విశాలాంధ్ర – పార్వతీపురం : పార్వతీపురం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసరుగా ఐపీఎస్ అధికారి సురాన అంకిత మహావీర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు .అనంతరం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకేను అందజేసారు.
జిల్లాకు మంచి సేవలు అందించాలని, ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.ఇంతవరకు ఇక్కడ సబ్ డివిజన్ ఏఎస్పీగా పనిచేసిన సునీల్ షరోన్ కు బదిలీకాగా అతని స్థానంలో కొవ్వూరు నుండి అంకిత మహావీర్ ఇక్కడకు వచ్చి జాయిన్ అయ్యారు. కొత్తగా జాయిన్ అయిన వెంటనే ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.