాలి. అభివృద్ధికి దారితీయాలి. ప్రైవేటు సంస్థలకు, కార్పొరేట్లకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు, లాభాలు అందరాదు. సంక్షేమ పునాదులైన విద్య, వైద్యం తప్పనిసరిగా ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. ప్రపంచీకరణను ఆమో దించి ఈ రంగాలను ప్రైవేట్లకు అప్పజెప్పారు. ప్రభుత్వ రంగంలో మిగిలిన ఈ రంగాల సేవలను మెరుగుపర్చాలి. అధికార, ఉద్యోగ శ్రమ సంస్కృతిని ఉన్నతీ కరించుకోవాలి. ఉచిత నైపుణ్య సేవలను కాదని ప్రజలు లక్షల ఖర్చుతో కార్పొ రేట్ల కబందాల్లోకి వెళ్లారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా, పరో క్షంగా విద్య వైద్య సేవారంగాల్లో ప్రవేశించారు. కార్పొరేట్ల కొమ్ముకాస్తున్నారు. దోపిడీ సాగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పనులు వీళ్ళే పొందుతారు. పేదల సంక్షేమం మరుగునపడిరది. కార్పొరేట్లు అభివృద్ధి చెందుతున్నారు. ఈ ప్రక్రియ అన్ని రంగాలకు విస్తరించింది. ప్రధాని బీమా పథకాలు ప్రైవేటు సంస్థలను బతి కించేవే. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ల ఆస్పత్రులు, ఫీజు రియంబర్స్మెంటు కార్పొరేట్ల కళాశాలలు లాభపడ్డాయి. ఈ ఖర్చుతో ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగు పర్చవచ్చు. ప్రభుత్వ కళాశాలలు స్థాపించవచ్చు. అందరికీ ఉచిత విద్య వైద్యం అందించవచ్చు. దీర్ఘకాల నష్టాలు గమనించక, తాత్కాలిక భృతులతో తృప్తిపడిన అమాయక ప్రజలు పాలకవర్గ ఓటు బ్యాంకుగా మారారు. పాలకులకు ఈ పథ కాలతో అపరిమిత ప్రయోజనాలున్నాయి. అధికారులు, దళారీలు లాభపడతారు. ప్రైవేటర్ల్లు, కార్పొరేట్లతో శాశ్వత ‘నీకిది నాకది (క్విడ్‌ ప్రొ కొ)’ బంధం ఏర్పడు తుంది. జీవితమంతా పరస్పర లబ్ధి పొందుతూ ఉంటారు. సంక్షేమం పేరుతో పన్ను చెల్లింపుదారుల సొమ్ము కార్పొరేట్ల వశమవుతోంది. ఆ ఆర్థికబలంతో వాళ్ళు మరిన్ని సంస్థలు స్థాపిస్తారు. సమాజ వినాశకులను తయారుచేస్తారు. దేశ విచ్ఛిన్నతకు దారితీస్తారు. సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజలకు అవగాహన లేదు. దోపిడీ వర్గాల ప్రాయోజిత ప్రణాళికలను పాలకులు పేదల సంక్షేమ పథకాలుగా వర్ణిస్తారు. ఈ మోసపూరిత ప్రచారాలను ప్రజలు నమ్ముతారు. అరకొర సౌకర్యాలతో తృప్తిపడతారు. ఈ మోసాలను వివరించేవారు తమ సౌకర్యాలకు అడ్డుపడుతున్నారని భావిస్తారు.
సంపూర్ణ అభివృద్ధి సాధించే వరకు సంక్షేమం కొనసాగవలసిందే. నేడు పాలక పార్టీలు, వాటి మిత్ర పక్షాలే గాక ప్రతిపక్షాలు కూడా సౌజన్య పక్షపాతం (ఔనంటే ఔననే ఎదరుచెప్పలేని తత్వం)తో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కార్పొ రేట్లకు ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. స్వలాభం చూసుకుంటున్నాయి. ప్రజా సంక్షేమానికి తూట్లుపొడిచి అభివృద్ధి నిరోధకాలుగా మారుతున్నాయి. ప్రగతిశీల పౌరసంఘాలు, ప్రత్యామ్నాయ పక్షాల ప్రజాసంఘాలు సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు అవగాహనకల్పించాలి.
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి,
9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img