Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

ఉక్రెయిన్‌కు మద్దతుపై భిన్నస్వరాలు

బుడ్డిగ జమిందార్‌

ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమై మరో రెండు వారాల్లో 5 నెలలు పూర్తవుతాయి. రష్యాపై ఆంక్షలు అంతగా ఫలితాన్నివ్వలేదు. యుద్ధం ముందు డాల రు విలువ 85 రూబుళ్ళు ఉండగా, యుద్ధం ప్రారం భమైన తర్వాత అనతికాలంలో 140 రూబుళ్ళ వరకూ పెరిగింది. కానీ ఆంక్షలను రష్యా చమురు గ్యాసులతో తట్టుకొని రూబులుతోనే వాణిజ్యం అనేసరికి ఒక్కసారిగా పశ్చిమ దేశాల ఆలోచనలు తలక్రిందులైనాయి. ఇప్పుడు రూబులు విలువ పెరిగి సుమారు 55 దగ్గర గిరాకిగా నిలిచింది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌లు బుర్ర బాదుకొంటున్నాయి. ప్రారంభంలో ఎంతో గాంభీర్యాన్ని ప్రదర్శించి ఐక్యంగా ఉక్రెయిన్‌కు ఆయు ధాల్ని, ధన సహాయాన్ని చేసిన అమెరికా, యు.కె, ఈయూ దేశాలు సహాయ చర్యల వేగవంతాన్ని తగ్గించాయి. క్రమంగా వారి వారి దేశాల్లో ప్రజావ్యతిరేకత కనబడ్తోంది. వారి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతూ గ్యాస్‌ ధరలతో పాటుగా అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం రెండంకెలు దాటుతోంది. ‘‘యుద్ధం మొదటి నెలల్లో యూరపు ఐక్యంగా ఉంది. ఇప్పుడు యూరప్‌ నకు ఎలా మద్దతునివ్వాలో అనేదానిపై భిన్నమైన అభిప్రాయాలు వెలువడటం మేము గమనిస్తున్నాం’’ అని ఉక్రెయిన్‌ ఆర్థిక మంత్రి సెర్గీ మార్చెంకో ఇటలీ దినపత్రిక ‘కొరియర్‌ డెల్లాసెరా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు. ఈయూ దేశాలు ప్రకటించిన 910 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించటానికి కొన్ని దేశాలు సిద్ధంగా లేవన్నాడు. మాకు నెలకు 500 కోట్ల డాలర్లు కావాలి. కానీ ఏప్రిల్‌లో 160 కోట్ల డాలర్లు, మేలో 150 కోట్ల డాలర్లు, జూన్‌లో 440 కోట్ల డాలర్లు అందాయి. జులైకి వచ్చేసరికి ఈయూ అధికార పెత్తందారీవర్గం అడ్డు తగుల్తోందని అన్నారు. ఈయూ దేశాలు ఈ ధనాన్ని ఎలా వినియోగిస్తున్నారో అని ఆరా తీస్తున్నాయని అంటున్నాడు. అవినీతికి మారుపేరైన ఉక్రెయిన్‌ అధికారుల్ని ఈయూ దేశాలు నమ్మే స్థితిలో లేవు. ఇదే తరహాలో ఉక్రెయిన్‌కు చేరే అమెరికా, ఈయూ దేశాల ఆయుధాలు దేశ ఎల్లలు దాటి అఫ్గానిస్థాన్‌, పాకిస్తాన్‌ వంటి దేశాల్లో కూడా టెర్రరిస్టులకు అందే ప్రమాదముందని సమాచారం. రష్యాతో జరుగుతున్న యుద్ధ వివాదంతో ప్రపంచ దేశాలు క్రమేపీ విసుగు చెందుతున్నాయని కూడా ఉక్రెయిన్‌ ఆర్థికమంత్రి అన్నారు. ఇటీవల ఇండోనేషియాలో జి20 దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో కూడా ఇటువంటి అభిప్రాయాలే వెలువడ్డాయి. ‘రష్యా’ను ఆర్థిక ఆంక్షలతో శిక్షించటం కంటే వారి సొంత దేశ జాతీయ ప్రయోజనాలపై ప్రతినిధులు ఎక్కువ శ్రద్ధ చూపించారని ఈయూ, విదేశాంగ విధాన చీఫ్‌ జోసెఫ్‌ బోరెల్‌ చెప్పుకొచ్చాడు. తమ సైనిక ఆపరేషన్‌ జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని, దీనిని కొనసాగిస్తామని రష్యా పేర్కొంది. ఇంధన ధరలు పెరగటంతో భారత్‌చైనాలకు రికార్డు స్థాయిలో చమురును రష్యా ఎగుమతి చేస్తూ రికార్డు ఆదాయాన్ని సంపా దించుకొంటోంది. ఇటు ఈ మూడు దేశాలు లబ్ధి పొందుతుండగా, అటు ఉక్రె యిన్‌ యుద్ధం పుణ్యమా అంటూ ఈయూదేశాలు విపరీతంగా నష్టపోతున్నాయి.
