Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పలస్తీనా స్వేచ్ఛా స్వాతంత్రాలకై ఐక్యమవుదాం

బుడ్డిగ జమిందార్‌

పలస్తీనా ప్రాంతం గాజాస్ట్రిప్‌పై గత నాల్గురోజుల నుండి ఎడతెరపి లేకుండా ఇజ్రాయిల్‌ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. చిన్నారులను సైతం లెక్కచేయక, పౌరులను, పలస్తీనా, ఇస్లామిక్‌, జిహాద్‌ నాయకులను చంపుతూ ప్రజల ఆస్తులను విధ్వంసం చేస్తున్నది. 2021 మే నెలలో 11 రోజుల పాటు యుద్ధం చేసి వందలాది పలస్తీనియన్లను చంపటంతో పాటు అనేక వేలాదిమందిని క్షతగాత్రుల్ని చేసింది. కొద్ది విరామం తర్వాత అన్నట్లు తిరిగి జాత్యహంకార ఇజ్రాయిల్‌ పల స్తీనాను అంతమొందించే వ్యూహంలో భాగంగానే ఈ క్షిపణుల దాడుల్ని చేస్తుంది. ఉక్రెయిన్‌, తైవాన్‌ల కోసం మొసలి కన్నీరు కార్చిన అమెరికా, మిత్ర దేశాలకు పల స్తీనా ప్రజల మానవ హక్కులు, స్వేచ్ఛాస్వాతంత్రాలు గుర్తుకు రావటం లేదు. ఈ నాల్గురోజుల వరస కాల్పుల్లో 15 మంది చిన్నారుల్ని ఇజ్రాయిల్‌ బలి తీసుకొంది. దీంతోపాటుగా మరో 29 మంది పౌరుల్ని ఇజ్రాయిల్‌ చంపింది. ాాఉగ్రవాద బెది రింపులకు వ్యతిరేకంగా తన ప్రజలను రక్షించటానికి ఇజ్రాయిల్‌ హక్కు్ణకు మద్దతు నిస్తామని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్‌ చెప్పటమంత మరో ఘోర మైన ప్రకటన ఉండదు. 15 మంది చిన్నారులు జామిల్‌ (4 సంవత్సరాలు), అలా (5), మోమెన్‌ (5), సాలెమ్‌ (9), సైరాబ్‌ (11), నజీమ్‌ 13), నబాహీన్‌ (13), హసౌనా (14), హామెద్‌ (16), ఫార్రామ్‌ (16), హనూడా (18 సంవత్సరాలు) అమెరికా పచ్చకామెర్ల యుద్ధ కళ్ళకు టెర్రరిస్టులగానే కనబడుతున్నారు. చనిపోయిన చిన్నారులను చూస్తుంటే గుండె తరుక్కుపోతుండగా వాళ్ళని ఉగ్రవాదులుగా పోల్చటం సామ్రాజ్యవాద నీచ సంస్కృతి చరిత్రలో నిలిచిపోతుంది. అమెరికన్‌ కార్పో రేట్‌ మీడియా, సి.ఐ.ఏ ఉక్రెయిన్‌లో పిల్లల మరణాలకు నమ్మకమైన ప్రజా సేవ కులుగా ప్రచారంతో రోజూ మీడియా ప్రచారం చేసేది. పిల్లల మరణాల్ని ఎక్కడైనా ఖండిరచవల్సిందే. కానీ పలస్తీనా చిన్నారుల మరణానికి పెదవి కదపటం లేదు. అమాయకుల ప్రాణాలు కోల్పోయినందుకు సంతాపం వ్యక్తపర్చలేదు. ఇజ్రాయిల్‌ను హంతకునిగా, తాత్కాలిక ప్రధానమంత్రి లాపిడ్‌, రక్షణమంత్రి బెన్నీగాంచ్‌లను హంతకులుగా ఎందుకు చిత్రీకరించటం లేదు. ఇజ్రాయిల్‌ మిలిటరీని అమెరికా ఎందుకు వెనకేసుకొస్తుంది అనే అమెరికా ద్వంద్వ నీతిని ప్రజలు ప్రశ్నించకమానరు. పలస్తీనీయన్లు కోరేది వాళ్ళ దేశాన్ని వాళ్ళకి ఇమ్మంటున్నారు. అప్పటివరకూ వారికి కేటాయించిన భూభాగాల్నయినా ఇమ్మంటున్నారు. ఇజ్రాయిల్‌ ఆక్రమణను వ్యతి రేకిస్తున్నారు. తూర్పు జెరూసలేం వెనుక్కి ఇమ్మంటున్నారు. అన్ని దేశాల పౌరుల్లా వారికీ చదువుకొనే హక్కు, తాగునీరు, ఆహారం, ఉంటానికి ఇల్లు, స్వేచ్ఛాయుత జీవితం కావాలంటున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పలస్తీనా భూభాగాన్ని ఆక్రమించిన ఇజ్రాయిల్‌ కనీసం ఐరాస నిబంధనలకైనా కట్టుబడి ఉండమంటుంటే ఇజ్రాయిల్‌కు మద్దతు యిస్తున్న అమెరికా ప్రతీ సంవత్సరం 3 నుండి 6 బిలియన్ల డాలర్ల ప్రత్యక్షంగా నిధులను యిస్తుంది.
