విశాలాంధ్ర – హిందూపురం: పట్టణంలో నూతనంగా నిర్మాణ దశలో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో విద్యుత్ షాక్కు గురై నాగార్జున (పెయింటర్) శనివారం మృతి చెందాడు. మున్సిపల్ పరిధిలోని కోట్నూరు గ్రామానికి చెందిన నాగార్జున పెయింటింగ్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.శనివారం యథావిధిగా ఇంటి నుంచి ఇస్కాన్ టెంపుల్కు పెయింటింగ్ పనుల కోసం వెళ్లిన నాగార్జున పనులు చేస్తుండగా కిందపడిన విద్యుత్ వైరు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై కిందపడిపోయాడు. దీంతో అక్కడున్న స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే నాగార్జున మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కోట్నూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇస్కాన్ టెంపుల్లో విద్యుత్ షాక్తో పెయింటర్ మృతి
- Advertisement -
RELATED ARTICLES


