విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో 20మంది తహశీల్దార్లకు పోస్టింగులు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. సార్వత్రిక ఎన్నికలదృష్ట్యా ఎన్నికలకమిషన్ వివిధజిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు గతవారం జిల్లాకు తిరిగిరాగా వారికి బుదవారంఉదయం పోస్టింగులు కేటాయిస్తూ జిల్లాకలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పార్వతీపురం తహాశీల్దారుగా జివి జనార్ధన్, సీతానగరం తహాశీల్దారుగా పి. అప్పలరాజు, బలిజిపేట తహసీల్దారుగా ఆర్. ఉమామహేశ్వరరావు, భామిని తహశీల్దారుగా పి. సోమేశ్వరరావు, సీతంపేట తహసిల్దారుగా ఎం.అప్పారావు, పాచిపెంట తహసీల్దారుగా డి.రవి, కురుపాం తహసిల్దారుగా ఎం.రమణమ్మ, పాలకొండ తహసిల్దారుగా ఆర్. బాలమురళీకృష్ణ, గరుగుబిల్లి తహసీల్దారుగా ఎం. భుజంగరావు, కొమరాడ తహాసిల్దారుగా జె.రాములమ్మ, గుమ్మలక్ష్మిపురం తహాసీల్దార్ గా ఆర్. రమేష్ కుమార్ ,జియ్యమ్మవలస తహసీల్దారుగా డీవీ సీతారామయ్యలను నియమిస్తూ జిల్లాకలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం కలెక్టరేట్ పరిపాలన అధికారిగా ఎం.సావిత్రి, పార్వతీపురం ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారిగా ఎస్.నరసింహమూర్తి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఈ, ఎఫ్, జి సెక్షన్ సూపరింటెండెంట్ గా జి శ్రీరామ్మూర్తి, కె ఆర్ ఆర్ సి స్పెషల్ స్పెషల్ తహసీల్దారుగా ఎన్ భాస్కరరావు (పార్వతీపురం), కె.ఆర్.ఆర్.సి స్పెషల్ తహసిల్దారుగా వి. రామస్వామి (పాలకొండ), పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ డి, హెచ్ -సెక్షన్ సూపరింటెండెంట్ గా ఎన్ శివన్నారాయణ, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ సి-సెక్షన్ సూపరింటెండెంట్ గా సి.హెచ్ రాధాక్రిష్ణలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.