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఎటూ పాల్పోవటం లేదు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి మెల్నిక్‌ను జెలెన్స్కీ వెనుకకు రప్పించాడు. తను అంటున్న పునర్వవస్థీకరణలో భాగంగా హంగెరీ, చెక్‌ రిపబ్లిక్‌, నార్వే, భారత్‌తో సహా మరాకో వంటి అనేక దేశాలలోని ఉక్రెయిన్‌ రాయబారులను వెనుకకు పిలిపించాడు. జర్మనీలోని రాయబారి మెల్నిక్‌ నాజీ హిట్లర్‌ కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో వేలాదిమంది యూదుల్ని, కమ్యూనిస్టుల్ని, సోవియట్‌ యూనియన్‌ పౌరుల్నీ ఊచకోత కోయించిన ఉక్రెయిన్‌ ఫాసిస్టు స్టెఫాన్‌ బండే రాను సమర్థించుకు రావటం ఒక కారణం కూడా. మెల్నిక్‌ వ్యాఖ్యలు జర్మనీ, పోలెండులలో నిరసనను ప్రేరేపించాయి. పోలెండు విదేశాంగ శాఖ ఉక్రెయిన్‌ అధ్యక్షునికి ఫిర్యాదు చేసింది. కానీ, జర్మనీ ప్రభుత్వం మాత్రం నోరు మెదప లేదు. జర్మనీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హిట్లర్‌కు పునరావాసం కల్పించ టానికి మౌనవ్రతం చేపట్టిందని సోషలిస్టు వెబ్‌సైట్‌ రాసింది. మెర్కిక్‌ను కీవ్‌ నగరానికి రప్పించటానికి ముఖ్యంగా మరొక కారణముందని, ప్రస్తుతం ఈయూ దేశాలు పంపించనున్న 910 కోట్ల డాలర్లకు జర్మనీ అడ్డు తగలటమే ప్రధాన కారణమని ప్రపంచ పత్రికల్లో విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో పాటుగా జర్మనీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తాము పంపిస్తామన్న యుద్ధ సామాగ్రిని పంపించటంలో విపరీతమైన జాప్యం చేస్తోందని ఉక్రెయిన్‌ అంటోంది. దీనికి జర్మనీ ఛాన్సలర్‌ షోల్జ్‌ వివరణను యిస్తూ ‘‘అమెరికా దేశం రక్షణ (మిలిటరీ) రంగానికి చేసినంత ఖర్చును జర్మనీలో చేయటం లేదు గనుక మా వద్ద భారీగా గోడౌన్లలో ఆయుధ నిల్వలు పేరుకుపోయి లేవు. కనుక మేము ఆయుధాల్ని సమకూర్చుకోవటానికి, మెషినరీలో ప్రోగ్రామ్స్‌ను మార్చటానికి సమయం పడ్తుంది గనుక వెంటనే పంపించలేం’’ అని అమెరికా దగ్గరనున్న మితిమీరిన ఆయుధాల్ని గురించి వివరాలు బయటపెట్టాడు.
జర్మనీ పంపించే మార్స్‌ 2 వంటి క్షిపణులను వదిలే బహు రాకెట్‌ లాంచర్‌లకు అమెరికాయూకేలు పంపించే క్షిపణులు సక్రమంగా కూర్చో వాలంటే ప్రోగ్రామ్స్‌లో మార్పులు అవసరం. సైనికులకు శిక్షణ కావాలి. రిపేర్లు చేసే శిక్షణ తర్ఫీదులు పొందిన సిబ్బందితో పాటు విడిభాగాలు అవసరమవు తాయి. ఇవన్నీ లేకుండా యుద్ధ సామాగ్రి పంపినంత మాత్రాన సరిపోదు. ఇప్పటికే అంచనాలకు అందని వేలాదిమంది ఉక్రెయిన్‌ సైనికులు చనిపోయారు. రిజర్వు ఆర్మీకి సాంకేతిక పరిజ్ఞానముండదు. యూరపులోని పెద్ద ఆర్థిక వ్యవస్థలైన జర్మనీ, ఫ్రాన్స్‌ల ఆర్థిక వ్యవస్థలు గాడి తప్పుతున్నాయి. యూకేలో రాజకీయ సంక్షోభమేర్పడి ప్రధాని జాన్సన్‌ రాజీనామా చేసాడు. ఇటువంటి పరిస్థితుల్లో యూరపును ఛిన్నాభిన్నం చేసి ప్రపంచ ఆర్థిక ఆధిపత్యాన్ని ముందుకు కొనసాగించటానికి అమెరికా కాటికాడ నక్క వలే ఎదురు చూస్తోంది. యూరపును బలహీనపర్చి తన ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించాలను కొంటోంది. ఇది జరగకముందే ఉక్రెయిన్‌రష్యా`ఈయూ దేశాలు చర్చల ద్వారా ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు కృషి సల్పాలి. నాటోను రష్యా సరిహద్దు లకు విస్తరించాలనే ఆలోచనను విరమించాలి. బైడెన్‌ చెప్పినట్లు ఆయుధ సరఫరా ద్వారా యుద్ధాన్ని పొడిగించాలనుకుంటే, అసలైన యుద్ధాన్ని ముందు ముందు చూస్తామని పుతిన్‌ అనటం ఏ మాత్రం మానవాళికి శ్రేయస్కరం కాదు గనుక శాంతి చర్చల ప్రారంభమే శరణ్యం.
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్‌ ఫోరం
నాయకులు, 9849491969

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img