Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

వెనుజులాలో కీలుబొమ్మ ప్రభుత్వానికై అమెరికా ఆరాటం

బుడ్డిగ జమిందార్‌

వామపక్ష నికోలాస్‌ మదురో మూడవసారి వెనుజులా అధ్యక్షునిగా 51.2 శాతం ఓట్లతో ఎన్నికైనట్లు జులై 9 జాతీయ ఎన్నికల కమిటీ ప్రకటించింది. మితవాద ఫాసిస్టు ఎర్మోండో గొంజాలెజ్‌కు 44.2 శాతం ఓట్లు పోలయినవి. సామ్రాజ్యవాద వ్యతిరేక వెనుజులా ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఎన్నికలలో అమెరికా నిధులతో బొలివేరియన్‌ ప్రభుత్వ ప్రత్యమ్నాయంగా కీలుబొమ్మ ప్రభుత్వంకోసం అమెరికా చేయని ఆలోచనలేదు, వేయని ఎత్తుగడలేదు. అయినా మోజారిటీ ప్రజలు మదురోనే ఎన్నుకున్నారు. ప్రపంచ చమురు నిల్వలలో 17శాతంతో అగ్రభాగాన ఉన్న వెనుజులా ఆర్థికవ్యవస్థను అక్కడి కార్మికవర్గాన్ని అతి తక్కువ వేతనాలతో పనిచేయించుకోవడం ద్వారా అత్యధిక లాభార్జనకోసం అమెరికా చమురు కంపెనీలు వ్యూహరచనలు చేస్తూ, సామ్రాజ్యవాద వ్యతిరేక మదురో ప్రభుత్వాన్ని దింపటానికి విఫలయత్నం చేశాయి.
ఫలితాలు పూర్తిగా వెలువడకముందే ఎన్నికల ఫలితాలు వెనుజులా ప్రజల అభీష్టాన్ని (అమెరికాకు అనుకూలంగా) ప్రతిబింబించడంలేదని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ప్రకటించాడు. పూర్తి ఫలితాలు ప్రకటించిన పిదప మదురో వెనుజులా ప్రజల తీర్పుకు విరుద్ధంగా అధ్యక్షుడుగా ప్రకటించుకొన్నాడని, ప్రతిపక్షనాయకుడు ఎడ్మండో గొంజాలెజ్‌కు అనుకూలంగా ప్రజలు ఓట్లు వేసినట్లుగా తమ వద్ద అనేక ఆధారాలున్నాయని బ్లింకెన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ప్రతిపక్ష పౌరులుగా ప్రకటించుకొన్న ‘ప్లాట్‌ఫారమ్‌’ నాయకులకు, పార్టీలకు ప్రభుత్వ మార్పుకోసం సిఐఏ ఆధ్వర్యంలో అమెరికా డాలర్ల వర్షం కురిపిస్తూనే ఉన్నా ఫలితం లేకపోయింది. మాజీ దౌత్యవేత్త మారియా కొరినా మకాడోను అమెరికా తన ఆస్తిగా పేర్కొంది. కానీ అవినీతిపరుడైన మకాడోను ఎన్నికల్లో అనర్హుడుగా వెనుజులా కోర్టులు ప్రకటించాయి.
ఓడిపోయిన గొంజాలెజ్‌ను అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్‌ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు అభినందించారని అమెరికా విదేశీమంత్రిత్వశాఖ ఒక ప్రకటించింది. మదురో ఎన్నికను గౌరవిస్తూ చైనా, రష్యా, ఇరాన్‌ దేశాలు అభినందనలు తెలిపాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా మదురో అధ్యక్షునిగా ఎన్నికైతే అమెరికా గుర్తించలేదు.అపుడు వెనుజులాపై విపరీతమైన ఆర్థిక ఆంక్షలను విధించింది. అప్పటి ప్రతిపక్షనాయకుడు జువాన్‌ గౌడోను తాత్కాలిక అధ్యక్షునిగా నియమించి కొలంబో నుండి సమాంతర వెనుజులా ప్రభుత్వాన్ని నడపజూపి అమెరికా విఫలం చెందింది. ఆంక్షల నేపధ్యలో 2018`20 మధ్య వేల శాతానికి ఎగబాకిన ద్రవ్యోల్బణం ఈ మధ్యనే కుదుటపడి 100శాతం లోపుకు చేరింది. దీనిపైకూడా అమెరికాకు అక్కసుగానే ఉంది. ఆంక్షలతో ఆకలిబాధలతో సుమారు 4వేల మంది మరణించారని సెంటర్‌ఫర్‌ ఎకనమిక్‌ పాలసీ పరిశోధనా సంస్థ తెలిపింది. అయినా అమెరికా తన కక్షసాధింపుధోరణిని వదలటంలేదు.
ప్రస్తుతం వెనుజులా ఆర్థికవ్యవస్థను ఇంకా దిగజార్చటానికి ఆంక్షల ద్వారా, అంతర్వ్యుద్ధం ద్వారా, సమాంతర ప్రభుత్వాన్ని గుర్తిస్తూ అస్థిరపరచటానికి అమెరికా వ్యూహం పన్నుతుంది. దక్షిణ అమెరికా ఖండంలోని దేశాల్ని అభివృద్ధి చెందనీయకుండా అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాల్ని నియమించడం ద్వారాను అమెరికాకు ఎదురుతిరిగిన దేశాధ్యక్షులను మార్చటమో లేకుంటే హత్యగావించటం అమెరికా పుట్టుకతో నేర్చుకున్న విద్య.
