Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ

సత్య

కొన్ని అంశాలను ఎంతగా మూసి పెట్టాలని చూసినా సాధ్యం కాదు. తమకు హానికరం కాదు అనుకున్న అనేక నివేదికలను పశ్చిమ దేశాలు వెల్లడిస్తుంటాయి. వాటిని చూసి మన దేశంలో కూడా అనేక మంది పాత సంగతులను అలాగే ఎందుకు వెల్లడిరచకూడదు అనుకుంటారు. గోద్రా రైలు దుర్ఘటన పేరుతో జరిపిన 2002 గుజరాత్‌ మారణకాండ గురించి బ్రిటన్‌ రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన నివేదికల్లోని అంశాలను బహిర్గతంచేస్తే కొంతమంది ఇప్పుడు ధూం ధాం అంటూ మండిపడుతున్నారు. తమ రాయబారి పంపిన అంశాలను బ్రిటన్‌ సరికొత్త పద్ధతుల్లో వెల్లడిరచింది. బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బిబిసి) రెండవ ఛానల్‌ ‘‘భారత్‌ : మోదీ వివాదం’’ (ఇండియా:ద మోదీ క్వొశ్చన్‌) పేరుతో 2023 జనవరి 17న ప్రసారం చేసిన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ తొలి భాగం ఆ దురంతాలను గుర్తుకు తెచ్చి మరోసారి నరేంద్రమోదీ, సంఘపరివార్‌ సంస్థల పేర్లను జనం నోళ్లలో నానేట్లు చేసింది. బిబిసికి సమాచారం ఇచ్చిన తీరు మీద బ్రిటన్‌ ప్రభుత్వాన్ని ఖండిరచలేని నిస్సహాయస్థితికి ప్రపంచంలో ఎదురులేదని చెబుతున్న నరేంద్రమోదీని నెట్టింది. ప్రతిస్పందిస్తే మరింత పరువు పోతుంది అన్నట్లుగా మాట్లాడకూడదని నిర్ణయించింది. పైకి మాట్లాడినా, మాట్లాడకున్నా ప్రపంచమంతా మోదీ గురించి మరోసారి అవలోకిస్తుంది.
ఈ డాక్యుమెంటరీ వక్రీకరణలతో ప్రచారం కోసం నిర్మించిందని, ఒక నిర్దిష్టమైన పరువుతక్కువ కథనాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు రూపొం దించినదని, దానిమీద ఇంతకు మించి స్పందించాల్సింది కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ పేర్కొన్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. వివాదం తలెత్తటంతో ఈ డాక్యుమెంటరీని యూట్యూబ్‌ నుంచి తొలగించారు. ఈ నెల 24న మరొక భాగం ప్రసారం కావాల్సి ఉంది. తమ కథనాన్ని బిబిసి సమర్థించుకుంది. ఉన్నతమైన సంపాదక ప్రమాణాలకు అనుగుణంగా తీవ్రంగా పరిశోధించిన తరువాత రూపొందించినట్లు పేర్కొన్నది. భిన్నగళాలు, అభిప్రాయాలు వెలిబుచ్చేవారిని, నిపుణులను తాము కలిశామని, బీజేపీికి చెందిన వారి స్పందనల సహా భిన్నాభిప్రాయాలకు దానిలో తావిచ్చామని, తమ డాక్యుమెంటరీలో లేవనెత్తిన అంశాలకు తగినసమాధానం ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరగా స్పందించేందుకు తిరస్కరించినట్లు బిబిసి తన ప్రకటనలో పేర్కొన్నది. గుజరాత్‌ ఉదంతాలు, నరేంద్రమోదీ పాత్ర గురించి ఒక చిత్రాన్ని రూపొం దిస్తున్నట్లు అది ప్రసారంగాక ముందే కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అని బిబిసి ప్రకటన చెబుతున్నది. చర్చ మరింత జరిగితే నరేంద్రమోదీ, బిజెపికి మరింత నష్టంగనుక కేంద్రం నుంచి లేదా బిజెపి దీనిగురించి ముందు ముందు ప్రస్తావించక పోవచ్చు. మొత్తంగా మీడియా నరేంద్రమోదీకి అనుకూలంగా ఉన్నందున పరిమితంగానైనా వార్తలు ఇవ్వకపోవచ్చు, చర్చలు జరపకపోవచ్చు. అంతమాత్రాన రచ్చగాకుండాఉంటుందా, జనం చర్చించకుండా ఉంటారా?
