Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

నదీజలాల హక్కుల రక్షణ అవశ్యం

కె.వి.వి. ప్రసాద్‌

రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు సమగ్రంగా వాదనలు వినిపించి కృష్ణానదీ జలాల పున: పంపిణీలో రాష్ట్ర నీటి హక్కులను కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆగస్టు 2వ వారంలోపు రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలతో కూడిన నివేదికను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు ఇవ్వాలని ట్రిబ్యునల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీటి పునః పంపిణీ, ప్రాజెక్టుల నిర్వాహణకు విధి విధానాలను రూపొందించి తమ నివేదిక ద్వారా సూచనలు చేయాలి. ముందుగా ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖామంత్రి తక్షణం రాష్ట్రంలోని రాజకీయ పార్టీల, రైతుసంఘాల, నీటిపారుదల రంగ నిపుణులతో విస్తృత సమావేశం నిర్వహించి రాష్ట్ర నీటి హక్కులను కాపాడేందుకు అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వము జలశక్తి విభాగం 2023 సెప్టెంబరు 6 న భారత ప్రభుత్వం ద్వారా ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కృష్ణానదీ జలాల వివాద పరిష్కారాల ట్రిబ్యునల్‌-1 (బచావత్‌ ట్రిబ్యునల్‌)ు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణానది నుంచి కేటాయించిన 811 టి.యం.సిల నీటిని, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అదనంగా కేటాయించిన నీటిని పరిగణనలోనికి తీసుకుని ఉభయ రాష్ట్రాల మధ్య పున: పంపిణీ చేయాలని కేంద్రం సూచించింది. గోదావరినది జలాల వివాద పరిష్కారాల ట్రిబ్యునల్‌ ఉత్తర్వులననుసరించి, గోదావరినది నుండి కృష్ణానదికి తరలించే నీటి సముదాయాన్ని లెక్కించి పై రాష్ట్రాలకు ఇచ్చే వాటాలను సమీక్షించాలి.
ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల నుంచి తమకు కేటాయించిన / కేటాయించవలసిన నీటిని సమగ్రంగా విశ్లేషించి బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు మన వాదనలను వినిపించాలి. కృష్ణా-గోదావరి నదులపై ఆంధ్రప్రదేశ్‌ చివరి రాష్ట్రమైనందున కృష్ణానది నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి లభించిన నీటి కేటాయింపు ప్రకారం కృష్ణానదిలో 75 శాతం విశ్వసనీయతతో, సాలీనా 2060 టి.యం.సిల నీరు నదీప్రవాహం ద్వారానూ, 70 టి.యం.సిల నీరు రీ జనరేటెడ్‌ విధానం ద్వారా లభిస్తుందని నిర్ధారించారు. సదరు నీటిలో మహారాష్ట్రకు 585 టి.యం.సిలు, కర్నాటకకు 734 టి.యం.సిలు చివరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టి.యం.సిల నీటిని వినియోగించుకునే విధంగా పంపిణీ చేశారు. జస్టిస్‌ బచావత్‌ ట్రిబ్యునల్‌, వివిధ రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాలను పంపిణీ చేసే విషయంలో ఈ క్రింది అంశాలను ప్రప్రథమంగా పరిగణనలోనికి తీసుకున్నది. అంతర్జాతీయంగా అమలులో ఉన్న ప్రధమ వినియోగదారునికి ప్రధమ హక్కు అనే సూత్రాన్ని, మనదేశంలో ఆనాడు అమలులో ఉన్న ఆనవాయితీలను అనుసరించి నీటిని కేటాయించారు. 1969 సెప్టెంబర్‌ 30కు ముందు వివిధ రాష్ట్రాలలో అమలులో ఉన్న కేంద్ర జలసంఘం వారి ఆమోదంతో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యతను కల్పించి నీటిని కేటాయించారు. కర్నాటక రాష్ట్రం లేవనెత్తిన పరీవాహక ప్రాంతాల నిష్పత్తిలో నీటిని కేటాయించాలని కోరగా ట్రిబ్యునల్‌ నిర్ధ్వందంగా తిరస్కరించింది. రాష్ట్రానికి కేటాయించిన 811 టి.యం.సి.ల నీటిని కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లోని వివిధ ప్రాజెక్టులకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014ననుసరించి కృష్ణానదిలో లభించే 811 టియంసిల నీటిలో ఆంధ్రప్రదేశ్‌ 512 టియంసిలు, తెలంగాణా 299 టియంసిలు వినియోగించుకుంటున్నాయి.
జస్ట్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ అధ్యక్షతన కృష్ణా నదీ జలాల వివాదపరిష్కారాల ట్రిబ్యునల్‌2, ఏప్రిల్‌ 2004లో కేంద్రప్రభుత్వం నియమించింది. జస్టిస్‌ బచావత్‌ ట్రిబ్యునల్‌ గతంలో 75శాతం విశ్వసనీయతతో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన కేటాయింపులను ఏ విధమైన మార్పులు చేయకుండా యధాతదంగా వినియోగించుకునే ఆవకాశం కల్పించింది. