Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

బ్యాంకుల విధ్వంసానికి మోదీ రెడీ

అమర్‌జిత్‌ కౌర్‌
ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 1969లో ప్రధాని ఇందిరాగాంధీ చేసిన బ్యాంకుల జాతీయకరణ దేశానికి, ప్రజలకు దాదాపు సర్వరంగాలకు ఉపయోగపడిరది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్యాంకింగ్‌ వ్యవస్థను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి పూనుకున్నది. జాతీయం చేయగా రైతులకు, వృత్తి కళాకారులకు, అణగారిన వర్గాల ప్రజలకు చిన్న వ్యాపారాలకు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు, విద్యార్థులకు, యువకులకు, బ్యాంకుల్లో విభిన్న తరగతుల ప్రజలకు, మహిళలకు ఉద్యోగాలను కల్పించడానికి రుణాలు ప్రభుత్వరంగ బ్యాంకులు ఉపయోగపడ్డాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థ సంపన్నులకు, బడా వ్యాపారులకు, పెద్దపరిశ్రమలకు రుణాలు అందచేసింది.
ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించడం, ప్రైవేటీకరించడం వీలైతే విక్రయించడం, ప్రభుత్వ సేవలను కార్పొరేట్‌ స్నేహితులకు అందించడం నిరంతరం కొనసాగుతున్నది. కరోనా మహమ్మారి కాలంలో ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కనీసం నిరసన తెలియజేయటానికి వీలులేకుండా విపత్తుల నిర్వహణచట్టాన్ని అమలు చేయడం ద్వారా ఆంక్షలు విధించింది. మోదీ ప్రభుత్వ హయాంలో 16లక్షల కోట్ల రుణబకాయిలను రద్దుచేసి బడా సంపన్నులకు ఎంతగానో తోడ్పడిరది. బ్యాంకులకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన అనేకమంది సంపన్నులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే అనేక బ్యాంకులను విలీనంచేశారు. ఫలితంగా అనేకమంది ఉద్యోగులు, ఖాతాదారులు, బ్యాంకుల విలీనం మూలంగా ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రెండు బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయరంగాన్ని దెబ్బతీసేందుకు మూడు సాగు దుష్టచట్టాలను చేసింది. రాజ్యసభ నుంచి 8మంది ఎంపీలను బలవంతంగా బైటకుపంపి ఈ చట్టాన్ని ఆమోదించారు. మూడు కార్మిక కోడ్‌లను ఆమోదించి అంతక్రితం ఉన్న దాదాపు 40పైగా చట్టాలను రద్దు చేశారు. కార్మికరంగంపై కక్షకట్టినట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
మోదీ గత పదేళ్లకాలంలో సామాజిక వ్యవస్థను ధ్వంసం చేశారు. బీజేపీపై పెత్తనం చెలాయిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఏనాడూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదు. స్వాతంత్య్ర పోరాటంలో ఆమోదించిన త్రివర్ణపతాకాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆమోదించలేదు. నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఇంతవరకు ఎగురవేయలేదు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్గొనకుండా దాన్ని వ్యతిరేకించింది. బ్రిటీష్‌ పాలకులు అనుసరించిన విభజించి, పాలించు సూత్రీకరణను ఇప్పటి ప్రభుత్వం అనుసరిస్తోంది. సమాజంలో మత విభజనకు అన్ని విధాలుగా పనిచేస్తున్నారు. దేశ విభజన సమయంలో మతోన్మాదుల, వివిధ మతవాదులు, ఒక గ్రూపుపై మరో గ్రూపు విచ్చలవిడిగా దౌర్జన్యాలతో హత్యాకాండకు పూనుకోవడంతో రక్తం ఏరులైపారింది. స్వాతంత్య్రోద్యమంకోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు. తమ ఆస్తులను పోరాటాలకోసం ఇచ్చారు. విదేశీ పాలనను రైతులు గట్టిగా వ్యతిరేకించి పోరాటంలో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయలు, కళాకారులు, జర్నలిస్టులు అనేకరంగాల ప్రజలు మహత్తర స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఈ దశలోనే ట్రేడ్‌యూనియన్‌ ఉద్యమం ఏఐటీయసీ నాయకత్వంలో రూపుదిద్దుకుంది. 1920లో ఏఐటీయూసీిని స్థాపించారు. రష్యాలో అక్టోబరు విప్లవం విజయం సాధించిన తరుణంలో ఏఐటీయూసీి ఏర్పడిరది. మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత కార్మికవర్గ ఉద్యమం ప్రపంచమంతటా ఊపు అందుకుంది. 1925లో కమ్యూనిస్టు గ్రూపులన్నీ కలిసి భారత కమ్యూనిస్టుపార్టీగా కాన్పూర్‌లో స్థాపించారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్య్రోద్యమాలు విద్యార్థులను, యువకులను ఎంతగానో ప్రోత్సహించాయి. వారంతా కలిసి స్వాతంత్య్ర పోరాటాల్ని మరింత విస్తరించారు. ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు బ్యాంకులతో సహా అన్ని రంగాలలో యూనియన్లు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన ప్రభుత్వం తీవ్ర పేదరికం, ఆకలి, నిరక్షరాస్యత, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంకోసం అనేక ప్రణాళికలు రూపొందించి అమలు జరిపింది. సహజవనరులు, వీటినుంచి వచ్చిన ఆస్తులు ప్రజలకు చెందినవని ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ సంపదను ప్రజల సంక్షేమంకోసం వినియోగించాలని ప్రభుత్వం నిశ్చయించింది. బ్యాంకుల మోసాలకు గురైన వారికి ఏఐటీయూసీ నాయకత్వంలోని యూనియన్లు పోరాటంచేసి ఆదుకున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థ సాధారణ ప్రజలకు ఉపయోగపడాలని ఏఐబీఈఏ నాయకత్వంలో పోరాటం చేశారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏఐబీఈఏ అనేక పోరాటాలు చేపట్టింది. ఉద్యోగులు సమస్యలపై 23సంవత్సరాలుగా పోరాటం జరుగుతూనే ఉంది. కార్మికవర్గ పోరాటాలకు భారత కమ్యూనిస్టుపార్టీ అండగా నిలిచింది. కార్మికవర్గం, రైతులు, సామాన్యులు తమ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీల సహాయాలను కోరుతూ వారు చేస్తున్న పోరాటాలకు మద్దతునిస్తున్నారు. భారతీయ జనసంఫ్‌ుపార్టీ బీజేపీగా ఏర్పడిరది. ప్రజాపంపిణీ వ్యవస్థను, భూసంస్కరణలను జమిందార్లు, సంస్థానాధీశులకు ఇస్తున్న రాజభరణాల రద్దును జనసంఫ్‌ు వ్యతిరేకించింది.