ఏ దేశంలోనైనా పెద్ద ఉదంతాలు జరిగినపుడు ఆ దేశంలో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలు మనదేశం సహా తమ వనరులు, సంబంధాల ద్వారా సమాచారాన్ని సేకరించి వాటిని తమ దేశాలకు చేరవేస్తాయి. వికిలీక్స్‌ వెల్లడిరచిన కోట్ల కొద్దీ పత్రాలవే. గుజరాత్‌ ఉదంతాల గురించి బ్రిటీష్‌ రాయబార కార్యాలయం అలాంటి నివేదికనే ఇచ్చినట్లు దానిలోని అంశాలను డాక్యుమెంటరీ వెల్లడిరచింది. బిబిసికి వాటిని అందించారంటే బ్రిటన్‌ ప్రభుత్వం తొలిసారిగా వాటిని బహిర్గత పరిచినట్లే. అందువలన ఈ డాక్యుమెంటరీ గురించి, దానిలో పేర్కొన్న అంశాల సంగతి ఏమిటని పార్లమెంటులో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఎంపీ ప్రస్తావించినపుడు నోరు మూయించేందుకు ప్రధాని రిషి సునాక్‌ చూశాడు. సమాధానంగా ఏమి చెప్పినప్పటికీ అది మొహమాటంతో చెప్పినవిగానే పరిగణించాలి. నివేదికలోని అంశాలు వాస్తవమా కాదా అని చెప్పకుండా డొంకతిరుగుడు సమాధాన మిచ్చాడు. పాకిస్థాన్‌ మూలాలున్న ఎంపీ ఇమ్రాన్‌ హుసేన్‌ డాక్యుమెంటరీ గురించి ప్రస్తావించగా, దానితో తమకు సంబంధం లేదని, దానిలో భారత ప్రధాని గురించి చిత్రీకరించిన తీరును తాను అంగీకరించటం లేదని రిషి సునాక్‌ చెప్పాడు.మత విద్వేష హింస ఎక్కడ జరిగినా తాము సహించబోమని, అయితే నరేంద్రమోదీ పాత్రను చిత్రించిన తీరును తాను అంగీకరించనని అన్నాడు. ఇంత రచ్చ జరిగిన తరువాత కూడా బిబిసి చిత్రంలో వెల్లడిరచిన అంశాల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరో భాగాన్ని ప్రసారం చేస్తారా లేదా అన్నది చెప్పలేదు. డాక్యుమెంటరీలో పేర్కొన్నదాని ప్రకారం నాటి బ్రిటన్‌ దౌత్యవేత్త పంపిన సమాచార పత్రానికి పెట్టిన శీర్షిక, సంగ్రహం ఇలా ఉంది. ‘‘ విషయము: గుజరాత్‌ మారణకాండ ’’ వెల్లడైనదాని కంటే హింస చాలా ఎక్కువగా ఉంది. కనీసం రెండువేల మంది మరణించారు. పధకం ప్రకారం పెద్ద ఎత్తున ముస్లిం మహిళల మీద అత్యాచారాలు జరిగాయి.లక్షా 38వేల మంది నిరాశ్రయులయ్యారు. హిందువులు ఉండే చోట, హిందువులు`ముస్లింలు కలసి ఉన్న ప్రాంతాలలో ముస్లింల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకొని విధ్వంసం కావించారు. పధకం ప్రకారం హింస జరిగింది. కొన్ని నెలల ముందుగానే పధకం వేసి ఉండవచ్చు. రాజకీయ ప్రేరేపితమైనది. హిందువులుండే ప్రాంతాల నుంచి ముస్లింలను తరమివేయటమే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ రక్షణలో దీనికి విహెచ్‌పి (హిందూ ఉగ్రవాద సంస్థ) నాయకత్వం వహించింది. మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా ఐకమత్యం అసాధ్యం. వారి(హిందూ మూకలు) పధకం ప్రకారం సాగించిన హింసలో నిర్దిష్ట జాతి నిర్మూలన లక్షణాలన్నీ ఉన్నాయి. శిక్షలేమీ ఉండవనే వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించకుండా విహెచ్‌పి అంత ఎక్కువ నష్టం కలిగించి ఉండేది కాదు. దీనికి నరేంద్రమోదీ నేరుగా బాధ్యుడు.’’
ఇంతేకాదు, డాక్యుమెంటరీ వెల్లడిరచిన దాని ప్రకారం బ్రిటన్‌తోపాటు ఐరోపా సమాఖ్య కూడా విచారణ జరిపింది. ఈ రెండు చేసిన దర్యాప్తు సారం ఒక్కటే. హింసాకాండలో మంత్రులు చురుకుగా భాగస్వాములయ్యారు. దాడుల్లో జోక్యం చేసుకోవద్దని సీనియర్‌ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశ్వసనీయమైన వారు చెప్పినదాని ప్రకారం 2002 ఫిబ్రవరి 27న నరేంద్రమోదీ సీనియర్‌ పోలీసు అధికారులతో సమావేశమై జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. అసలు అలాంటి సమావేశం జరగలేదని పోలీసు అధికారి ఒకరు చెప్పినట్లు కూడా బిబిసి తన కథనంలో పేర్కొన్నది. సమావేశం జరిగిందని అంగీకరిస్తే మోదీ ఆదేశాలను అమలు జరిపినట్లుగా అంగీకరించినట్లవుతుంది. ఆ ఉదంతాలకు స్వయంగా కారకులని అంగీకరించినట్లవుతుంది కనుక అసలు సమావేశమే జరగలేదని చెప్పినట్లు కూడా పేర్కొంది. నాడు ఇంటలిజెన్స్‌ విభాగ అధిపతిగా ఉన్న ఆర్‌బి శ్రీకుమార్‌, మరో అధికారి సంజీవభట్‌, మరో అధికారి మాత్రం నరేంద్రమోదీ ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. సదరు సమావేశంలో అసలు వారెవరూ పాల్గొనలేదని అదే కథనంలో మరొక పోలీసు అధికారి చెప్పిన అంశాన్ని కూడా డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. మరొక కేసులో సంజీవ భట్‌ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఈ కథనంలో లేదా నరేంద్రమోదీ మద్దతుదార్లు, బిజెపి ఏమి చెప్పినా కొన్ని సందేహాలకు సరైన సమాధానం రాలేదు. అంతటి శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు ఏ సిఎం అయినా ఇంటలిజెన్స్‌ అధికారిని పిలిపించకుండా, ఉన్నతాధికారుల సమావేశం జరపకుండా, నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారా ?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img