లాటిన్‌ అమెరికాలో అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను అణగదొక్కి రాజ్య ఉగ్రవాదం ద్వారా, గూఢచారి వర్గాల సమాచార వ్యవస్థలతో ప్రభుత్వాలను కూలదోసి, రాజ్యాధినేతలను హత్యగావించటం 1968నుండి ‘‘ఆపరేషన్‌ కొండోర్‌’’ పేరుతో అమెరికా ఆరంభించింది. 1975నాటికి సీఐఏ ద్వారా నియంతృత్వశక్తులను దక్షిణ అమెరికాలో ప్రోత్సహించింది. తాజాగా వెనుజులాలో కూడా ఈ తరహా ప్రయత్నాలే జరుగుతున్నాయి. సీఐఏ వ్యవస్థ తనకు అడ్డువచ్చిన వేలాది రైతు నాయకులను, కార్మికులను, విద్యార్థులను, టీచర్లను, మేథావులను అమానుషంగా చంపింది. 70వ దశకంలో అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే, పరాగ్వే, బొలీవియా, బ్రెజిల్‌ దేశాల్లో మిలిటరీ తోడ్పాటుతో ఆయుధాలు సరఫరా చేసింది. ఈక్వెడార్‌, పెరూల్లో జుంటాస్‌ను సృష్టించి కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రోత్సహించింది. చిలీ అధ్యక్షుడు సాల్వెడార్‌ అలెండీ మరణానికి కారణమైంది. పినోఛెట్‌ మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పటి క్యూబన్‌ అధ్యక్షుడు ఫిడేల్‌ కాస్ట్రోపై 638సార్లు హత్యా ప్రయత్నం చేయగా ప్రతిసారీ కాస్ట్రో సీఐఏ ఉచ్చునుండి తప్పించుకోగల్గాడు.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా అనుకూల ప్రభుత్వాలకోసం వందలసంఖ్యలో అమెరికా ప్రయత్నించి సఫలీకృతమైంది. ఇప్పటికీ ఆఫ్రికా, యూరపు, ఆసియా,లాటిన్‌ అమెరికా దేశాల్ల సామ్రాజ్యవాదం కార్పొరేట్‌ అనుకూల ప్రభుత్వాల కోసం కృషిచేస్తూనే ఉంది. తాజాగా సిరియా, ఎమెన్‌, పలస్తీనా, ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఉత్తరకొరియా, రష్యా, వెనుజులా, లిబియా, లెబనాన్‌, ఉక్రెయిన్‌ వంటి అనేక చోట్ల వ్యూహరచనలు చేస్తూనేఉంది. మరొకవైపు ఐఎమ్‌ఎఫ్‌ ప్రపంచబ్యాంకుల ద్వారా కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికవ్యవస్థను నాశనంచేస్తూ ముఖ్యంగా లాటిన్‌ అమెరికా దేశాల్లోని ముడిపదార్ధాలు, చౌకైన సహజ వనరులపై కన్నేసి అమెరికా ఆర్ధికవ్యవస్థకు సహజసంపద సరఫరాలదారులుగా దక్షిణ అమెరికా దేశాలను పరిగణిస్తుంది.
ఐఎమ్‌ఎఫ్‌ రుణాలను తీర్చలేని అభివృధ్ధి చెందుతున్న దేశాలు 70,80,90 దశకాల్లో దక్షిణ అమెరికా దేశాలు చెతులెత్తేసినవి. జీడీపీ నుండి విదేశీ రుణభారం 70శాతం పైగా చేరింది. ఈ దేశాలపై ఐఎమ్‌ఎఫ్‌ తీవ్రమైన కాఠిన్యంతో, ఆర్థిక షరతులు విధించటంతో ప్రభుత్వాలు పబ్లిక్‌ సర్వీసులను నిరక్ష్యం చేశాయి. పెట్టుబడులు కుంటుబడ్డాయి. సుంకాలు, వాణిజ్యంపై షరతులు విధిస్తూ అమెరికా స్వేచ్ఛా వాణిజ్యాల ఒప్పందంపై సంతకాలుచేసేలా దక్షిణ అమెరికా దేశాలపై ఆధారపడి వ్యవసాయ ఉత్పత్తుల్ని, ఖనిజసంపదను, లిధియం వంటి ముడిసరుకు, మాంసం ధర అమెరికా కార్పొరేట్లు నిర్ణయించిన దరలకు విక్రయించసాగి లాటిన్‌ అమెరికా దేశాల ఆర్థికవ్యవస్థలు చిన్నాభిన్నమై పోయాయి. ఈ దేశాలు ఇప్పటికీ ఆర్థికపరంగా కోలుకోలేదు. ప్రపంచార్థిక మార్కెట్‌లపై స్పష్టంగా నిలకడలేని చెల్లించలేని ప్రజారుణాల్ని జారీచేయడం ద్వారా సంపన్న సమూహాలకు, కార్పొరేట్‌లకు అనుకూల ఆర్థిక వ్యవస్థలుగా లాటిన్‌ అమెరికా దేశాల రూపురేఖలు మారిపోయాయి. ఇందుకోసం ఇపుడు వెనుజులాను బలహీనపర్చుటద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వంకోసం అమెరికా తహతహలాడుతున్నది. అమెరికా సామ్రాజ్యవాదానికి బలవుతున్న అనేక దేశాలు మరలా వామపక్ష ప్రభుత్వాలను ఎన్నుకొంటున్నారు. ఈ మార్పులను తాజాగా మనం మెక్సికో, కొలంబియా, చిలీ మొదలగు దేశాలలో మనం చూస్తున్నాము.

ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం
సెల్‌ 9849491969

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img