2000 నుండి కనీసం 2,200 మంది చిన్నపిల్లల్ని ఇజ్రాయిల్‌ మిలిటరీ చంపిం దని ది డిఫెన్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇంటర్నేషనల్‌ వివరాలను విడుదల చేసింది. రెండవ ఇంట్ఫాడా 2000వ సంవత్సరంలో ప్రారంభమైంది. గాజా ప్రాంతంలో 23 లక్షల పలస్తీనియన్లు నివసిస్తున్నారు. 2005 నుండి గాజాస్ట్రిప్‌ నుండి ఇజ్రాయిల్‌ వైదొలి గింది. కానీ అటు పిమ్మట నుండి గాజా భూభాగాన్ని ఆక్రమిస్తూ ఇజ్రాయిల్‌ సైనిక దళాలు అమాయక పలస్తీనియన్లపై దాడుల పర్వాల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ దాడుల కాలక్రమాన్ని అల్‌జజీర్‌ పత్రిక విడుదల చేసింది. 1) ఆగస్టు 2005 ఈజిప్టు నుండి గాజాస్ట్రిప్‌ను స్వాధీనపర్చుకొన్న ఇజ్రాయిల్‌ 38 సంవత్సరాల తర్వాత స్థావరాల్ని విడిచిపెట్టి వైదొలగింది. 2) 2006 హమాస్‌ సాయుధ సమూహం 2006 పలస్తీనా ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెల్చుకొంది. 3) 2006లో గాజా సరి హద్దులపై ఇజ్రాయిల్‌ దాడుల్ని చేసింది. 4) డిసెంబరు 2008లో 22 రోజుల సైనిక దాడిని ఇజ్రాయిల్‌ ప్రారంభించి, కాల్పుల విరమణ ఒప్పందానికి ముందే 1400 మంది పాలస్తీనియన్లను చంపింది. ఈ కాల్పుల్లో కేవలం 13 మంది ఇజ్రాయిల్‌ సైనికులు మాత్రమే చనిపోయారు. 5) 2012 హమాస్‌ స్టాఫ్‌ చీఫ్‌ అహ్మద్‌ జఫారీని ఇజ్రాయిల్‌ చంపింది. 6) 2014లో ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో 2100 పల స్తీనియన్లు చనిపోగా 73 మంది ప్రాణాల్ని ఇజ్రాయిల్‌ కోల్పోగా అందులో 73 మంది సైనికులే ఉండడం గమనార్హం. 7) 2018లో గాజా ఫెన్సింగ్‌ సరిహద్దు వద్ద జరిపిన నిరసనల్లో 170 మంది పలస్తీనియన్ల ప్రాణాల్ని ఇజ్రాయిల్‌ బలిగొంది. ఈ నిరసనలు అనేక నెలలు జరిగాయి. 8)2021 మే నెలలో పవిత్ర రంజాన్‌ మాసంలో అల్‌ అక్సా మసీదు వద్ద ప్రార్థనలు చేసుకొంటున్న పలస్తీనియన్లపై ఇజ్రా యిల్‌ దాడులు జరిపింది. కనీసం 260 మంది పలస్తీనీయన్లు మరణించారు. ఈ దాడులు వరుసగా 11రోజులు జరిగాయి. 13మంది ఇజ్రాయిల్‌ సేనలు చనిపోయారు.
