హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్ ఫర్నిచర్, హైదరాబాద్‌లోని మలక్ పేటలో తమ స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ఈ స్టోర్‌ను అభిమానుల సమక్షంలో రాయల్ ఓక్ ఫర్నిచర్ ఛైర్మన్ విజయ్ సుబ్రమణియం, మేనేజింగ్ డైరెక్టర్ మథన్ సుబ్రమణియం, రిటైల్ హెడ్ హెచ్ ఎస్ సురేష్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ హెడ్ ప్రద్యుమ్న కరణం, సేల్స్ అండ్ మర్చండైజింగ్ హెడ్ ప్రశాంత్ కోటియాన్ ప్రారంభించారు. దాదాపు 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ విస్తృత శ్రేణిలో లివింగ్ రూమ్స్, బెడ్‌రూమ్స్, డైనింగ్ రూమ్స్ మరెన్నో వాటికి తగిన ఫర్నిచర్ అందిస్తుంది.