Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

సీబీడీసీ ఇంటిగ్రేషన్‌లో అగ్రగామిగా హెచ్‌డీఎఫ్‌సీ

ముంబయి : భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ భారతదేశ సావరిన్‌ డిజిటల్‌ కరెన్సీ, సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)తో ఇంటర్‌ఆపరేబుల్‌ యుపిఐ క్యూఆర్‌ కోడ్‌ను ప్రారంభించామని ప్రకటించింది. దీనితో, ఇంటిగ్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసిన దేశంలోని మొదటి బ్యాంకులలో ఒకటిగా హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌ నిలించింది. ఇంటర్‌ఆపరబుల్‌ యూపిఐ క్యూఆర్‌ కోడ్‌ బ్యాంక్‌ సీబీడీసీ ప్లాట్‌ఫారమ్‌లో ఆన్‌బోర్డ్‌ చేసిన హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌ వ్యాపారులు, తమ వినియోగదారుల నుంచి నుండి డిజిటల్‌ రూపాయి కరెన్సీ రూపంలో చెల్లింపులను స్వీకరించేందుకు అనుమతిస్తూ, ఇది రోజువారీ లావాదేవీలలో సీబీడీసీ వినియోగాన్ని పెంచుతుంది. గత ఏడాది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రారంభించిన సీబీడీసీ పైలట్‌ కార్యక్రమానికి ఈ చొరవ పొడిగింపుగా భావించవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img