23 లక్షల ప్రజానీకంతో ఉన్న గాజాస్ట్రిప్‌లో సగం మంది నిరుద్యోగంతో ఉన్నారు. వైశాల్యం 365 చదరపు కిలోమీటర్లు ఉంది, 64 శాతం ప్రజానీకం ఆకలితో అలమటిస్తున్నారు. పలస్తీనా భూభాగాలైన గాజాస్ట్రిప్‌, వెస్ట్‌బ్యాంకులను ప్రపంచ బహిరంగ కారాగారాలుగా ఇజ్రాయిల్‌ తయారు చేసింది. ఒక వైపు మధ్య ప్రాచ్యంలో అత్యంత శక్తివంతమైన ఇజ్రాయిల్‌ దేశం మిలిటరీ అమెరికా సామ్రాజ్య వాదం చేత దేశమంతా ఆయుధాల్ని ఉంచి, రక్షణ లేని పలస్తీనా దారిద్య్ర దేశంపై బాంబుల వర్షం కురిపిస్తూ ాఇరుదేశాల భయంకరమైన సరిహద్దు పోరాటాన్ని తాత్కాలికంగా కాల్పుల విరమణతో ముగించినట్లు ాాపాశ్చాత్య మీడియా రాసినా ఇజ్రాయిల్‌కు పలస్తీనాకు పోటీ ఎక్కడ? పలస్తీనియన్లు స్వీయరక్షణకు తయారుచేసే ఆయుధాలు దీపావళి టపాకాయలు వంటివి. ఇజ్రాయిల్‌ డ్రోన్లు, ఎఫ్‌`35లు, క్షిపణుల వ్యవస్థ ముందు పలస్తీనా ఎంత? పలస్తీనాను టెర్రరిస్టు దేశంగా పోల్చ టానికి, స్వంత దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని కోరుకోటాన్ని సామ్రాజ్య వాదం అడ్డుకోవటం సిగ్గుచేటు. అమెరికాలో 3 శాతం కూడా లేని యూదులు దేశ సంపదలో 24 శాతం కల్గి ఉన్నారు. ఏ అమెరికా ప్రెసిడెంటుకైనా వారి అండ కావాలి. కనుకనే బైడెన్‌ ఇటీవల తన మొదటి విదేశీ పర్యటనల్లో ఇజ్రాయిల్‌కు ప్రాధాన్యతనిచ్చారు. ఇజ్రాయిల్‌, అమెరికాలు చేసే పాపాలకు అండగా ాఐఒయు 2్ణ పేరిట ఒక కూటమిని ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చాడు. ఈ ఐ2 (ఇండియాGఇజ్రాయిల్‌) యు2 (యుఎస్‌ఎGయుటైటెడ్‌ ఎమిరేట్స్‌) ప్రణాళికకు మన కేంద్ర ప్రభుత్వం మద్దతు పలకటం, పలస్తీనాను వదిలి మన ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయిల్‌ పర్యటించడం ఆహ్వానించటం జాతులను మతాలను ఏరి పారేయాలనే ఇజ్రాయిల్‌ నుండి మనదేశం ఏమి నేర్చుకోనుంది అని భారతీయులు కూడా అడుగుతున్నారు. పలస్తీనా సమస్యకు పరిష్కారం లభ్యం కానంతవరకూ మధ్య ప్రాచ్యంలో శాంతి లేనట్లే, గాజాస్ట్రిప్‌, వెస్ట్‌బ్యాంకుల్లో ఇజ్రాయిల్‌ శాశ్వత కట్టడాలు తీసి, కృత్రిమ సరిహద్దు గోడల్ని నిర్మూలించాలి. జెరూసలెంను ప్రత్యేక ప్రతిపత్తి గల నగరంగా ఐరాస కట్టడిలో ఉంచాలి. భవిష్యత్తు పలస్తీనాకు తూర్పు జెరూసలేంను కేటాయించాలి. అక్కడ నుండి అమెరికా రాయబార కార్యాలయాల్ని ఎత్తేయాలి. అప్పుడుగానీ మధ్యప్రాచ్యంలో శాంతి విరాజిల్లదు. పలస్తీనాకు సంఫీుభావాన్ని ప్రకటిద్దాం.
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్‌ ఫోరం నాయకులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img