సీతానగరం : 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సీతానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ పలగర.శ్రీదేవి ,గ్రామసర్పంచ్ జొన్నాడ తేరేజమ్మ, యంపిటిసిలు సురగాల. గౌరీ బురిడి సూర్యనారాయణ ,ఉపసర్పంచ్ కె.అరవింద్ గ్రామపెద్దలు సాలా.హరిగోపాల్, బుడితి.శ్రీను,ఇజ్జాడ. రాంబాబు,సబ్బానశ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు విశ్వేశ్వరరావు,ఆరిశెట్టి.గోవిందరావు,. శంకర రావులు పాల్గొన్నారని హెచ్ ఎం ఇళ్లా ప్రసన్న లక్ష్మి తెలిపారు.పాఠశాలలో 2023-24 విద్యాసంవత్సరం లో ప్రతిభకనపరచిన మర్రాపు. హేమంత్ కుమార్ ,బంకురు లీలాప్రసన్న, తామరాపు హాసిని, గంటహైమవతిలకు నగదు బహుమతులు, మెమోంటోలతో దాతలు అయ్యగారి ఆనంద్ 5వేలు,
.చుక్క.శ్రీనివాస్(బిల్డర్ ) 10వేలు,
గేదెల వెంకట్(అమెరికా) 10వేలు,జొన్నలగడ్డ జగదీష్ (ఇంజనీర్)
350 పెన్నుల సెట్లు,
డాక్టరు ఏ ఉమ నాలుగు మెడల్స్, నాలుగు
మెమోంటోలను అందించగా వాటిని అందజేసారు.ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు విశ్వేశ్వరరావు,ఆరిశెట్టి గోవిందరాజులు గేమ్స్ విజేతలకు కంపాస్ బాక్స్లు,టిఫిన్ బాక్సులు అందించారని హెచ్ ఎం ప్రసన్నలక్ష్మి తెలిపారు.