Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజా సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యం..

ప్రజా సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యం..

- Advertisement -

రెండవ వార్డ్ సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థి బుడుగు వెంకటనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రజా సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యము అని, అభివృద్ధి అనేది వైఎస్సార్సీపీ పార్టీకి, సిపిఐ పార్టీ కే సాధ్యమవుతుందని రెండవ వార్డ్ సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థి బుడుగు వెంకట నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రెండవ వార్డులో సిపిఐ, వైఎస్ఆర్సిపి నాయకులు తమ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాన్ని పంపిణీ చేస్తూ రెండవ వార్డును అభివృద్ధి బాటలో నడుపుతామని వారు తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్గా వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి కాచర్ల అంజిని ఫ్యాన్ గుర్తు తో అత్యధిక ఓట్లతో చైర్మన్గా గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. రెండో వార్డులో కౌన్సిలర్ గా కంకి కొడవలి గుర్తుకు ఓటు వేస్తూ గెలిపిస్తూ ఓటు వేయాలని తెలిపారు. రెండవ వార్డ్ లో కూడా ప్రజలు వారికి స్వాగతం పలికారు. గతంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వారు గుర్తు చేశారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధిని చేపడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి రమణ , గుర్రం వెంకటస్వామి, శ్రీనివాసులు, నారాయణస్వామి, విజయ భాస్కర్, శ్రీధర్, పాముల శ్రీనివాసులు, సంకారపు రాజా, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు