Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

నిబద్దతకు మారు పేరు వెంకయ్యనాయుడు

డా॥ కె.నారాయణ

వాక్చాతుర్యంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనే ముప్పవరపు వెంకయ్యనాయుడు. జీవరాశుల్లో మానవ జన్మ గొప్పది. అయితే సమాజాన్ని నడిపించేం దుకు ఒక చుక్కాని కావాలి. దాన్నే రాజకీయ వ్యవస్థగా అంగీకరించాం. ఎవరికివారు త్రికరణశుద్ధిగా నమ్మి నచ్చిన పార్టీలో చేరుతారు. నేను విద్యార్ధి దశలోనే విద్యార్థి ఉద్యమం ద్వారా రాజకీయ వ్యవస్థను ఎంపిక చేసుకున్నాను. ఆ రాజకీయాలలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రజలకు మేలు చేస్తుందని నమ్మాను. అందులోనే కొనసాగు తున్నాను. అలాగే ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా నెల్లూరులో విద్యార్ధి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావిత విద్యార్థి పరిషత్‌ ద్వారా జనసంఫ్‌ు లోకి, అనంతరం జరిగిన సంస్థాగత మార్పుల కారణంగా బీజేపీలోకి చేరి చిత్తశుద్ధితో ఆ పార్టీకి అంకితమయ్యారు. సమయస్పూర్తి, కాలానుగుణమైన ఎత్తుగడలు, కలుపుగోలుతనం, మంచి మాట, మర్యాద వారి సొంతం. ఎంతటి సమూహంలో కలిసినా వారు నిబద్దత దాటరు. ఏదైనా పని ఉండి వారిని కలిసి సాయం అడిగితే మీరు అడిగిన సాయానికి తమ పార్టీ వారు ఎవరైనా సిఫార్సు కోరితే ముందు వారినే సిఫార్సు చేస్తానని నిర్మొహ మాటంగా చెప్పేవారు. ఇటువంటి సందర్భం నాకు కూడా ఎదురయ్యింది. నెల్లూరు నుంచి విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చేరిన అనం తర కాలంలో జై ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున పడగవిప్పింది. ఆ ఉద్యమంలో వెంకయ్యనాయుడు చురుకైన పాత్ర వహించారు. సంపూర్ణ విప్లవం పేరుతో జయప్రకాశ్‌ నారాయణ నడిపిన ఉద్యమంలో వారితో పాటు పర్యటించి అను వాదకులుగా రాణించారు. తెలుగు తేజం ఎన్‌టీ రామారావు పదవీచ్యుతుడైన తరుణంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో జరిగిన ఉద్యమంలోనూ చురుకైన పాత్ర వహించారు. స్వతహాగానే మంచి ఉపన్యాసకుడు కావడంతో పాపులారిటీకి అది ఉపయోగపడిరది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చు కోవడం, లోపలా బయటా ఎన్ని యిబ్బందులొచ్చినా ఓర్పుగా, నేర్పుగా అధి గమించేవారు. సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఇంతింతై… వటుడిరతింతై అన్న చందాన వెంకయ్య ఎదిగారు. వ్యవస్థలో అత్యున్నతమైన ఆ చివరి మెట్టు కూడా ఎక్కుతాడని అందరూ ఊహించారు. నేను తప్ప. అధ్యక్ష స్థానం అనేది నిస్సందేహంగా సానుకూలంగా ఉండాలి. అయితే ఇప్పుడున్నది స్వతంత్ర ఆలోచనలున్న వాజ్‌పాయ్‌ ప్రభుత్వం కాదు. మోదీ ప్రభుత్వం కాబట్టే ఆమ్రపాలి అటలోలా ఉవ్వెత్తున ఎగసి ముగింపు పలకాల్సి వచ్చింది. నమ్మిన విధానాలకు అంకితం అవ్వడం. తాత్కాలిక ప్రలోభాలకు గురికాకుండా ఉంటే సంతృప్తి మిగులుతుంది. సంతృప్తిని మించిన సంపద మానవ జీవితానికి ఎదీ లేదు. వెంకయ్య నమ్మిన సిద్ధాంతానికి మా సిద్దాం తానికి దూరమే కాదు వైరం కూడా. అయినా నమ్మిన విధానానికి కట్టుబడి పని చేసి ఉపరాష్ట్రపతి పదవీ విరమణ చేస్తున్న వెంకయ్యనాయుడికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. పదవీ విరమణ సాంకే తికమే, జీవిత సాఫల్యం కొరకు అనేక మార్గాలుంటాయి. ఆ మార్గాలను ఎన్నుకునే శక్తి ఆయనకు ఉంటుంది.
వ్యాస రచయిత సీపీఐ జాతీయ కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img