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ నూతనంగా లెక్కించిన సగటు నీటి లభ్యత 2578 టియంసిల నీటి నుండి బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం కేటాయించిన 2130 టియంసిల నీటిని మినహాయించి మిగిలిన 448 టియంసిల నీటిని వివిధ రాష్ట్రాలకు కేటాయించింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ 1005 టియంసిల నీరు వాడుకొనే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014లోని 11 షెడ్యూల్‌ ప్రకారం మిగులు జలాలతో రాష్ట్రంలోని హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరునగరి, పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, తెలంగాణాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు నిర్మించడానికి అనుమతిలభించింది. మహారాష్ట్ర, కర్నాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల అభ్యర్థన మేరకు కేంద్రప్రభుత్వం 1969లో గోదావరి నదీజలాల వివాదాల పరిష్కారాల వివాదాల పరిష్కారాల జస్టిస్‌ బచావత్‌ అధ్యక్షతన ఏర్పాటుచేసింది. 75శాతం విశ్వసనీయతతో గోదావరి నదిలో ప్రవహించే నీటిని 3216 టియంసిలుగా నిర్ధారించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1472.70 టియంసిల నీటిని కేటాయించింది. అలాగే పోలవరం ప్రాజెక్టునుండి కృష్ణానదికి తరలించే 80 టియంసిల నీటిలో ఎగువ రాష్ట్రాలకు 45టియంసిల నీటిని ఇచ్చారు. నేడు తెలంగాణా రాష్ట్రం గోదావరినదిలో మనకు ఎగువ రాష్ట్రమైనందున ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన 45టియంసిలలోనే వారి వాటాను కోరటం సముచితంగా ఉంటుంది. కృష్ణాగోదావరి నదులలో ఆంధ్రప్రదేశ్‌ నీటి హక్కుల రక్షణకు ప్రభుత్వం తక్షణం పూనుకోవాలి. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు రైతాంగంపక్షాన ప్రభుత్వం తమ వాదనలు వినిపించేందుకు ఎటువంటి జాప్యం లేకుండా కృషి చేయాలి. ఈ నేపధ్యంలో మన రైతాంగం పక్షాన ఈ క్రింది అంశాలను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు ఉంచాలి.
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 గత ట్రిబ్యునల్స్‌ వారి తుది ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏవిధమైన అనుమతులు లేకుండా తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న, నిర్మించాలని తలపెట్టిన ప్రాజెక్టులు, ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం – ఫేజ్‌-2, వలన దిగువ రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్‌కు జరిగే అనర్ధాలను ట్రిబ్యునల్‌ వారికి నివేదించాలి. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ నుండి, తెలంగాణా 99 టి.యం.సిల నీటిని, ఆంధ్రప్రదేశ్‌ 33 టి.యం.సిల నీటిని వినియోగించుకోవలసి ఉన్నది. కాని, మన రాష్ట్రానికి రావలసిన 33 టి.యం.సిల నీరు, ముఖ్యంగా 3,4 జోన్లకు ఏ సంవత్సరంలో కూడా నీరందని పరిస్థితిని వివరించాలి.ఎగువ రాష్ట్రాలైన, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాల వర్షపు నీటిని నిలువ చేసుకొనే విధానాలను అమలుపర్చటం వలన మనకు సకాలంలో నీరు లభించని పరిస్థితిని వివరించవలసి ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా-గోదావరి నదులకు చివరి రాష్ట్రమైనందున, అటు వరదల వలన, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినపుడు, రైతాంగం నష్టపోయే పరిస్థితులను గమనించి తగిన పరిహారాన్ని అందచేయటానికి తగిన సూచనలను ఇవ్వవలసిందిగా ట్రిబ్యునల్‌ను కోరాలి.
గత కొన్ని సంవత్సరాలలో ఎగువనున్న రాష్ట్రాలు అంతర్‌ రాష్ట్ర జల వివాదాల చట్టం 1956, ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014కు వ్యతిరేకంగా నిర్మిస్తున్న, నిర్మించిన ప్రాజెక్టుల నీటి వినియోగాన్ని ఆయారాష్ట్రాలకు కేటాయించిన నీటి పరిమాణాల నుంచి మాత్రమే నీటి వినియోగం కేటాయించవలసిన అవసరాన్ని తెలియచేయాలి. గోదావరి నది నీటిపంపిణీ విషయం చర్చించేందుకు ఉభయ రాష్ట్రాల మధ్య ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరం పులిచింతల ప్రాజెక్టులో 30.23 టియంసిల నీరు నిలువ ఉండేలా నిర్ణయించి అమలు చేయాలి. ప్రతి సంవత్సరం కృష్ణా డెల్టాకు జూన్‌ నెల మొదటివారంలో నారుమళ్ళు పెంచుకోవడానికి నీటిని విడుదలచేసి డెల్టాలోని కాలువలకు నీరందించే విధంగా విధి విధానాలు రూపొందించాలి. డెల్టా ప్రాంతంలోని సుమారు 70 లక్షల మంది ప్రజల తాగునీటి ఆవసరాలకు (మార్చి నుండి జూన్‌ వరకు) నాగార్జున సాగర్‌ నుండి నీటిని విడుదలచేయాలి. నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులలో విద్యుత్‌ ఉత్పత్తిని వ్యవసాయ, సాగునీటి అవసరాలనుబట్టి అనుసంధానించాలి. ప్రతి సంవత్సరం మార్చి నుండి జూన్‌ వరకు విద్యుత్‌ ఉత్పత్తి నిలుపుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లుకు వినతిపత్రాలు సమర్పించి ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురానున్నారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని పై అంశాలను చర్చించేందుకు రాజకీయపార్టీలు, రైతుసంఘాలు, సాగునీటిరంగ నిపుణులతో సమావేశం నిర్వహించాలని కోరుతున్నాను.

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి
సెల్‌: 9490952737

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img