Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

నేత్రదానం దేవుడిచ్చిన వరం…

నేత్రదానం చేయండి… మరొకరికి చూపు కలిగించండి
ప్రారంభమైన జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు

విశాలాంధ్ర, పార్వతీపురం:శరీరంలో ఏ అవయవానికి భాధ కలిగించిన ఆబాధను కల్లే వ్యక్త పరుస్తూ వుంటుంది. ఁ సర్వెంద్రీయానాం నయనం ప్రధానం ఁ అనే సూక్తి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ప్రకృతి అందాలను కల్లున్న ప్రతీ ఒక్కరూ చూసి ఆరాధించి మధురానుభూతి పొందుతుంటారు.
ఆకళ్లే కనిపించక పోతే జీవితం అంధకార మవుతుంది. ప్రఖ్యాత రచయిత హెలెన్ కెల్లర్ మాటల్లో చెప్పాలంటే ఁనాకు దేవుడు మూడు రోజులు కంటి చూపును ప్రసాదిస్తే చాలు మీరు ఎవరు జీవితంలో చూడలేనివి నేను మూడు రోజులలో చూస్తానని అన్నారు. ఁఐస్ ఆర్ విండోస్ ఆఫ్ ద సోల్ఁ…కళ్ళు తెరిస్తే ప్రపంచం మన ముందుంటుంది, ఆకళ్ళే మూసుకుంటే అంతాఅంధకారమే. మన జీవితంలో అంధకారానికి చోటివ్వకుండా వుండాలంటే కంటి విషయం లో అత్యంత శ్రద్ధ పెట్టాలి. అంధుల్లో కూడా చదరంగం ఆట ఆడే మేధావులు,గొప్పకవులు, రచయితలు, గాయకులు, వాద్యకారులు, కళాకారులు,అపరమేధావులు ఇలా చెప్పుకుపోతే ఎందరో వున్నారు. మనం వారి నైపుణ్యం మెచ్చుకోవడం, నాలుగు సానుభూతి వ్యాక్యాలు పలకడం తప్ప అంధులు కోసం చేస్తున్నదేమిటి అని ఒక్కసారి ఆత్మ పరీశీలన చేసుకుంటే చాలా మందికి అసంతృప్తే మిగులుతుంది. అంధులకు మనం చూపాల్సింది సానుభూతి కాదు. అందమైన ప్రపంచం లోని రంగులు, కలాఖండాలు, ఇతరత్రా వింతలు, విడ్డురాలు, ప్రకృతి అందాలను తిలకించే అపూర్వ అవకాశాన్ని కల్పించాలి.ప్రతీఒక్కరూ మరణానంతరం నేత్రాలను దానంచేస్తే ఎంతో మందికి కంటి చూపును ప్రసాదించే భాగ్యం కలుగుతుంది. దీనిద్వారా 80శాతంఅంధత్వం నివారించవచ్చును. మరియు చికిత్సకు వీలు కల్పిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల మంది అంధులు వున్నారు.ప్రతీ 5 సెకండ్లుకి ఒక వ్యక్తి అంధుడు అవుతున్నాడు.వీరిలో 7.1శాతం మంది ఁ కార్నియా స్కార్స్ఁ (నల్లని గుడ్డు పై తెల్లనిమచ్చ) తో కంటి చూపును కోల్పోతున్నారు. అటువంటి వారికి ఁకార్నియా గ్రాఫ్టింగ్ఁ (నల్లనిగుడ్డు మార్పిడి) చేసి నట్లయితే ఎందరో అంధులకు తిరిగికంటి చూపును ప్రసాదించే అవకాశం ఉంది. అటువంటి గుడ్డుమార్పిడి కోసం నేత్రాలను స్వీకరించడానికి దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8వరకు ఈనేత్రదాన పక్షోత్సావాలు నిర్వహిస్తున్నారు.
నేత్రదానం అనే ప్రక్రియ దాతచనిపోయిన తరువాత మాత్రమే జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి కంటిలో వున్న నల్లటి పొరను మాత్రమే ఉపయోగిస్తారు.
ఈనల్లటి పొరను అంధుల కళ్ళకు ఉపయోగించడం ఆధునిక వైద్య శాస్త్రం అందించిన ఒక అద్భుతవరం. ఒక్కధాత ఇచ్చిన రెండు కళ్ళతో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించే భాగ్యం కలుగుతుంది. మానవుడు చనిపోయిన అరు గంటలు లోపే నేత్రాలను స్వీకరించి అంధుడు అయిన వ్యక్తికి ఇరవై నాలుగు గంటలు లోపే అమర్చితే నేత్రదానం ఆశించిన ప్రయోజనం కలుగుతుంది.కావున ప్రతీఒక్కరూ మరణానంతరం నేత్రాలను దానంచేసి అంధులకు చూపును ప్రసాదించే భాగ్యం పొందాలని జిల్లా కంటి వెలుగు సెల్ నేత్ర వైద్య అధికారి డా నగేష్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు..ఈ సందర్భంగా అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయనతెలిపారు.
1.డా బి.జగన్నాధరావు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
పార్వతీపురం మన్యం జిల్లా
జిల్లాలో అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంల పరిధిలో అవగాహన సదస్సులు నిర్వహించి నేత్ర దానంపై అపోహలు తొలగించి మరణానంతరం నేత్రాలు దానం చేసి ఇద్దరు అందులకు చూపును ప్రసాదించు భాగ్యం పొందాలని సూచించారు.
2.డా సుకుమార్ బాబు
జిల్లాఅంధత్వ నివారణ అధికారి ,
పార్వతీపురం మన్యం జిల్లా
జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించి నేత్ర దానం చేయుటకు కృషి చేస్తామని తెలిపారు. నేత్ర దానం ఆవశ్యకతను తెలియజేసి నేత్రదానంపై చైతన్యం ప్రజల్లో కలిపిస్తున్నట్లు తెలిపారు.
3.డాక్టరు జీరు నగేష్ రెడ్డి
జిల్లా కంటివెలుగు సెల్ నేత్రవైద్యఅధికారి,
కురుపాం (పార్వతీపురం ) జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు దేశమంతా ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8వరకు నిర్వహిస్తున్నారన్నారు. దేశములో ఎన్నో లక్షలమంది పూర్తి అందత్వముతో బాధపడుచున్నారని తెలిపారు.కానీ ప్రతీ సంవత్సరం 50వేల మంది కార్నియాలు నేత్రదానం ద్వారా లభిస్తున్నట్లు తెలిపారు. కావున నేత్రదానంపై అవగాహన కోసం
ఈకార్యక్రమం నిర్వహించి ఎక్కువ మంది నేత్ర దానం చేస్తే ఎక్కువ మందికి కంటి చూపును తెప్పించడానికి అవకాశం ఉందన్నారు. నేత్ర దానం మనిషి మరణించిన తరువాతనే నిర్వహిస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img