Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

కమ్యూనిజం అంటే మోదీకి భయం

డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి

ప్రధాని మోదీ ఇటీవల కమ్యూనిజం చాలా ప్రమాదకరమైన భావజాలం అని పదే పదే చెబుతున్నారంటే భవిష్యత్తులో కమ్యూనిస్టులను తాను ఎదుర్కొవలసి వస్తుందనే భయం ఆయనలో ఉందనే విషయం బయటపడుతోందని పేర్కొన్నారు. సోషలిజం అనేది వారి భావజాలానికి ప్రత్యామ్నాయం అని గుర్తించినట్టేనని చెప్పారు. ఇక లాటిన్‌ అమెరికా, యూరప్‌లోని ఫ్రాన్స్‌, జర్మనీలలో
ఇటీవల జరిగిన వివిధ ఎన్నికల్లో వామపక్షాలు బలపడ్డాయని గుర్తు చేశారు.

కమ్యూనిజం చాలా ప్రమాదకరమైనదని ప్రధాని మోదీ అంటున్నారంటేనే వామపక్షాలకు ఆయన భయ పడుతున్నారనే విషయం బహిర్గతమవుతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ుతో (ఆర్‌ఎస్‌ఎస్‌) కలసిపోయి భారతదేశ లౌకిక వ్యవస్థను ధ్వంసం చేస్తోందని విమర్శిం చారు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ 24వ మహా సభలు అక్టోబరు 14 నుంచి 18 తేదీల్లో విజయవాడ నగరంలో జరుగనున్న నేపథ్యంలో వివిధ స్థాయిల్లో చర్చించిన అనంతరం ఇటీవల పార్టీ రూపొందించిన రాజకీయ ముసాయిదాను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు సీపీఐ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన డి.రాజా ‘ది హిందూ’ పత్రికతో వివిధ అంశాలపై మాట్లాడారు. సీపీఐ రాజకీయ ముసాయిదాపై అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. నాలుగేళ్ల క్రితం కేరళలోని కొల్లాంలో జరిగిన జాతీయ మహాసభల అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధించిన క్రమంలో ప్రస్తుతం దేశంలో రాజకీయ వాతావరణాన్ని ఎలా అంచనా వేస్తు న్నారనే ప్రశ్నకు 2014 నాటి ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడాన్ని ప్రభుత్వ మార్పుగా తాము చూడలేదని రాజా పేర్కొన్నారు. బీజేపీ అనేది ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేసే రాజకీయ విభాగం అని నాడే చెప్పామన్నారు. ఆ పార్టీ లక్షణాల్లో మతతత్వం, విభజన వాదం, ఫాసిస్ట్‌ భావజాలం ఉన్నాయని పేర్కొన్నారు. 2019లో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ దూకుడు పెంచిందని పేర్కొన్నారు. ప్రత్యక్ష్యంగా బీజేపీపై నియంత్రణను కనపరుస్తోందని పేర్కొన్నారు. ఈ రెండిరటి కలయికతో దేశ లౌకిక, సంక్షేమ వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకున్న బీజేపీ దేశానికి ప్రత్యేక మత హోదా కల్పించే కుట్రలు చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే రాజ్యాంగపరమైన అనేక కార్యక్రమాలను మతపరమైన వేడుకలుగా మార్చి ఏకంగా ప్రధాన మంత్రే నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ ఇటువంటి చర్యలు లేవని పేర్కొన్నారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక విధానాలు కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా మార్చి వేసి ఆర్థిక రంగాన్ని వారికి కట్టబెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక పరమైన హక్కులను కూడా హరించి వేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించేవారిపై దాడులు పెరిగాయన్నారు. మైనార్టీలు, దళితులు, ఆదివాసీలపై దౌర్జన్యాలకు దిగుతోందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ ఫాసిజం అని స్పష్టం చేశారు. చైనా, క్యూబా, వియత్నాం తదితర దేశాల పాలనా వ్యవస్థలను రాజకీయ ముసాయిదాలో ఎందుకు పేర్కొ న్నారనే ప్రశ్నకు…ప్రపంచ దేశాల్లో సోషలిస్టు వ్యవస్థలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. సోవియట్‌ యూనియన్‌ పతనం అయినప్పుడు ఇక సోషలిజం అనేది సాధ్యంకాని భావజాలం అని చాలా మంది భావించారని, అయితే ప్రపంచ వ్యాప్తంగా తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. సోషలిజం సాధ్యం కాదు అనే భావాలను తాము ఎప్పుడూ అంగీకరించలేదని చెప్పారు. నేడు సోషలిజం పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయ భావజాలంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇటీవల కమ్యూనిజం చాలా ప్రమాదకరమైన భావజాలం అని పదే పదే చెబుతున్నారంటే భవిష్యత్తులో కమ్యూనిస్టులను తాను ఎదుర్కొవలసి వస్తుందనే భయం ఆయనలో ఉందనే విషయం బయటపడుతోందని పేర్కొన్నారు. సోషలిజం అనేది వారి భావజాలా నికి ప్రత్యామ్నాయం అని గుర్తించినట్టేనని చెప్పారు. ఇక లాటిన్‌ అమెరికా, యూరప్‌లోని ఫ్రాన్స్‌, జర్మనీలలో ఇటీవల జరిగిన వివిధ ఎన్నికల్లో వామపక్షాలు బలపడ్డాయని గుర్తు చేశారు. కరోనా సమయంలో క్యూబా, చైనా, వియత్నాం తదితర సోషలిస్టు వ్యవస్థలు మెరుగైన పనితీరును ప్రదర్శించాయని, ప్రజల ప్రాణాలను నిలిపాయని పేర్కొన్నారు. కానీ దేశంలో అది సాధ్యపడలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో ఆరోగ్య వ్యవస్థలు లేకపోవడంలో భారత్‌లో చాలా ప్రాణ నష్టం జరిగిందని చెప్పారు. కరోనా విపత్తును ప్రైవేటు ఫార్మా కంపెనీలు తమ లాభార్జనకు వినియోగించుకున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమం లోనే సీపీఐగా దేశానికి సోషలిజమే అంతిమ ప్రత్యామ్నాయం అని భావిస్తున్నట్టు చెప్పారు. రాజకీయ ముసాయిదాలో ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించారని..అధికారంలో లేకుండా వాటి అమలు ఎలా అనే ప్రశ్నకు అధి కారంలో లేకున్నా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలపై సీపీఐ పోరాడుతోందని తెలిపారు. దేశంలోని అన్ని రంగాలు సంక్షోభంలోకి కూరుకుపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రజల ముందు ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాన్ని చర్చకు పెడుతున్నట్టు తెలిపారు. విద్య, ఆరోగ్యం, నివాసం, ఉపాధి, ఆహారం, భూమి తదితర కీలక సమస్యలను ప్రజల ముందుకు తెస్తున్నామని చెప్పారు. అధికారంలో లేకపోయినా పార్టీ శ్రేణులు నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని ముసాయిదాలో పేర్కొన్నట్టు వివరించారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యత సరిగాలేని ఈ తరుణంలో 2024లో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నారనే ప్రశ్నకు సమాధానంగా రానున్న ఎన్నికలు కిష్టమైనవేనని పేర్కొన్నారు. అయితే బీజేపీని ఓడిరచడం సాధ్యమేనని చెప్పారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు 35 శాతంపైగా ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇది చిన్న విషయం కాదని చెప్పారు. బీజేపీని ఓడిరచాలంటే దేశంలోని అన్ని వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సి ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అవసరమని ఇందుకు వామపక్షాలు కీల కంగా వ్యవహరించాల్సి ఉందని పేర్కొన్నారు. వామపక్షాల ఐక్యతే ఇతర ప్రజా స్వామ్య, లౌకిక శక్తులను కలుపగలదని చెప్పారు. ఈ క్రమంలో వామపక్షాల పునరేకీకరణ కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. అన్ని కమ్యూనిస్టు పార్టీలు కలసి ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని ఎలా రూపొందించాలో ఆలోచించాల్సిన అవసర ముందని చెప్పారు. ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల నుంచి అన్ని ప్రతిపక్ష పార్టీలు గుణపాఠాలు నేర్చుకుంటూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ ప్రజల పక్షాన బాధ్యతగా పోరాటం చేస్తూ విస్తృతమైన వేదిక నిర్మాణానికి కృషి చేస్తే బీజేపీని నిలువరించవచ్చునని స్పష్టం చేశారు.
(హిందూ సౌజన్యంతో…)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img