బ్యాంకుల జాతీయీకరణ కొనసాగింపును బీజేపీ వ్యతిరేకిస్తోంది. పార్లమెంటు చర్చల్లో జాతీయీకరణను కొనసాగించడం బీజేపీకి ఇష్టంలేదని స్పష్టమవుతోంది. ప్రభుత్వరంగ పరిశ్రమలను కూడా అది వ్యతిరేకిస్తోంది. బ్యాంకుల జాతీయీకరణను వ్యతిరేకిస్తూ గతంలో భారతీయ జనసంఫ్‌ుగా ఉన్నప్పుడు పార్టీ నాయకుడు ఒకరు కోర్టుకు వెళ్లారు. దేశ సంక్షేమంకోసం బ్యాంకుల జాతీయకరణ అమలు చేయాలని పార్లమెంటు ఆమోదించింది. 1990ల మధ్యకాలంలో గాట్‌ను రద్దు చేశారు. దాని స్థానంలో ప్రపంచ వాణిజ్యసంస్థను ఏర్పాటుచేశారు. వివిధ దేశాలు అభివృద్ధి కోసం సహాయం పొందడానికి ఈ సంస్థ అనేక ఆంక్షలు విధించింది. నయా ఉదారవాద ఆర్ధిక విధానాలు 1990ల ప్రారంభంనుంచి మనదేశంలో అమలయ్యాయి. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ తరఫున ప్రపంచ పెట్టుబడీదారీ విధానం, వ్యవస్థీకృత సర్దుబాటు కార్యక్రమాలు తదితర ముందు షరతులను విధించి అభివృద్ధి నిధులను పొందవచ్చునని ప్రపంచ వాణిజ్యసంస్థ ప్రకటించింది. అంతేకాదు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వ సేవలను, సంక్షేమ కార్యక్రమాల అమలును నిలిపివేయాలని ఈ సంస్థ కఠినమైన ఆంక్షలను విధించింది. ఈ సంస్థ విధించిన ఆంక్షలలో బ్యాంకుల జాతీయీకరణను రద్దు చేయాలనేదికూడా ఒకటి. వీటికి వ్యతిరేకంగా ప్రజలునిరసన, సమ్మెలు నిర్వహించారు.
ప్రపంచ ఆర్థికమాంద్యం మన దేశంలోనూ తలెత్తకుండా బలంగా ఉన్న ప్రభుత్వరంగం, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ రంగాలు ఎంతగానో ఉపయోగపడేవి. నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలు దేశీయ, విదేశీ కార్పొరేట్లకు ఉపయోగపడుతున్నాయి. పర్యవసానంగా దేశీయ పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక స్వతంత్రతను నాశనంచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మార్కెట్‌శక్తులు ప్రజల భవితవ్యాన్ని నిర్ణయించేదశలో దేశ పరిస్థితి నడుస్తోంది. దేశవ్యతిరేక విధానాలను కార్మికులు, రైతులు, ఇతర గ్రూపుల ప్రజలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకింగ్‌ పరిశ్రమ ప్రజలు సానుకూలంగా ఉన్నాయని భావించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో బ్యాంకులు 1.47లక్షల కోట్లు లాభం సంపాదించాయి. 2019లో 0.82లక్షల కోట్లు నష్టపోయింది. 2019లో ప్రభుత్వ బ్యాంకుల నిరర్ధక ఆస్థులు (ఎన్‌పీఏ) 12.3శాతానికి తగ్గాయి. ప్రభుత్వరంగ బ్యాంకులను, ఇతర సంస్థలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరుగుతున్నాయి. బ్యాంకు యూనియన్లు జాతీయకరణ జరిగి 55 సంవత్సరాలైన సందర్భంగా ఉద్యోగులు అనేక సమావేశాలను నిర్వహించి ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img